Jump to content

గంగశెట్టి అరవింద్ కుమార్

వికీపీడియా నుండి
గంగశెట్టి అరవింద్ కుమార్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1973-10-04) 1973 అక్టోబరు 4 (వయసు 51)
హైదరాబాదు, తెలంగాణ
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1994-2002హైదరాబాదు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్-క్లాస్ లిస్టు-ఏ
మ్యాచ్‌లు 43 27
చేసిన పరుగులు 2,141 555
బ్యాటింగు సగటు 31.02 31.02
100లు/50లు 3/12 0/3
అత్యధిక స్కోరు 141 66
వేసిన బంతులు 216 18
వికెట్లు 0 0
బౌలింగు సగటు - -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు - -
క్యాచ్‌లు/స్టంపింగులు 21/0 13/0
మూలం: Cricinfo, 22 ఆగస్టు 2018

గంగాశెట్టి అరవింద్ కుమార్, తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1994 నుండి 2004 మధ్యకాలంలో హైదరాబాద్ క్రికెట్ టీం తరపున ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1] ఎడమచేతి వాటం ఓపెనర్ అయిన అరవింద్ ఫస్ట్ క్లాస్ గేమ్‌లలో మూడు సెంచరీలు, 12 అర్థ సెంచరీలు సాధించాడు.[2]

జననం

[మార్చు]

అరవింద్ కుమార్ 1973 అక్టోబరు 4న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు.

క్రికెట్

[మార్చు]

ఫస్ట్-క్లాస్

[మార్చు]

1994-95 మధ్య ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. 2004 మార్చి 14 నుండి 16 వరకు వాంఖేడేలో ముంబై క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[3] 43 మ్యాచ్‌ల్లో 31.02 బ్యాటింగ్ సగటుతో 2,141 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 14 అర్థసెంచరీలు ఉన్నాయి. 141 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు. 'కేరళతో జరిగిన రంజీ ట్రోఫీలో మొదటి బంతిని ఆడి, చివరి బ్యాట్స్‌మెన్‌గా ఔట్ అయ్యాడు.

స్క్వాష్

[మార్చు]

ఇంగ్లండ్‌లో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఫిట్‌నెస్ కోసం స్క్వాష్ ఆట ప్రారంభించాడు. 2004లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ నుండి రిటైరైన తర్వాత స్క్వాష్ ఆడడం ప్రారంభించిన అరవింద్, 2008లో స్క్వాష్‌ను సీరియస్ తీసుకున్నాడు. మొదటి టోర్నమెంట్‌లో సికింద్రాబాద్ ఓపెన్‌లో 34 సంవత్సరాల వయస్సులో 35+ టైటిల్‌ను గెలుచుకున్నాడు.[4] బెంగళూరులో జరిగిన జీఎంఎస్ టోర్నమెంట్‌లో పాల్గొని 35 ఏళ్ళు పైబడిన విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. స్టేట్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో ఐదు టైటిళ్ళను, రెండుసార్లు (2005, 2007) రెండు 35+ నేషనల్స్‌ను గెలుచుకున్నాడు.

నెట్‌ప్లే క్లోజ్డ్ తెలంగాణ రాష్ట్ర స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో గంగశెట్టి అరవింద్ కుమార్ పురుషుల సింగిల్స్ 45+ టైటిల్‌ను గెలుచుకోగా, అరవింద్ కుమారుడు గంగశెట్టి ధ్రువ్ కుమార్ బాలుర అండర్-17 ను గెలుచుకున్నాడు. ఒకే టోర్నమెంట్‌లో తండ్రీ కొడుకులు తమ తమ విభాగాల్లో ఛాంపియన్‌లుగా నిలవడం చాలా అరుదు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Gangashetty Arvind Kumar". ESPN Cricinfo. Archived from the original on 2022-09-09. Retrieved 2022-09-09.
  2. "cricHQ - Making cricket even better". cricHQ (in ఇంగ్లీష్). Archived from the original on 2022-09-09. Retrieved 2022-09-09.
  3. "Full Scorecard of Hyderabad vs Mumbai Elite Group Semi-Final 2003/04 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-04-12. Retrieved 2022-09-09.
  4. Chronicle, Deccan (2017-09-25). "Ex-cricketer GangaShetty squash champion". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2017-10-22. Retrieved 2022-09-09.
  5. Today, Telangana (2021-04-08). "Rare honour for Hyderabadi father-son duo". Telangana Today. Archived from the original on 2021-04-09. Retrieved 2022-09-09.

బయటి లింకులు

[మార్చు]