Jump to content

ఆస్తి

వికీపీడియా నుండి
(ఆస్తులు నుండి దారిమార్పు చెందింది)
ప్రభుత్వ ఆస్తి

ఆస్తి (Property) అనగా ఒక వ్యక్తి లేదా సంస్థలకు గల ధనం.

ఆస్తి స్థిరాస్తి లేదా చరాస్తి అని రెండు రకాలు. ఇల్లు, భూములు మొదలైన వాటిని స్థిరాస్తులు అంటారు.

  • ఆస్తి హక్కులు (Property rights): ప్రతీ దేశంలో ఒకరి ఆస్తి మరొకరికి చెందే హక్కులుంటాయి. భారతదేశంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆతని ఆస్తి అతని పిల్లలకు చెందుతుంది.
  • ఆస్తి పన్ను (Property tax): ప్రతీ దేశంలో ఒకరి గల ఆస్తి మీద ఆ దేశ లేదా రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను.

మంత్రుల ఆస్తుల నియమావళి

[మార్చు]

కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రుల ఆస్తుల, అప్పుల వెల్లడిపై ప్రధాని మన్మోహన్‌ ప్రవర్తన నియమావళి రూపొందించారు. కేంద్ర, రాష్ట్రాల మంత్రులు ఇకనుంచీ ప్రతీ ఏడాది ఆగస్టు 31 లోపు ఆస్తుల వివరాలు సమర్పించాలి. వీటిలో అన్ని రకాల స్థిరాస్తులు, షేర్లు, ఆభరణాలు, నగదుకు సంబంధించిన వివరాలు ఉండాలి. ప్రభుత్వానికి ఏ రకమైన సేవలు, సరుకులు సరఫరా చేసే వ్యాపారంతో సంబంధం ఉన్న మంత్రులైనా ఆ వ్యాపార బాధ్యతల నుంచి తప్పుకొని వాటిని తమ కుటుంబ సభ్యులకు బదలాయించాలి. మంత్రులెవరూ ఎటువంటి వ్యాపారాలను ప్రారంభించకూడదు. మంత్రులు విరాళాలను, నిధులను స్వీకరించకూడదు. ఖరీదైన బహుమతులను తీసుకోకూడదు. రాష్ట్రాల మంత్రులు ఆస్తుల వివరాలను తమ ముఖ్యమంత్రికి అందజేయాల్సి ఉంటుంది. [1]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు 4.2.2010 ఆర్టికల్
"https://te.wikipedia.org/w/index.php?title=ఆస్తి&oldid=3390107" నుండి వెలికితీశారు