Jump to content

మార్క్ వుడ్

వికీపీడియా నుండి
మార్క్ వుడ్
2021–22 యాషెస్ సీరీస్‌లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మార్క్ వుడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మార్క్ ఆండ్రూ వుడ్
పుట్టిన తేదీ (1990-01-11) 1990 జనవరి 11 (వయసు 34)
యాషింగ్‌టన్, నార్తంబర్‌లాండ్, ఇంగ్లాండ్
ఎత్తు6 అ. 0 అం. (1.83 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 667)2015 మే 21 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2023 జూలై 27 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 241)2015 మే 8 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2023 మార్చి 3 - బంగ్లాదేశ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.33
తొలి T20I (క్యాప్ 73)2015 జూన్ 23 - న్యూజీలాండ్ తో
చివరి T20I2023 మార్చి 9 - బంగ్లాదేశ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.33
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008–2010Northumberland
2011–presentడర్హమ్‌ (స్క్వాడ్ నం. 33)
2018చెన్నై సూపర్ కింగ్స్ (స్క్వాడ్ నం. 11)
2023–presentలక్నో సూపర్ జెయింట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 31 59 72 93
చేసిన పరుగులు 724 72 1,890 134
బ్యాటింగు సగటు 16.83 9.00 19.89 7.05
100లు/50లు 0/1 0/0 0/5 0/0
అత్యుత్తమ స్కోరు 52 14 72* 24
వేసిన బంతులు 5,619 2,975 11,737 4,354
వికెట్లు 104 71 240 117
బౌలింగు సగటు 29.45 37.88 26.60 32.73
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 0 11 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/37 4/33 6/37 4/33
క్యాచ్‌లు/స్టంపింగులు 8/– 13/– 17/– 23/–
మూలం: ESPNcricinfo, 31 July 2023

మార్క్ ఆండ్రూ వుడ్ (జననం 1990 జనవరి 11) అన్ని ఫార్మాట్లలో ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయంగా ఆడే ఇంగ్లాండ్ క్రికెటరు. దేశీయ క్రికెట్‌లో, అతను డర్హామ్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ (ప్రస్తుత సీజన్‌లో) తరపున ఆడాడు.

వుడ్ 2015లో తన టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) ల రంగప్రవేశం చేసాడు. అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్,[1] 2022 T20 ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్లలో సభ్యుడు. [2]

వుడ్, కుడిచేతి ఫాస్టు బౌలర్‌గా ఆడుతున్నాడు. ప్రస్తుతం 89 మై/గం సగటు వేగంతో ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన టెస్టు బౌలర్లలో ఒకడు.[3]

దేశీయ కెరీర్

[మార్చు]

చిన్న కౌంటీలు

[మార్చు]

వుడ్ కౌంటీ క్రికెట్‌లో 2008లో MCCA నాకౌట్ ట్రోఫీలో నార్ఫోక్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తంబర్‌ల్యాండ్ తరపున రంగప్రవేశం చేశాడు. అతను నార్తంబర్‌ల్యాండ్ తరపున 2008 నుండి 2010 వరకు మైనర్ కౌంటీస్ క్రికెట్ ఆడాడు, 3 మైనర్ కౌంటీస్ ఛాంపియన్‌షిప్ లలోను,[4] 3 MCCA నాకౌట్ ట్రోఫీల్లోనూ ఆడాడు. [5]

డర్హం

[మార్చు]

2011 సీజన్‌లో, అతను డర్హామ్ MCCU తో జరిగిన ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో డర్హామ్ తరపున రంగప్రవేశం చేశాడు. [6] దాని తరువాత, 2011 క్లైడెస్‌డేల్ బ్యాంక్ 40 లో నార్తాంప్టన్‌షైర్‌తో తన లిస్టు A రంగప్రవేశం చేసాడు.[7] అప్పటి నుండి అతను శ్రీలంక A, [6] క్లైడెస్‌డేల్ బ్యాంక్ 40లో స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరిన్ని ఫస్ట్-క్లాస్ ఆటలు ఆడాడు.[7] 2014 శ్రీలంక పర్యటనలో ఇంగ్లాండ్ లయన్స్ తరపున ఆడాడు.

ఫ్రాంచైజ్ క్రికెట్

[మార్చు]

2018 జనవరి 28న, 2018 IPL సీజన్ కోసం వుడ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ INR 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. 2022 ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతనిని కొనుగోలు చేసింది. [8] అయితే మోచేతి గాయం కారణంగా అతను టోర్నీకి దూరమయ్యాడు. [9]

2022 ఏప్రిల్లో, ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం లండన్ స్పిరిట్ అతన్ని కొనుగోలు చేసింది. [10]


అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2015: వెస్టిండీస్, ఐర్లాండ్

[మార్చు]

2015 మార్చిలో, వెస్టిండీస్ పర్యటన కోసం ఇంగ్లాండ్ టెస్టు జట్టులో వుడ్ పేరు చేర్చారు. [11] అయితే, అతను సిరీస్‌లో ఆడలేదు.

అతను 2015 మే 8న ఐర్లాండ్‌పై ఇంగ్లండ్ తరపున తన వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు.[12] వుడ్ తన మొదటి అంతర్జాతీయ వికెట్ తీసుకున్నప్పటికీ, వర్షం కారణంగా మ్యాచ్ ప్రభావితమై, ఆట జరగలేదు.


అతను అదే నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో రంగప్రవేశం చేశాడు. [13] మొదటి టెస్ట్‌లో వుడ్, న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 93 పరుగులకు 3 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్‌లో 1–47 తీసుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్‌ 124 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. తర్వాతి టెస్టులో వుడ్ న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 2–62 సాధించాడు. అతను బ్యాట్‌తో ఉపయోగకరమైన 19 పరుగులు కూడా చేశాడు. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో అతను ఈసారి 97 పరుగుల ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 199 పరుగుల తేడాతో ఓడిపోవడంతో సిరీస్ 1–1తో సమమైంది.

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్‌డేలో వుడ్ 1–48 సాధించాడు. తర్వాతి గేమ్‌లో అతను 1–49 సాధించగా, ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 1–1తో సమం చేసింది. సిరీస్ చివరి గేమ్‌లో వుడ్ గణాంకాలు 0-70. ఇంగ్లండ్ 2-1తో సిరీస్‌ను గెలుచుకుంది.

అతను 23 జూన్ 2015న అదే సిరీస్‌లో తన తొలి ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.[14] ఇంగ్లండ్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. అతను 3-26 సాధించాడు.


2015: యాషెస్ సిరీస్

[మార్చు]
ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన 2015 యాషెస్ సిరీస్‌లో నాలుగో టెస్టులో వుడ్ ఆఖరి వికెట్ తీశాడు

మొదటి యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో వుడ్ 2–68 తీసుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 2–53 తో, 169 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను గెలిపించాడు. రెండో టెస్టులో అతను ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. ఇంగ్లండ్ ఆ మ్యాచ్‌లో 405 పరుగుల తేడాతో ఓడిపోయింది. అతను గాయంతో మూడో టెస్టుకు దూరమయ్యాడు. నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 1–13 సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను ఇంగ్లండ్‌కు మ్యాచ్‌ గెలిచిన వికెట్‌తో సహా 3–69 తీసుకున్నాడు. దాంతో వారు యాషెస్‌ను తిరిగి పొందారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో వుడ్ 1–59 తీసుకున్నాడు. సిరీస్‌లోని చివరి టెస్టులో ఇంగ్లండ్ ఓడిపోయింది. అయితే, ఇంగ్లాండ్ 3-2తో సిరీస్‌ను గెలుచుకుని, యాషెస్‌ను తిరిగి కైవసం చేసుకుంది.

వుడ్ ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్‌డేకి ఎంపికయ్యాడు, అతను బాగా పరుగులిచ్చాడు. ఆస్ట్రేలియా గేమ్‌ను గెలుచుకుంది. అతను తదుపరి గేమ్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కానీ అతను మళ్లీ బాగా పరుగులిచ్చాడు. ఈసారి అతని తొమ్మిది ఓవర్లలో 0–65తో ముగించాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో గేమ్‌ను గెలుచుకుంది. తరువాతి రెండు గేమ్‌లకు జట్టు నుండి తొలగించబడిన తర్వాత, అతను చివరి వన్‌డేకి తిరిగి వచ్చి 1–25 సాధించాడు. అయితే ఇంగ్లాండ్ పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా వారు ఆ గేమ్‌ను, 3-2తో సిరీస్‌నూ కోల్పోయారు.

2015: పాకిస్తాన్

[మార్చు]

అతను పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్టులో ఆడాడు. అయితే అతను మ్యాచ్‌లో ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అది డ్రాగా ముగిసింది. కాంతి తగ్గిపోయినందున కారణంగా ఇంగ్లాండ్ విజయం దాకా వెళ్ళలేకపోయింది. అతను రెండో టెస్టులో బాగా ఆడాడు. అయినా, ఇంగ్లండ్ అందులో ఓడిపోయింది. అతను పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 3–39 తీసుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు తీసుకున్నాడు. పాకిస్తాన్ 178 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుపొందింది.

చీలమండ గాయం కారణంగా వుడ్, శ్రీలంకతో జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. అలాగే, పాకిస్తాన్‌తో జరిగే రిటర్న్ సిరీస్‌లో కూడా ఆడలేదు.

2016: పాకిస్తాన్

[మార్చు]

పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో వుడ్ తిరిగి వచ్చాడు. ఇంగ్లండ్ D/L పద్ధతిలో 44 పరుగుల తేడాతో గెలుపొందింది. అతను 1–57 సాధించాడు. అతను తదుపరి మ్యాచ్‌లో 3/46 తీసుకున్నాడు. ఇంగ్లండ్ పాకిస్తాన్‌ను 251 పరుగులకు పరిమితం చేసి, మ్యాచ్‌ను నాలుగు వికెట్ల తేడాతో గెలుచుకుంది. సిరీస్‌లోని మూడవ మ్యాచ్‌లో అతను 1–75 చేశాడు. ఇంగ్లండ్ 169 పరుగుల తేడాతో గెలిచింది. నాల్గవ మ్యాచ్‌ను కోల్పోయిన తర్వాత, అతను సిరీస్‌లోని చివరి మ్యాచ్‌కి తిరిగి వచ్చి 2–56 సాధించాడు. అయితే ఇంగ్లండ్ ఆ మ్యాచ్‌ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే వారు సిరీస్‌ను 4–1తో గెలుచుకున్నారు.

2019: వెస్టిండీస్

[మార్చు]

వెస్టిండీస్‌లో 3-టెస్టుల పర్యటనలో గాయపడిన ఆలీ స్టోన్ స్థానంలో వుడ్‌ని పిలిచారు. అతను మొదటి 2 మ్యాచ్‌లలో ఆడలేదు, ఈ రెండింటిలోనూ ఇంగ్లండ్ ఓడిపోయింది. సెయింట్ లూసియాలో జరిగిన మూడో టెస్టు కోసం జట్టులోకి తీసుకున్నారు. వుడ్ ఈ మ్యాచ్‌లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసాడు. విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 8.2 ఓవర్లలో 41 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు - టెస్టుల్లో అది అతని మొదటి ఐదు వికెట్ల పంట. ఇంగ్లాండ్ వెస్టిండీస్‌పై 142 పరుగుల ఆధిక్యం సాధించింది.

2019 క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]

2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టుకు ఎంపికయ్యాడు. [15] [16] 2019 జూన్ 14న, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో, వుడ్ వన్‌డేలలో తన 50వ వికెట్‌ను తీసుకున్నాడు. 2019 జూలై 11న, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్‌లో వుడ్, ఇంగ్లాండ్ తరపున తన 50వ వన్‌డే మ్యాచ్‌లో ఆడాడు. [17] క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో, 11వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్న వుడ్, మ్యాచ్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు. దాంతో ఇది సూపర్ ఓవర్‌కు దారితీసింది. [18] వుడ్ ఆట సమయంలో గాయంతో బాధపడ్డాడు. దీని వలన 2019 యాషెస్ సిరీస్‌లోని మొదటి మూడు టెస్టుల నుండి అతన్ని తొలగించారు. [19]

2020 - 2022

[మార్చు]

2019 యాషెస్ సిరీస్, న్యూజిలాండ్ పర్యటనను కోల్పోయిన తర్వాత, జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్‌లకు గాయాలైన కారణంగా వుడ్ 2019-20 దక్షిణాఫ్రికా పర్యటనలో మూడవ టెస్ట్‌లో టెస్టు క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. [20] ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 23 బంతుల్లో 42 పరుగులు చేసాడు. తర్వాత, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 3/32 సాధించాడు. ఇంగ్లాండ్ గెలిచింది. [21] నాల్గవ టెస్ట్‌లో వుడ్, దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 5/46తో సహా మ్యాచ్‌లో మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగులో 35 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ మళ్లీ గెలిచింది.[22] [23]

2020 మే 29న, COVID-19 మహమ్మారి తర్వాత ఇంగ్లాండ్‌లో ప్రారంభమయ్యే అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముందు శిక్షణను ప్రారంభించడానికి 55 మంది ఆటగాళ్ల బృందంలో వుడ్ పేరు కూడా చేర్చారు. [24] [25] 2020 జూన్ 17న, వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం మూసిన తలుపుల వెనుక శిక్షణను ప్రారంభించడానికి వుడ్‌ను ఇంగ్లండ్ 30 మంది సభ్యుల జట్టులో చేర్చారు. [26] [27] 2020 జూలై 4న, సిరీస్‌లోని మొదటి టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ యొక్క పదమూడు మంది సభ్యుల జట్టులో వుడ్‌ని చేర్చారు. [28] [29]

2021 సెప్టెంబరులో వుడ్, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఎంపికయ్యాడు. [30]

2021–22 యాషెస్‌కు ఎంపికయ్యాడు. [31]

మార్క్ వుడ్ బాక్సింగ్ డే టెస్టు 2వ రోజు బౌలింగ్ చేశాడు

2022 సెప్టెంబరులో, ఆస్ట్రేలియాలో జరిగే 2022 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టుకు వుడ్ ఎంపికయ్యాడు. వుడ్ టోర్నమెంట్‌లో అత్యంత వేగవంతమైన బౌలరు, ఇంగ్లండ్ తరపున సూపర్ 12 గేమ్‌లన్నిటిలో ఆడాడు. గాయం కారణంగా సెమీ-ఫైనల్, ఫైనల్‌లకు దూరమయ్యాడు. ఇంగ్లండ్ ఆ టోర్నమెంటును గెలుచుకుంది. 2019 వన్‌డే, 2022 T20 ప్రపంచ కప్‌లను గెలుచుకున్న జట్టులోని 6 గురు ఆటగాళ్ళలో వుడ్ ఒకడు.

2023 యాషెస్ సిరీస్‌లో మూడో టెస్టుకు వుడ్‌ని రీకాల్ చేశారు, అక్కడ అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [32] మ్యాచ్‌లో అతను మొత్తం 7/100 తీసుకున్నాడు. 16 బంతుల్లో 40 పరుగులు చేశాడు. [33]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వుడ్‌కు పెళ్ళైంది, ఒక కొడుకు ఉన్నాడు. [34] [35] అతను టీటోటలర్, లేబరు పార్టీకి మద్దతుదారుడు. [36] AFC వింబుల్డన్‌కు మద్దతుదారు.[37]

మూలాలు

[మార్చు]
  1. "England Cricket World Cup player ratings: How every star fared on the road to glory". Evening Standard. 15 July 2019. Retrieved 15 July 2019.
  2. "T20 World Cup: England beat Pakistan to win pulsating final in Melbourne". BBC. 13 November 2022. Retrieved 13 November 2022.
  3. "THE INSIGHT EDGE, WITH IG – Mark Wood's 2021/22 Ashes Series". CricViz. 19 January 2022. Retrieved 22 May 2022.
  4. "Minor Counties Championship Matches played by Mark Wood". CricketArchive. Retrieved 9 August 2011.
  5. "Minor Counties Trophy Matches played by Mark Wood". CricketArchive. Retrieved 9 August 2011.
  6. 6.0 6.1 "First-Class Matches played by Mark Wood". CricketArchive. Retrieved 9 August 2011.
  7. 7.0 7.1 "List A Matches played by Mark Wood". CricketArchive. Retrieved 9 August 2011.
  8. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 13 February 2022.
  9. "Mark Wood out of West Indies tour, IPL 2022 with elbow injury". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-04-03.
  10. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  11. "Jonathan Trott: England recall Warwickshire batsman". BBC Sport. 18 March 2015. Retrieved 18 March 2015.
  12. "England tour of Ireland, Only ODI: Ireland v England at Dublin, May 8, 2015". ESPN Cricinfo. Retrieved 8 May 2015.
  13. "New Zealand tour of England, 1st Test: England v New Zealand at Lord's, May 21–25, 2015". ESPN Cricinfo. 21 May 2015. Retrieved 21 May 2015.
  14. "New Zealand tour of England, Only T20I: England v New Zealand at Manchester, Jun 23, 2015". ESPNcricinfo. ESPN Sports Media. 23 June 2015. Retrieved 23 June 2015.
  15. "Jofra Archer misses World Cup cut but included to play Ireland, Pakistan". ESPN Cricinfo. Retrieved 17 April 2019.
  16. "England leave out Jofra Archer from World Cup squad". International Cricket Council. Retrieved 17 April 2019.
  17. "ICC Cricket World Cup 2019 (Semi-final 2): Australia vs England – Stats Preview". Cricket Addictor. 11 July 2019. Retrieved 11 July 2019.
  18. "'I drove home wearing my World Cup medal'". BBC Sport.
  19. Wigmore, Tim (21 July 2019). "Mark Wood hoping to return from injury for final two Ashes Tests". The Telegraph.
  20. "Jofra Archer out and Mark Wood in for third Test against South Africa". TheGuardian.com. 15 January 2020.
  21. "England complete innings win despite 99-run last-wicket stand".
  22. "England's Mark Wood says longer run-up was key to five-wicket Test haul against South Africa".
  23. "Mark Wood's nine-wicket haul wraps up 3–1 England win".
  24. "England Men confirm back-to-training group". England and Wales Cricket Board. Retrieved 29 May 2020.
  25. "Alex Hales, Liam Plunkett left out as England name 55-man training group". ESPN Cricinfo. Retrieved 29 May 2020.
  26. "England announce 30-man training squad ahead of first West Indies Test". International Cricket Council. Retrieved 17 June 2020.
  27. "Moeen Ali back in Test frame as England name 30-man training squad". ESPN Cricinfo. Retrieved 17 June 2020.
  28. "England name squad for first Test against West Indies". England and Wales Cricket Board. Retrieved 4 July 2020.
  29. "England v West Indies: Dom Bess in squad, Jack Leach misses out". BBC Sport. Retrieved 4 July 2020.
  30. "Tymal Mills makes England's T20 World Cup squad, no return for Ben Stokes". ESPN Cricinfo. Retrieved 9 September 2021.
  31. "England name Men's Test squad for 2021–22 Ashes Tour". England and Wales Cricket Board. Retrieved 28 November 2021.
  32. ""National treasure"- Twitterati hail Mark Wood after his player of the match performance in 3rd Ashes Test keeps England alive in series". Sportskeeda. Retrieved 10 July 2023.
  33. "3rd Test 2023 Ashes". Cricinfo. Retrieved 10 July 2023.
  34. "Mark Wood embracing yet another bump in the road". Independent.co.uk. 7 May 2020.
  35. Dean Wilson, Weary Wood's on the bubble, Daily Express, London, 14 January 2022, page 53.
  36. Hoult, Nick; James, Steve (2020). Morgan's Men. London: Allen & Unwin. p. 154. ISBN 9781911630937.
  37. "England cricket star vows to bring World Cup accolade to Plough Lane". 5 June 2020.