గొంగడి త్రిష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొంగడి త్రిష
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గొంగడి త్రిష
పుట్టిన తేదీ (2005-12-15) 2005 డిసెంబరు 15 (వయసు 18)
భద్రాచలం, తెలంగాణ
ఎత్తు5'6
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం లెగ్ బ్రేక్
పాత్రAll-rounder
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017/18–presentహైదరాబాదు
కెరీర్ గణాంకాలు
పోటీ మలిఎ WT20
మ్యాచ్‌లు 20 21
చేసిన పరుగులు 370 335
బ్యాటింగు సగటు 20.55 22.33
100లు/50లు 0/2 0/2
అత్యధిక స్కోరు 69 56*
వేసిన బంతులు 1,094 406
వికెట్లు 17 16
బౌలింగు సగటు 25.82 21.81
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/17 3/10
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 3/–
మూలం: CricketArchive, 31 January 2023

గొంగడి త్రిష తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి. 12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికైన త్రిష, చిన్న వయసులోనే బీసీసీఐ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును కూడా గెలుచుకుంది. లెగ్ స్పిన్నర్ అయిన త్రిష, బ్యాటింగ్ లోనూ తన పవర్ హిట్టింగ్ తో రాణిస్తూ ఆల్ రౌండర్ గా పేరు సంపాదించింది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డును కూడా నెలకొల్పింది.[1]

టీమిండియా అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికై 2022 నవంబరు 27 నుండి డిసెంబరు 6 వరకు న్యూజిలాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడింది.[2] మహిళల టీమ్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ మిథాలీ రాజ్‌ తర్వాత తెలంగాణ నుంచి భారత జట్టులో స్థానం దక్కించుకొన్న క్రీడాకారిణిగా త్రిష నిలిచింది.

2023లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[3]

జననం[మార్చు]

త్రిష 2005, డిసెంబరు 15న తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో జన్మించింది. తండ్రి రాంరెడ్డి.

క్రికెట్ రంగం[మార్చు]

మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచే క్రికెట్ పై ఆసక్తితో క్రికెట్ లో మెళకువలు నేర్చుకుంది. ఎనిమిదేళ్ళ వయసులోనే ప్రతిభ చూపి జిల్లాస్థాయి అండర్-16 జట్టుకు ఆడి ఉమెన్ ఆఫ్ ద సిరీస్​గా ఎంపికైంది. ఆ తరువాత 12 ఏళ్ళ వయసులో అండర్-19 జట్టుకు ఆడింది.

జైపూర్ లో జరిగిన అండర్-19 మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో 2021 నవంబరు 2న ఇండియా-ఎతో జరిగిన మ్యాచ్​లో ఓపెనర్​గా 158 బంతుల్లో 112 పరుగులు (17 ఫోర్లు) చేసింది. ఇండియా-డితో జరిగిన మ్యాచ్​లో 54 పరుగులు చేసింది. ఇండియా-డితో 2021 నవంబరు 7 జరిగిన ఫైనల్ మ్యాచ్​లో 116 బంతుల్లో 78 పరుగులు (10 ఫోర్లు, 1సిక్సర్​) చేసి నాటౌట్​గా నిలిచింది. ఆ టోర్నీలో మొత్తంగా 260 పరుగులు (ఒక శతకం, రెండు అర్ధ శతకాలు) చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్​లో 10 ఓవర్లు బౌలింగ్ లో మూడు మెయిడిన్ ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది.[4]

2021 మహిళల ప్రపంచ కప్ కోసం బీసీసీఐ అత్యుత్తమ ఆటగాళ్ళ ఎంపికకు నిర్వహించిన ప్రత్యేక టోర్నీలో ఇండియా-బి జట్టుకు ఆడి ప్రతి మ్యాచ్​లోనూ బౌలింగ్, బ్యాటింగ్​లో మంచి గణాంకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అండర్-19 వరల్డ్ కప్ మహిళల జట్టుకి ఎంపికయింది.

2022 నవంబరు 29న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ అండర్‌-19 జట్టుపై భారత అండర్‌-19 జట్టు ఘన విజయం సాధించడంలో త్రిష (36; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌... ఒక వికెట్) కీలకపాత్ర పోషించింది.[5]

2023, జనవరిలో ఐసీసీ తొలిసారి నిర్వహించిన అండర్‌‌‌‌19 విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో 24 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.[6][7]

పురస్కారాలు[మార్చు]

  1. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - తెలంగాణ ప్రభుత్వం, 2023 మార్చి 8[8]

మూలాలు[మార్చు]

  1. "Gongadi Trisha: బంతితో, బ్యాట్‌తో రాణిస్తోన్న తెలంగాణ అమ్మాయి". ETV Bharat News. 2021-11-27. Archived from the original on 2022-12-01. Retrieved 2022-12-01.
  2. Today, Telangana (2022-11-22). "Gongadi Trisha and M Shabnam from Telugu States get selected for India U19 Women's squad". Telangana Today. Archived from the original on 2022-11-22. Retrieved 2022-11-30.
  3. telugu (7 March 2023). "27 మందికి మహిళా పురస్కారాలు.. రూ.లక్ష నగదు పారితోషికం." Archived from the original on 7 March 2023. Retrieved 7 March 2023.
  4. "గొంగడి త్రిష.. భారత జట్టు ఆశాకిరణంగా హైదరాబాదీ!". ETV Bharat News. 2021-11-08. Archived from the original on 2022-12-01. Retrieved 2022-12-01.
  5. telugu, NT News (2022-11-30). "త్రిష మెరుపులు". www.ntnews.com. Archived from the original on 2022-11-30. Retrieved 2022-11-30.
  6. https://www.v6velugu.com/world-winning-teenage-cricketers
  7. "Women U-19 T20 World Cup: అండర్ 19 మహిళల టీ20 ప్రపంచ కప్ విజేత భారత్, ఫైనల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి గొంగడి త్రిష". BBC News తెలుగు. 2023-01-29. Retrieved 2023-01-30.
  8. telugu, NT News (2023-03-09). "Women awards 2023 | మహిళకు నమస్కారం.. ప్రతిభకు పురస్కారం". www.ntnews.com. Archived from the original on 2023-03-09. Retrieved 2023-03-13.

బయటి లింకులు[మార్చు]