చమిందా వాస్
చమిందా వాస్ | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
బ్యాటింగ్ శైలి | ఎడమచేతి బ్యాటింగ్ | |||
బౌలింగ్ శైలి | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | |||
కెరీర్ గణాంకాలు | ||||
Tests | ODIs | |||
మ్యాచ్‌లు | 102 | 312 | ||
పరుగులు | 2815 | 1953 | ||
బ్యాటింగ్ సగటు | 23.85 | 13.65 | ||
100లు/50లు | 1/12 | -/1 | ||
అత్యుత్తమ స్కోరు | 100* | 50* | ||
ఓవర్లు | 3631 | 2550 | ||
వికెట్లు | 331 | 392 | ||
బౌలింగ్ సగటు | 29.43 | 27.25 | ||
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 11 | 4 | ||
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | 2 | n/a | ||
అత్యుత్తమ బౌలింగ్ | 71/7 | 19/8 | ||
క్యాచ్ లు/స్టంపింగులు | 30/- | 58/- | ||
As of 2 ఫిబ్రవరి, 2008 |
1974, జనవరి 27న జన్మించిన చమిండా వాస్ (Chaminda Vaas) శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 1994లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన వాస్ ఫాస్ట్ బౌలర్‌గా మంచి పేరు సంపాదించాడు. అదే సంవత్సరం విదేశాలలో శ్రీలంక జట్టుకు తొలి టెస్ట్ మ్యాచ్ విజయాన్ని అందించిన ఘనత కూడా పొందినాడు. న్యూజీలాండ్తో నేపియర్లో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్సులో 47/5, రెండో ఇన్నింగ్సులో 43/5 గణాంకాలతో మ్యాచ్‌ను గెలిపించాడు. 2001-02లో వెస్ట్‌ఇండీస్తో జరిగిన సీరీస్‌లో 26 వికెట్లు సాధించి సీరీస్ విజయానికి దోహదపడ్డాడు. అదే సీరీస్‌లో ఒక మ్యాచ్‌లో 14 వికెట్లు పడగొట్టి ఆ ఘనత సాధించిన రెండు ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరుసంపాదించాడు.
టెస్ట్ క్రికెట్ గాణాంకాలు[మార్చు]
చమిండావాస్ 102 టెస్ట్‌మ్యాచ్‌లు ఆడి 29.33 సగటుతో 331 వికెట్లు సాధించాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 11 సార్లు, ఒకే టెస్ట్‌లో 10 వికెట్లను 20 సార్లు పొందినాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 71 పరుగులకు 7 వికెట్లు. బ్యాటింగ్‌లో 23.54 సగటుతో 2815 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 12 అర్థసెంచరీలు ఉన్నాయి. అతను సాధించిన ఏకైక సెంచరీ 2007, జూన్ 26న బంగ్లాదేశ్ పై సాధించాడు. సెంచరీ పూర్తికాగానే 577/6 స్కోరు వద్ద శ్రీలంక ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంతో అతని అత్యధిక స్కోరు 100 (నాటౌట్) వద్ద నిలిచిపోయింది.
వన్డే గణాంకాలు[మార్చు]
చమిండావాస్ 312 వన్డేలలో శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 392 వికెట్లను సాధించాడు.[1] ఒకే వన్డేలో 5 వికెట్లను 4 సార్లు సాధించాడు. వన్డేలలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 19 పరుగులకు 8 వికెట్లు. 2005, డిసెంబర్ 12న భారత్ పై ఆడుతూ 300 వికెట్ల మైలురాయిని చేరుకొని ముత్తయ్య మురళీధరన్ తర్వాత ఈ ఘనత పొందిన రెండో శ్రీలంక బౌలర్‌గా అవతరించాడు. వన్డేలలో 2 సార్లు హాట్రిక్ కూడా సాధించాడు. మొదటి సారి వన్డేలలో అతను అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ (19/8) సాధించిన మ్యాచ్‌లోనే న్యూజీలాండ్‌పై సాధించగా రెండో పర్యాయం 2003 ప్రపంచ కప్ సమయంలో బంగ్లాదేశ్ పై ఆడుతూ సాధించాడు. ఆట ప్రారంభంలోనే తొలి మూడు బంతులకు 3 వికెట్లు సాధించడం వన్డే చరిత్రలోనే అది ప్రథమ పర్యాయం. బ్యాటింగ్‌లో కూడా 1953 పరుగులు సాధించాడు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 50 పరుగులు (నాటౌట్).
ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]
చమిండా వాస్ శ్రీలంక ప్రపంచ కప్ సాధించిన 1996లో తొలిసారిగా ప్రపంచ కప్ టోర్నమెంటులో ఆడినాడు. ఆ తరువాత 1999, 2003, 2007లలో కూడా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2003 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌పై సాధించిన అపురూపమైన హాట్రిక్ అతనికి మంచిపేరు తెచ్చింది.