మాథ్యూ ఫిషర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాథ్యూ ఫిషర్
2022 లో ఫిషర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మాథ్యూ డేవిడ్ ఫిషర్
పుట్టిన తేదీ (1997-11-09) 1997 నవంబరు 9 (వయసు 26)
యార్క్, నార్త్ యార్క్‌షైర్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 702)2022 మార్చి 16 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013–presentయార్క్‌షైర్ (స్క్వాడ్ నం. 7)
2021Northern Superchargers
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 1 29 35 39
చేసిన పరుగులు 0 492 236 61
బ్యాటింగు సగటు 16.40 26.22 8.71
100లు/50లు 0/0 0/1 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 0* 53 36* 19
వేసిన బంతులు 162 4,717 1,414 743
వికెట్లు 1 94 32 43
బౌలింగు సగటు 71.00 27.09 43.81 26.23
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 3 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/67 5/34 3/22 5/22
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 12/– 11/– 12/–
మూలం: Cricinfo, 20 May 2023

మాథ్యూ డేవిడ్ ఫిషర్ (జననం 1997 నవంబరు 9) ఇంగ్లాండ్ క్రికెట్ ఆటగాడు. అతను యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. 2022 మార్చిలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు [1]

కెరీర్

[మార్చు]

దేశీయంగా

[మార్చు]

ఫిషర్ 2013 జూన్ 9న లీసెస్టర్‌షైర్‌పై 2013 యార్క్‌షైర్ బ్యాంక్ 40 లో ప్రవేశించాడు/ [2] 15 సంవత్సరాల 212 రోజుల వయస్సులో, పోటీ కౌంటీ గేమ్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడైన క్రికెటరతను. [3] మునుపటి రికార్డు 1922లో వెల్ష్ క్రికెటర్ రాయిస్టన్ గేబ్-జోన్స్ పేరిట ఉంది. [3] 2015 మేలో T20 బ్లాస్ట్‌లో రంగప్రవేశం చేసిన అతను డెర్బీషైర్‌పై యార్క్‌షైర్ తరపున ఐదు వికెట్లు తీశాడు. [4]

ఆట మొదలుపెట్టినప్పటి నుండి ఫిషర్, పక్క నొప్పి, విరిగిన బొటనవేలు, స్థానభ్రంశం చెందిన భుజం, వెన్ను ఒత్తిడి గాయం, పదేపదే వచ్చే స్నాయువు సమస్యలతో సహా అనేక రకాల గాయాలను ఎదుర్కొన్నాడు. ఇవన్నీ కౌంటీ క్రికెట్‌లో అనేక సీజన్లలో అతని ఆటను ప్రభావితం చేశాయి.[5]

2022 ఏప్రిల్ లో, ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం ఫిషర్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ కొనుగోలు చేసింది. [6]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

ఫిషర్‌ను 2013లో 15 సంవత్సరాల వయస్సులో ఇంగ్లండ్ అండర్ 19 జట్టులో తీసుకున్నారు. అతను 2021 డిసెంబరులో ఆస్ట్రేలియా A జట్టుతో ఆడిన ఇంగ్లాండ్ లయన్స్ జట్టుకు కూడా ఆడాడు [5]

2022 ఫిబ్రవరిలో, ఫిషర్ వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం ఇంగ్లాండ్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. [7] 2022 మార్చి 16 న ఇంగ్లండ్ తరపున వెస్టిండీస్‌పై టెస్టు రంగప్రవేశం చేశాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. "Five county players to make a mark". ESPN Cricinfo. Retrieved 13 April 2018.
  2. "Yorkshire v Leicestershire". ESPN Cricinfo. Retrieved 10 June 2013.
  3. 3.0 3.1 "Matthew Fisher: Yorkshire 15-year-old breaks 91-year-old record". BBC Sport. Retrieved 10 June 2013.
  4. "Fisher sparkles under lights with debut five". ESPN Cricinfo. Retrieved 16 May 2015.
  5. 5.0 5.1 "Matthew Fisher". ESPN Cricinfo. Retrieved 9 February 2022.
  6. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  7. "James Anderson, Stuart Broad dropped from England Test squad for West Indies". ESPN Cricinfo. Retrieved 8 February 2022.
  8. "2nd Test, Bridgetown, Mar 16 - 20 2022, England tour of West Indies". ESPN Cricinfo. Retrieved 16 March 2022.