జేమ్స్ ఆండర్సన్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జేమ్స్ ఆండర్సన్
2023లో ఆండర్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జేమ్స్ మైఖేల్ ఆండర్సన్
పుట్టిన తేదీ (1982-07-30) 1982 జూలై 30 (వయసు 42)
బర్న్‌లే, లంకషైర్, ఇంగ్లండ్
ఎత్తు6 అడుగుల 2 అంగుళాలు
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం ఫాస్ట్ మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 613)2003 మే 22 - జింబాబ్వే తో
చివరి టెస్టు2023 జులై 27 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 172)2002 డిసెంబరు 15 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2015 మార్చి 13 - ఆఫ్ఘనిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.9 (గతంలో 40)
తొలి T20I (క్యాప్ 21)2007 జనవరి 9 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2009 నవంబరు 15 - దక్షిణాఫ్రికా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.9
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000లంకషైర్ క్రికెట్ బోర్డు
2001–presentలంకషైర్
2007/08ఆక్‌లాండ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఓడీఐ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లిస్ట్ ఎ క్రికెట్
మ్యాచ్‌లు 183 194 292 261
చేసిన పరుగులు 1,340 273 2,026 376
బ్యాటింగు సగటు 9.17 7.58 9.42 8.95
100లు/50లు 0/1 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 81 28 81 28
వేసిన బంతులు 39,217 9,584 58,215 12,730
వికెట్లు 690 269 1,104 358
బౌలింగు సగటు 26.42 29.22 24.59 28.57
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 32 2 54 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 3 0 6 0
అత్యుత్తమ బౌలింగు 7/42 5/23 7/19 5/23
క్యాచ్‌లు/స్టంపింగులు 105/– 53/– 163/- 68/–
మూలం: ESPNcricinfo, 2023 జులై 31

జేమ్స్ మైఖేల్ ఆండర్సన్ (జననం 1982 జూలై 30) ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ జట్టులో భాగమైన ఇంగ్లిష్ క్రికెటర్. ఇతను గతంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కూడా ఆడాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1100కి పైగా ఫస్ట్ క్లాస్ వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. .

దేశీయ క్రికెట్‌లో ఇతను లంకషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. 2010 ఐసీసీ ప్రపంచ టీ20 కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో ఆండర్సన్ ఒక సభ్యుడు

అండర్సన్ 2002 నుంచి 2015 వరకూ ఇంగ్లండ్ వన్ డే ఇంటర్నేషనల్ జట్టులో భాగంగా ఆడాడు. 2003లో జింబాబ్వేపై టెస్ట్ కెరీర్ ప్రారంభించాడు. 2007 నుంచి కొన్నేళ్ళ పాటు టీ20 టీమ్‌లో భాగంగా ఆడాడు.[1] 2018లో ఇంగ్లండ్ 1000వ టెస్ట్ సందర్భంగా ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ తయారుచేసిన దేశపు అత్యుత్తమ ఆల్-టైమ్ టెస్ట్ ఎలెవెన్ జట్టులో భాగంగా ఆండర్సన్ ఎంపికయ్యాడు.[2] 2023 జూలై నాటికి, అతను ఐసీసీ పురుషుల ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని నాల్గవ టెస్ట్ బౌలర్‌గా ర్యాంక్ పొందాడు.[3]

అండర్సన్ రైట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్. 600 పైచిలుకు టెస్ట్ వికెట్లు తీసి టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లలోగా చరిత్రకెక్కాడు.[4] అతను ఇంగ్లండ్ తరఫున అత్యంత ఎక్కవ మ్యాచ్‌లు ఆడినవాడిగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ రికార్డు ఉన్నది ఇతనికే.[5][6] బ్యాట్స్‌మెన్‌గా ఇతను, జో రూట్ కలసి టెస్టుల్లో 198 పరుగులతో అత్యధిక పదో వికెట్ భాగస్వామ్యం సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.[7]

భారత్‌తో ధర్మశాల వేదికగా జరిగిన 2024 ఫిబ్రవరిలో 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ 2 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా, ప్రపంచంలోనే ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన 3వ బౌలర్‌ రికార్డు సృష్టించాడు.[8] ఇంతకు ముందు శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్, ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ మాత్రమే టెస్ట్ క్రికెట్‌లో 700+ వికెట్లు పడగొట్టారు.[9][10]

మూలాలు

[మార్చు]
  1. "James Anderson profile and biography, stats, records, averages, photos and videos".
  2. "England's greatest Test XI revealed". ICC. 30 July 2018. Archived from the original on 22 December 2022. Retrieved 22 December 2022.
  3. "ICC - Test Match Player Rankings". Icc-cricket.com. Archived from the original on 8 డిసెంబరు 2021. Retrieved 22 February 2023.
  4. "James Anderson becomes third-highest wicket-taker in Tests". International Cricket Council. Archived from the original on 4 April 2023. Retrieved 6 August 2021.
  5. "Records - Test Matches - Individual Records (Captains, Players, Umpires) - Most Matches In Career". ESPNcricinfo. Retrieved 22 December 2022.
  6. "Records - England - One-Day Internationals - Most Wickets". ESPNcricinfo. Retrieved 22 December 2022.
  7. "Records | Test matches | Partnership records | Highest partnerships by wicket | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 16 November 2021.
  8. "జేమ్స్‌ అండర్సన్‌ @ 700.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనత". 9 March 2024. Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.
  9. A. B. P. Desam (9 March 2024). "జేమ్స్ ఆండ‌ర్స‌న్ టెస్ట్‌ల్లో స‌రికొత్త రికార్డ్‌". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.
  10. Sakshi (9 March 2024). "ఆండర్సన్‌ ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.