ఇ.ఎ.ఎస్. ప్రసన్న

వికీపీడియా నుండి
(ఎర్రపల్లి ప్రసన్న నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
EAS Prasanna Cross, ESI Hospital Road, Dommaluru Ward, Bengaluru

ఎరపల్లి అనంతరావు శ్రీనివాస్ ప్రసన్న (ఇ.ఎ.ఎస్. ప్రసన్న), భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 1970 దశాబ్దంలో భారతదేశానికి క్రికెట్ లో మంచి సేవలందించాడు. 1976-77 లో ఇంగ్లాండు పర్యటనలో అత్యధిక వికెట్లు సాధించాడు. దేశవాళి క్రికెట్ పోటీ, రంజీ ట్రోఫీలో కర్ణాటకకు నాయకత్వం వహించి 2 పర్యాయాలు గెలిపించాడు. 1962 నుంచి 1978 మధ్యకాలంలో 49 టెస్టులలో భారత జట్టులో ప్రాతినిధ్యం వహించి 735 పరుగులు చేసాడు. అతని అత్యధిక స్కోరు 37 పరుగులు, సగటు స్కొరు 11.48 పరుగులు. బౌలింగ్ లో 189 వికెట్లు సాధించాడు. ఇప్పటికీ అత్యధిక వికెట్లు సాధించిన భారతీయ బౌలర్లలో ఇతను 7 వ స్థానంలో ఉన్నాడు. అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడి, హర్‌భజన్ సింగ్, చంద్రశేఖర్, జవగళ్ శ్రీనాథ్ ల తర్వాత స్థానం ఇతనిదే. బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ 76 పరుగులకు 8 వికెట్లు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 10 సార్లు, మ్యాచ్ లో 10 వికెట్లను 2 సార్లు సాధించాడు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]