చెట్టితోడి షంషుద్దీన్
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | చెట్టితోడి షంషుద్దీన్ |
| పుట్టిన తేదీ | 1970 మార్చి 22 హైదరాబాదు, తెలంగాణ |
| పాత్ర | క్రికెట్ అంపైర్ |
| అంపైరుగా | |
| అంపైరింగు చేసిన వన్డేలు | 43 (2013–2020) |
| అంపైరింగు చేసిన టి20Is | 21 (2012–2020) |
మూలం: ESPNcricinfo, 12 ఫిబ్రవరి 2020 | |
చెట్టితోడి షంషుద్దీన్, తెలంగాణకు చెందిన భారతదేశ క్రికెట్ అంపైర్. ఆన్-ఫీల్డ్ విభాగంలో ఐసిసి అంపైర్ల ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ ప్యానెల్ సభ్యుడిగా, వన్ డే ఇంటర్నేషనల్స్ కు, ట్వంటీ20 ఇంటర్నేషనల్స్ కు అధికారిగా ఉన్నాడు.
జననం
[మార్చు]షంషుద్దీన్ 1970 మార్చి 22న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.
అంపైరింగ్ కెరీర్
[మార్చు]వన్ డే ఇంటర్నేషనల్స్
షంషుద్దీన్ 2013 అక్టోబరు 19న ఇండియా - ఆస్ట్రేలియాల మధ్య మొహాలీలో జరిగిన వన్ డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్ కు తొలిసారిగా అంపైరింగ్ చేశాడు.[1] 2020 ఫిబ్రవరి 11న నేపాల్ - యుఎస్ఏల మధ్య కీర్తిపూర్లో జరిగిన మ్యాచ్ కు చివరిసారిగా అంపైరింగ్ చేశాడు.[2]
ట్వంటీ20
షంషుద్దీన్ 2012 డిసెంబరు 20న ఇండియా - ఇంగ్లాండ్‌ల మధ్య పూణేలో జరిగిన ట్వంటీ20 మ్యాచ్ కు తొలిసారిగా అంపైరింగ్ చేశాడు.[3] 2020 జనవరి 07న ఇండియా - శ్రీలంకల మధ్య ఇండోర్‌లో జరిగిన మ్యాచ్ కు చివరిసారిగా అంపైరింగ్ చేశాడు.[4]
మ్యాచ్ ల వివరాలు
[మార్చు]| ఫార్మాట్ | మ్యాచ్ లు | అంపైర్ | టీవి అంపైర్ |
|---|---|---|---|
| టెస్ట్ | 6 | 6 | |
| వన్డే | 63 | 43 | 20 |
| ట్వంటీ20 | 30 | 20 | 10 |
| మహిళా వన్డే | 3 | 3 | |
| మహిళా ట్వంటీ20 | 5 | 3 | 2 |
| ఫస్ట్ క్లాస్ | 68 | 65 | 3 |
| లిస్టు-ఏ | 70 | 66 | 4 |
| టి20 | 196 | 133 | 63 |
ఇతర పదవులు
[మార్చు]షంసుద్దీన్ 2013లో థర్డ్ అంపైర్ విభాగంలో ఐసిసి అంపైర్ల అంతర్జాతీయ ప్యానెల్‌కు భారత ప్రతినిధిగా నియమితుడయ్యాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Full Scorecard of India vs Australia 3rd ODI 2013/14 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-05-01. Retrieved 2023-01-25.
- ↑ "Full Scorecard of U.S.A. vs Nepal 30th Match 2019-2023 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-04-24. Retrieved 2023-01-25.
- ↑ "Full Scorecard of England vs India 1st T20I 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-01-24. Retrieved 2023-01-25.
- ↑ "Full Scorecard of Sri Lanka vs India 2nd T20I 2019/20 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2020-12-12. Retrieved 2023-01-25.
- ↑ Subbaiah, Sunil (9 ఆగస్టు 2013). "BCCI lists 4 for ICC umpires panel". The Times of India. Archived from the original on 7 సెప్టెంబరు 2013. Retrieved 2023-01-25.