ఇందర్ శేఖర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇందర్ శేఖర్ రెడ్డి
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1980-12-20) 1980 డిసెంబరు 20 (వయసు 43)
హైదరాబాదు, తెలంగాణ
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006-2010హైదరాబాదు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్టు-ఏ ట్వంటీ20
మ్యాచ్‌లు 17 32 6
చేసిన పరుగులు 271 131 23
బ్యాటింగు సగటు 13.55 11.90 -
100s/50s 0/1 0/0 0/0
అత్యధిక స్కోరు 53* 20* 19*
వేసిన బంతులు 3,088 1,715 126
వికెట్లు 49 40 6
బౌలింగు సగటు 24.26 30.17 19.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/28 5/28 3/20
క్యాచ్‌లు/స్టంపింగులు 5/0 11/0 4/0

ఇందర్ శేఖర్ రెడ్డి, తెలంగాణకు చెందిన భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 2001 నుండి 2006 మధ్యకాలంలో హైదరాబాదు క్రికెట్ టీం తరపున పదిహేడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1]

జననం

[మార్చు]

శేఖర్ రెడ్డి 1980 డిసెంబరు 20న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.

మ్యాచ్‌లు

[మార్చు]

ఫస్ట్-క్లాస్

[మార్చు]

2001-02 మధ్యకాలంలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2006 డిసెంబరు 9 నుండి 12 వరకు హైదరాబాదులో గుజరాత్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[2] 17 మ్యాచ్‌లలో 13.55 సగటుతో 271 పరుగులు చేశాడు. 1 అర్థ సెంచరీ చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 53తో నాటౌట్ గా నిలిచాడు.

బౌలింగ్ లో 3,088 బాల్స్ వేసి 24.26 సగటుతో 49 వికెట్లు తీశాడు. ఉత్తమ బౌలింగ్ 4/28.

లిస్టు-ఎ

[మార్చు]

2001-02 మధ్యకాలంలో లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2007 ఫిబ్రవరి 16న హైదరాబాదులో కర్ణాటక క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[3] 32 మ్యాచ్‌లలో 11.90 సగటుతో 131 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 20తో నాటౌట్ గా నిలిచాడు.

బౌలింగ్ లో 1,715 బాల్స్ వేసి 30.17 సగటుతో 40 వికెట్లు తీశాడు. ఉత్తమ బౌలింగ్ 5/28.

ట్వంటీ20

[మార్చు]

2007, ఏప్రిల్ 03న విశాఖపట్టణంలో గోవా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ట్వంటీ20 క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[4] 2010 అక్టోబరు 15న హైదరాబాదులో కేరళ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[5] 6 మ్యాచ్‌లలో 23 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 23తో నాటౌట్ గా నిలిచాడు.

బౌలింగ్ లో 126 బాల్స్ వేసి 19.33 సగటుతో 6 వికెట్లు తీశాడు. ఉత్తమ బౌలింగ్ 3/20.

మూలాలు

[మార్చు]
  1. "Inder Shekar Reddy". ESPN Cricinfo. Retrieved 2022-12-24.
  2. "Full Scorecard of Hyderabad vs Gujarat Group B 2006/07 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-12-26. Retrieved 2022-12-24.
  3. "Full Scorecard of Hyderabad vs Karnataka South Zone 2006/07 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-12-24. Retrieved 2022-12-24.
  4. "Full Scorecard of Hyderabad vs Goa South Zone 2006/07 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-12-13. Retrieved 2022-12-24.
  5. "Full Scorecard of Hyderabad vs Kerala South Zone 2010/11 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-12-24. Retrieved 2022-12-24.

బయటి లింకులు

[మార్చు]