అలస్టర్ కుక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలస్టర్ కుక్
2016లో కుక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అలస్టర్ నాధన్ కుక్
పుట్టిన తేదీ (1984-12-25) 1984 డిసెంబరు 25 (వయసు 39)
గ్లౌసెస్టర్, గ్లౌసెస్టర్‌షైర్, ఇంగ్లండ్
మారుపేరుకుకీ, షెఫ్, కెప్టెన్ కుక్
ఎత్తు6 అడుగుల 2 అంగుళాలు
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతివాటం స్లో సీమ్
పాత్రఓపెనింగ్ బ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 630)2006 మార్చి 1 - ఇండియా తో
చివరి టెస్టు2018 సెప్టెంబరు 7 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 196)2006 జూన్ 28 - శ్రీలంక తో
చివరి వన్‌డే2014 డిసెంబరు 16 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.26
తొలి T20I (క్యాప్ 24)2007 జూన్ 28 - వెస్టిండీస్ తో
చివరి T20I2009 నవంబరు 15 - దక్షిణాఫ్రికా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.26
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002బెడ్‌ఫర్డ్‌షైర్
2003ఎస్సెక్స్ క్రికెట్ బోర్డ్
2003–2023ఎస్సెక్స్ (స్క్వాడ్ నం. 26)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే ఇంటర్నేషనల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లిస్ట్ ఎ క్రికెట్
మ్యాచ్‌లు 161 92 352 178
చేసిన పరుగులు 12,472 3,204 26,643 6,510
బ్యాటింగు సగటు 45.35 36.40 46.41 39.93
100లు/50లు 33/57 5/19 74/125 13/38
అత్యుత్తమ స్కోరు 294 137 294 137
వేసిన బంతులు 18 294 18
వికెట్లు 1 7 0
బౌలింగు సగటు 7.00 32.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/6 3/13
క్యాచ్‌లు/స్టంపింగులు 175/– 36/– 386/– 73/–
మూలం: ESPNcricinfo, 2023 సెప్టెంబరు 29

సర్ అలస్టర్ నాథన్ కుక్ CBE (జననం 1984 డిసెంబరు 25) మాజీ ఇంగ్లిష్ క్రికెటర్. ఇతను ఇంగ్లాండ్ టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కుక్‌ని టెస్ట్ క్రికెట్‌లోకెల్లా అత్యంత గొప్ప ఓపెనింగ్ బ్యాటర్లలో ఒకరిగా పరిగణిస్తారు. కుక్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఐదవ స్థానంలోనూ, ఇంగ్లండ్ తరఫున మొదటి స్థానంలోనూ ఉన్నాడు. ఇతను సెప్టెంబర్ 2018లో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 2023 వరకు ఇంగ్లీష్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఎసెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున ఆడాడు. అదే సమయంలో BBC రేడియో ప్రోగ్రామ్ టెస్ట్ మ్యాచ్ స్పెషల్ కోసం కూడా పనిచేశాడు.

ఇంగ్లండ్ జట్టుకు అత్యధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన రికార్డు కుక్‌దే, అతను 59 టెస్ట్ మ్యాచ్‌లతో పాటుగా 69 వన్ డే ఇంటర్నేషనల్స్‌లో ఆ జట్టుకు కెప్టెన్‌గా పనిచేశాడు.[1] టెస్టు మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇతను ప్రపంచవ్యాప్తంగా 12 వేల టెస్ట్ పరుగులు చేసిన ఆరవ ఆటగాడు, ఏకైక ఆంగ్లేయుడు. అయితే, 12 వేల టెస్ట్ పరుగుల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు ఇతని పేరిటే ఉంది. ఇతను ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు (33) సాధించినవాడిగానూ, 50 టెస్టు మ్యాచ్‌లు గెలిచిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగానూ కూడా రికార్డులు సృష్టించాడు.[2] ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, అతను సాధారణంగా మొదటి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తాడు. ఇతనికి టెస్ట్ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోర్ సాధించిన ఎడమచేతి వాటం బ్యాటర్‌గా కూడా రికార్డు ఉంది.

కుక్ ఎసెక్స్ అకాడమీకి ఆడేవాడు. 2003లో మొదటిసారిగా ఎలెవెన్‌కి అరంగేట్రం చేశాడు. 2000 నుండి 2006లో జాతీయ టెస్ట్ జట్టులో స్థానం లభించేవరకూ అనేక ఇంగ్లండ్ యువ జట్లకు ఆడాడు. అలాగే ఒకసారి ECB నేషనల్ అకాడమీతో అతను వెస్టిండీస్‌లో పర్యటిస్తున్నప్పుడు, మార్కస్ ట్రెస్కోథిక్‌కు ఆఖరి నిమిషంలో ప్రత్యామ్నాయంగా కుక్‌ను ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి పిలిచారు. అలా భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు 21 ఏళ్ళ వయసులో ఆడే అవకాశం వచ్చిన కుక్ సెంచరీతో అరంగేట్రం చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన తొలి సంవత్సరంలో 1000 పరుగులు సాధించాడు. ఇండియా, పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లపై ఆడిన తన మొదటి టెస్ట్ మ్యాచ్‌లు అన్నిటిలోనూ సెంచరీలు చేశాడు.[3] ఇంగ్లండ్ 2009 యాషెస్ సిరీస్‌ను గెలుచుకోవడంలో కుక్ కీలక పాత్ర పోషించాడు. 2010లో టెస్ట్ కెప్టెన్‌గా తాత్కాలిక బాధ్యతలు స్వీకరించిన కుక్ ఆపైన వన్ డే ఇంటర్నేషనల్ కెప్టెన్సీ కూడా స్వీకరించి, 2010-11లో యాషెస్‌కు కూడా కెప్టెన్‌గా కొనసాగాడు.

2012 ఆగస్టు 29న ఆండ్రూ స్ట్రాస్ రిటైర్మెంట్ తర్వాత కుక్ టెస్ట్ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 1984-85 తర్వాత 28 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు భారత్‌లో టెస్ట్ సీరీస్ ఏదీ గెలుచుకోని ఇంగ్లండ్ జట్టు 2012లో కుక్ కెప్టెన్సీలో గెలిచింది.[4] కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా కుక్ నిలిచాడు.[5] 2015 మే 30న ఇంగ్లండ్ తరపున టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, గ్రాహం గూచ్ (8900) రికార్డును కుక్ అధిగమించాడు.[6] 2016లో ఇంగ్లండ్ బంగ్లాదేశ్, ఇండియా పర్యటన తర్వాత, అతను టెస్ట్ కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. 2018 మే 24న పాకిస్థాన్‌తో జరిగిన మొదటి టెస్టులో, కుక్ 153 వరుస టెస్టు మ్యాచ్‌లలో ఆడి అలన్ బోర్డర్ రికార్డును సమం చేశాడు, ఒక వారం తర్వాత హెడింగ్లీలో జరిగిన రెండో టెస్టులో దానిని అధిగమించాడు.[7] టెస్టు, వన్డే ఇంటర్నేషనల్ వంటి ఫార్మాట్లలో రికార్డులు నెలకొల్పిన ఆటగాడైనా టీ20లు మాత్రం తనకు సరిపడవంటూ వాటి నుంచి అతను దూరంగా ఉన్నాడు. టీ20 ఇంటర్నేషనల్ ఫార్మాట్ ప్రారంభమయ్యాకా ఒక నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 2009లో స్వచ్ఛందంగా తప్పుకున్నాడు.[1] 2018 సెప్టెంబరు 3న, తన పన్నెండేళ్ల అంతర్జాతీయ కెరీర్‌ని 2018 సెప్టెంబరు 11న భారత్‌తో జరిగే సిరీస్‌తో ముగిస్తున్నానని కుక్ ప్రకటించాడు. 2023 అక్టోబరు 13న ప్రొఫెషనల్ క్రికెటర్‌గా తన కెరీర్‌ను ముగిస్తున్నట్టు ప్రకటించాడు.[8] ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ "అలెస్టర్ కుక్ లాంటి బ్యాట్స్‌మాన్‌ని మనం మళ్ళీ చూడలేము" అని రాశాడు.[9] క్రికెట్ రచయిత స్కిల్డ్ బెర్రీ "అలెస్టర్ కుక్ నాలుగు విధాలుగా ఇంగ్లండ్‌లోనే అత్యుత్తమంగా నిలుస్తున్నాడు... అతను పరంపరగా ఇంగ్లిష్ ప్రజలు విలువనిచ్చే నాలుగు ఉత్తమ లక్షణాలను మూర్తీభవించాడు. అవి: కష్టసుఖాలను సమంగా తీసుకోవడం (స్టోయిసిజం), వినమ్రత, తనను తాను ఎక్కువ అంచనావేసుకోకపోవడం (సెల్ఫ్ ఎఫాస్‌మెంట్), వీటన్నిటినీ హాస్యంతో రంగరించడం." [10][నోట్స్ 1]

కుక్ మంచి గాయకుడు, సంగీతకారుడు. అతను న్యూజీలాండ్ ఓపెరా సంగీత విద్వాంసురాలు కిరి తే కనవాతో కలసి పాటలు పాడాడు.[11] వ్యవసాయం, గొర్రెల పెంపకం, వంట అతనికి ఇష్టమైన వ్యాపకాలు. మిగిలిన సెలబ్రెటీల ధోరణికి భిన్నంగా కుక్‌కి ఏ సోషల్ మీడియా ఖాతాలూ లేవు.[1]

కుక్‌కి క్రికెట్‌కు తన సేవలకు గాను 2011లో మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్‌లో నియమితుడయ్యాడు.[12] 2016లో దానికన్నా ఉన్నతమైన ఆర్డర్ అయిన ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్‌గా పదోన్నతి పొందాడు. 2019 కొత్త సంవత్సర సత్కారాల్లో, క్రికెట్‌కు తన సేవలను పురస్కరించుకుని కుక్ నైట్ బ్యాచిలర్‌గా నియమించి గౌరవించారు.[13]

ఆగస్ట్ 2018లో ఇంగ్లండ్ 1000వ టెస్ట్ సందర్భంగా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అత్యంత గొప్ప టెస్ట్ XI జట్టు ప్రకటించగా, అందులో కుక్ పేరు కూడా ఉంది.[14] 2012లో ఐసీసీ అతన్ని టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గానూ, 2012లో విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గానూ ప్రకటించాయి.[11]

నోట్స్[మార్చు]

 1. ఆంగ్లంలో ఒరిజినల్ కొటేషన్ ఇది: the four ways Alastair Cook stands out as England’s greatest... he embodied the virtues which English people traditionally value: stoicism, modesty and self-effacement, all tinged with humour.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 "అలస్టర్ కుక్: ‌కెరీర్ తొలి మ్యాచ్, ఆఖరి మ్యాచ్‌లోనూ అదే రికార్డు.. రెండూ భారత్‌పైనే". BBC News తెలుగు. Retrieved 2023-11-18.
 2. "Alastair Cook's record-breaking career: the extraordinary stats behind England's highest-scoring batsman". Retrieved 10 September 2018
 3. Brett, Oliver (9 June 2007). "Cook hundred keeps England on top". BBC. Archived from the original on 24 August 2007. Retrieved 26 August 2007.
 4. "England end 28-year drought with 2–1 win". Wisden India. Archived from the original on 3 December 2013. Retrieved 17 December 2012.
 5. "India v England: record-breaker Alastair Cook scores 23rd Test century to put tourists firmly in control of third Test". Telegraph. Archived from the original on 12 January 2022. Retrieved 6 December 2012.
 6. "Alastair Cook: Captain becomes England's leading Test run scorer". BBC Sport. Retrieved 31 May 2015.
 7. "Cook equals Border record". Retrieved 24 May 2018.
 8. "Alastair Cook announces retirement". Retrieved 14 October 2023.
 9. Vaughan, Michael. "We will never see a batsman like Alastair Cook again". Telegraph online. Retrieved 14 October 2023.
 10. Berry, Scyld. "The four ways Alastair Cook stands out as England's greatest". Telegraph online. Retrieved 14 October 2023.
 11. 11.0 11.1 "Here are some interesting facts and figures about Alastair Cook". Mid-day (in ఇంగ్లీష్). 2016-05-30. Retrieved 2023-11-18.
 12. "Andrew Strauss and Alastair Cook lead Birthday Honours list". BBC. 10 June 2011. Archived from the original on 11 June 2011. Retrieved 11 June 2011.
 13. "The Queen's New Years Honours 2019". GOV.UK. Cabinet Office. 28 December 2018. Retrieved 28 December 2018.
 14. "England's greatest Test XI revealed". ICC. 30 July 2018. Retrieved 26 July 2009.