హెర్బర్ట్ సట్‌క్లిఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హెర్బర్ట్ సట్‌క్లిఫ్
1933లో హెర్బర్ట్ సట్‌క్లిఫ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హెర్బర్ట్ సట్‌క్లిఫ్
పుట్టిన తేదీ(1894-11-24)1894 నవంబరు 24
సమ్మర్‌బ్రిడ్జ్, నిదెర్‌డేల్, వెస్ట్ రైడింగ్ ఆఫ్ యార్క్‌షైర్, ఇంగ్లండ్
మరణించిన తేదీ1978 జనవరి 22(1978-01-22) (వయసు 83)
క్రాస్ హిల్స్, నార్త్ యార్క్‌షైర్, ఇంగ్లండ్
బ్యాటింగుకుడిచేతివాటం
బౌలింగుకుడిచేతివాటం మీడియం
పాత్రబ్యాటర్
బంధువులుబిల్లీ సట్‌క్లిఫ్ (కొడుకు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 215)1924 జూన్ 14 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు1935 జూన్ 29 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1919–1945యార్క్‌షైర్
1924–1933ఎంసీసీ
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్
మ్యాచ్‌లు 54 754[a]
చేసిన పరుగులు 4,555 50,670
బ్యాటింగు సగటు 60.73 52.02
100లు/50లు 16/23 151/229
అత్యధిక స్కోరు 194 313
వేసిన బంతులు 993
వికెట్లు 14
బౌలింగు సగటు 40.21
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/15
క్యాచ్‌లు/స్టంపింగులు 23/– 474/–
మూలం: CricketArchive, 2009 సెప్టెంబరు 17

హెర్బర్ట్ సట్‌క్లిఫ్ (1894 నవంబరు 24 - 1978 జనవరి 22) యార్క్‌షైర్‌ జట్టులోనూ, ఇంగ్లండ్‌ జట్టులోనూ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడిన ఒక ఇంగ్లీష్ ప్రొఫెషనల్ క్రికెటర్. 1945లో ఆడిన ఒక్క మ్యాచ్ మినహాయిస్తే, అతని ఫస్ట్-క్లాస్ కెరీర్ అంతా మొదటి ప్రపంచ యుద్ధానికీ, రెండవ ప్రపంచ యుద్ధానికీ మధ్య కాలంలో సాగింది.[1] అతని ఫస్ట్-క్లాస్ అరంగేట్రం మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1919 వరకు ఆలస్యమైంది.[2] అతని కెరీర్‌కి 1939 ఆగస్టులో రెండవ ప్రపంచ యుద్ధంలో సైనిక సేవ కోసమని యుకె మిలటరీ నుంచి పిలుపు రావడంతో బ్రేక్ పడింది.[3] అతను టెస్టు క్రికెట్ చరిత్రలో 16 సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్. మరొక గొప్ప క్రికెటర్ అయిన జాక్ హాబ్స్‌కి బ్యాటింగ్ భాగస్వామిగా సట్‌క్లిఫ్ ప్రసిద్ధి చెందాడు. హోబ్స్, సట్‌క్లిఫ్‌ల మధ్య భాగస్వామ్యం ఆల్-టైమ్ గ్రేట్ భాగస్వామ్యంగా విస్తృతంగా పేరొందింది.

సట్‌క్లిఫ్ ఒక కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. అతని ఏకాగ్రత, పట్టుదల వంటి లక్షణాలు బ్యాటింగ్‌కి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు జట్టుకు అత్యంత విలువైన ఆటగాడిగా చేశాయి. అతను ఆట యొక్క అత్యుత్తమ "బాడ్ వికెట్ బ్యాట్స్‌మాన్‌"ల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నాడు.[4] 1924 నుంచి 1930 మధ్యకాలంలో ఇంగ్లాండ్ జట్టుకు జాక్ హాబ్స్‌తో కలిసి నెలకొల్పిన గొప్ప ఓపెనింగ్ భాగస్వామ్యాలు అతనికి ఘనతను, ప్రఖ్యాతిని సంతరించిపెట్టాయి. అతను యార్క్‌షైర్‌ జట్టుకు పెర్సీ హోమ్స్‌తోనూ, చివరి కొన్ని సీజన్‌లలో యువకుడైన లెన్ హట్టన్‌తోనూ కలిసి కూడా చెప్పుకోదగ్గ ఓపెనింగ్ భాగస్వామ్యాలను నెలకొల్పాడు.[5][6] సట్‌క్లిఫ్ కెరీర్‌లో, యార్క్‌షైర్ కౌంటీ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ను 12 సార్లు గెలుచుకుంది.[7]

సట్‌క్లిఫ్ ఇంగ్లండ్ తరపున 54 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. మూడు సందర్భాలలో ఆస్ట్రేలియాలో పర్యటించి, అక్కడ అద్భుతమైన విజయాలను పొందాడు.[8][9] 1932-33లో అతని చివరి పర్యటనలో వివాదాస్పద " బాడీలైన్ " సిరీస్‌ కూడా ఉంది. ఇందులో సట్‌క్లిఫ్ బాడీలైన్ బౌలింగ్ వ్యూహాన్ని చేపట్టి ఆస్ట్రేలియాని నిలువరించే ప్రయత్నం చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ డగ్లస్ జార్డిన్‌కు ప్రధాన మద్దతుదారులలో ఒకడిగా నిలిచాడు.[10] సట్‌క్లిఫ్ బాడీలైన్‌ను ఆమోదించలేదని సన్నిహిత మిత్రులు పేర్కొన్నప్పటికీ, అతను ఎల్లప్పుడూ తన జట్టు కెప్టెన్‌కు గట్టి విధేయతతోనూ, తన జట్టు నిర్ణయం పట్ల కట్టుబడి ఉండేవాడు.[10] గణాంకాల పరంగా, సట్‌క్లిఫ్ అత్యంత విజయవంతమైన టెస్ట్ బ్యాట్స్‌మెన్; అతని కెరీర్ పూర్తయ్యేసరికి బ్యాటింగ్ సగటు 60.73, ఇది ఇతర ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లతో పోలిస్తే అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా 20 ఇన్నింగ్స్ ఆడిన క్రికెటర్లలో లెక్కిస్తే అత్యధిక సగటుల్లో ఐదవది, అతనికన్నా ఎక్కువ సగటు కలిగిన టెస్టు క్రికెటర్లు డాన్ బ్రాడ్‌మాన్, ఆడమ్ వోజెస్, గ్రేమ్ పొలాక్, జార్జ్ హెడ్లీ మాత్రమే.

తాను ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్‌లో సంపాదించిన డబ్బును ఉపయోగించి ఇంగ్లండులోని వెస్ట్ యార్క్‌షైర్‌కు చెందిన లీడ్స్ నగరంలో క్రీడల దుస్తుల దుకాణాన్ని తెరిచి విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు.[11] అతని క్రీడా జీవితం ముగిసినప్పుడు, యార్క్‌షైర్‌లోని క్లబ్ కమిటీలో 21 సంవత్సరాల పాటు సేవలందించాడు.[12] మూడు సంవత్సరాలు ఇంగ్లాండ్ టెస్ట్ సెలెక్టర్‌గా వ్యవహరించాడు.[13] అతనికి లభించిన గౌరవాలలో యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ స్వస్థలమైన హెడ్డింగ్లీలో అతని పేరు మీద ప్రత్యేకమైన గేట్‌లను ఏర్పాటుచేయడం, ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి అతనికి స్థానం కల్పించడం వంటివి ఉన్నాయి.[14][15]

మూలాలు

[మార్చు]
  1. "Yorkshire v RAF 1945". CricketArchive. Retrieved 19 June 2010.
  2. Hill, p.35.
  3. Hill, p.181.
  4. Sengupta, Arunabha (2012-11-24). "Herbert Sutcliffe: The master of bad wickets". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-11-18.
  5. Barclay, pp.235–236.
  6. Hill, pp.213–214.
  7. Hill, p.209.
  8. Hill, pp.61–62.
  9. Warner, Two Wars, p.45.
  10. 10.0 10.1 Hill, pp.153–156.
  11. Hill, p.78.
  12. Wisden obituary.
  13. Hill, pp.187–188.
  14. Hill, p.190.
  15. "Hall of Fame – Herbert Sutcliffe". ICC. Archived from the original on 25 నవంబరు 2009. Retrieved 5 జూన్ 2010.

గ్రంథ పట్టిక

[మార్చు]
  • జాన్ అర్లాట్, అర్లాట్ ఆన్ క్రికెట్ (ed. డేవిడ్ రేవెర్న్ అలెన్ ), కాలిన్స్, 1984
  • జాన్ ఆర్లాట్, పోర్ట్రెయిట్ ఆఫ్ ది మాస్టర్, పెంగ్విన్, 1982
  • బార్క్లేస్ వరల్డ్ ఆఫ్ క్రికెట్, 3వ ఎడిషన్, (ed. EW స్వాంటన్ ), విల్లో బుక్స్, 1986. ఇయాన్ పీబుల్స్ రాసిన సట్‌క్లిఫ్‌పై కథనం.
  • డెరెక్ బిర్లీ, ఎ సోషల్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ క్రికెట్, ఔరం, 1999
  • నెవిల్లే కార్డస్, క్లోజ్ ఆఫ్ ప్లే, స్పోర్ట్స్‌మ్యాన్స్ బుక్ క్లబ్ ఎడిషన్, 1957, "సట్‌క్లిఫ్ అండ్ యార్క్‌షైర్", pp. 1–10
  • బిల్ ఫ్రిండాల్, ది విస్డెన్ బుక్ ఆఫ్ క్రికెట్ రికార్డ్స్, క్వీన్ అన్నే ప్రెస్, 1986, ISBN 0-356-10736-1
  • అలాన్ గిబ్సన్, ది క్రికెట్ కెప్టెన్స్ ఆఫ్ ఇంగ్లండ్, కాసెల్, 1979
  • అలాన్ హిల్, హెర్బర్ట్ సట్‌క్లిఫ్: క్రికెట్ మాస్ట్రో, సైమన్ & షుస్టర్, 1991; స్టేడియా, 2007 (2వ ఎడిషన్)
  • డగ్లస్ జార్డిన్, ఇన్ క్వెస్ట్ ఆఫ్ ది యాషెస్, మెథుయెన్, 2005
  • రోనాల్డ్ మాసన్, జాక్ హాబ్స్, స్పోర్ట్స్‌మ్యాన్స్ బుక్ క్లబ్, 1961
  • పెల్హామ్ వార్నర్, లార్డ్స్: 1787–1945, హర్రప్, 1946
  • పెల్హామ్ వార్నర్, క్రికెట్ బిట్వీన్ టూ వార్స్, స్పోర్టింగ్ హ్యాండ్‌బుక్స్, 1946
  • రాయ్ వెబ్బర్, ది కౌంటీ క్రికెట్ ఛాంపియన్‌షిప్, స్పోర్ట్స్‌మ్యాన్స్ బుక్ క్లబ్, 1958
  • సైమన్ వైల్డ్, నంబర్ వన్: ది వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ , బౌలర్లు, గొల్లన్జ్, 1998, ISBN 978-0-575-06453-9
  • విస్డెన్ క్రికెటర్స్ అల్మానాక్, 1920 నుండి 1946 వరకు వివిధ సంచికలు
  • గ్రేమ్ రైట్, ఎ విస్డెన్ కలెక్షన్, విస్డెన్, 2004