Jump to content

దేవధర్ ట్రోఫీ

వికీపీడియా నుండి


దేవధర్ ట్రోఫీ
దేశాలు India
నిర్వాహకుడుబిసిసిఐ
ఫార్మాట్లిస్ట్ ఎ క్రికెట్
తొలి టోర్నమెంటు1973-74
చివరి టోర్నమెంటు2023 దేవధర్ ట్రోఫీ
తరువాతి టోర్నమెంటు2024 దేవధర్ ట్రోఫీ
టోర్నమెంటు ఫార్మాట్రౌండ్ రాబిన్, ఫైనల్స్
జట్ల సంఖ్య6
ప్రస్తుత ఛాంపియన్సౌత్ జోన్ (9వ టైటిల్)
అత్యంత విజయవంతమైన వారునార్త్ జోన్ (13 టైటిళ్ళు)
అత్యధిక పరుగులురియాన్ పరాగ్
అత్యధిక వికెట్లువిద్వత్ కావేరప్ప
వెబ్‌సైటు[1]

ప్రొ. DB దేవధర్ ట్రోఫీ లేదా కేవలం దేవధర్ ట్రోఫీ (IDFC ఫస్ట్ బ్యాంక్ దేవధర్ ట్రోఫీ), [1] భారతదేశపు దేశీయ లిస్ట్ A క్రికెట్ టోర్నమెంటు. దీనికి ప్రొఫెసర్ డిబి దేవధర్ (భారత క్రికెట్‌లో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని పిలుస్తారు) పేరిట ఆ పేరు పెట్టారు. 3 జాతీయ స్థాయి జట్లు - ఇండియా ఎ, ఇండియా బి, ఇండియా సి - పాల్గొనే 50 ఓవర్ల వార్షిక నాకౌట్ పోటీ ఇది. 2023 ఆగస్టులో జరిగిన తాజా ఫైనల్‌లో సౌత్ జోన్‌, ఈస్ట్ జోన్‌ను 45 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. [2]

చరిత్ర, ఆకృతి

[మార్చు]

ఈ పోటీని 1973-74 సీజన్‌లో ఇంటర్-జోనల్ టోర్నమెంట్‌గా ప్రవేశపెట్టారు. 1973-74 నుండి 2014-15 వరకు, రెండు జోనల్ జట్లు క్వార్టర్-ఫైనల్‌లో ఆడేవి. అందులో విజేత, సెమీ-ఫైనల్‌లో ఇతర మూడు జోనల్ జట్లతో ఆడెది. అక్కడ నుండి, ఇది మామూలు నాకౌట్ టోర్నమెంటు లాగానే జరుగుతుంది. 2015-16 నుండి 2017-18 వరకు, విజయ్ హజారే ట్రోఫీ విజేతలు, ఇండియా A, ఇండియా B లు రౌండ్-రాబిన్ పద్ధతిలో ఒకరితో ఒకరు ఆడేవారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. [3]

2018–19 నుండి, ఇండియా A, ఇండియా B, ఇండియా C జట్లు రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఒకదానితో ఒకటి ఆడుతున్నాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి.

గత విజేతలు

[మార్చు]
బుతువు విజేత [4]
1973-74 సౌత్ జోన్
1974-75 సౌత్ జోన్
1975-76 వెస్ట్ జోన్
1976-77 సెంట్రల్ జోన్
1977-78 నార్త్ జోన్
1978-79 సౌత్ జోన్
1979-80 వెస్ట్ జోన్
1980-81 సౌత్ జోన్
1981-82 సౌత్ జోన్
1982-83 వెస్ట్ జోన్
1983-84 వెస్ట్ జోన్
1984-85 వెస్ట్ జోన్
1985-86 వెస్ట్ జోన్
1986-87 నార్త్ జోన్
1987-88 నార్త్ జోన్
1988-89 నార్త్ జోన్
1989-90 నార్త్ జోన్
1990-91 వెస్ట్ జోన్
1991-92 సౌత్ జోన్
1992-93 ఈస్ట్ జోన్
1993-94 ఈస్ట్ జోన్
1994-95 సెంట్రల్ జోన్
1995-96 నార్త్ జోన్
1996-97 ఈస్ట్ జోన్
1997-98 నార్త్ జోన్
1998-99 సెంట్రల్ జోన్
1999-2000 నార్త్ జోన్
2000-01 సౌత్ జోన్,

సెంట్రల్ జోన్ (పంచుకున్నాయి)

2001-02 సౌత్ జోన్
2002-03 నార్త్ జోన్
2003-04 ఈస్ట్ జోన్
2004-05 నార్త్ జోన్
2005-06 నార్త్ జోన్
2006-07 వెస్ట్ జోన్
2007-08 సెంట్రల్ జోన్
2008-09 వెస్ట్ జోన్
2009-10 నార్త్ జోన్
2010-11 నార్త్ జోన్
2011-12 వెస్ట్ జోన్
2012-13 వెస్ట్ జోన్
2013-14 వెస్ట్ జోన్
2014-15 ఈస్ట్ జోన్
2015-16 ఇండియా ఎ
2016-17 తమిళనాడు
2017-18 ఇండియా బి
2018-19 ఇండియా సి
2019-20 ఇండియా బి
2023-24 సౌత్ జోన్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Latest Business and Financial News : The Economic Times on mobile". m.economictimes.com. Retrieved 2022-09-21.
  2. Sen, Rohan (4 November 2019). "Deodhar Trophy final: India B ride on Kedar Jadhav, Shahbaz Nadeem show to beat India C". India Today (in ఇంగ్లీష్). Retrieved 2019-11-06.
  3. "BCCI revamps Deodhar and Vijay Hazare trophy". 21 July 2015.
  4. "Deodhar Trophy". ESPNcricinfo. Retrieved 23 October 2018.