Jump to content

పి. చంద్రశేఖర అజాద్

వికీపీడియా నుండి
పి. చంద్రశేఖర అజాద్
జననంపి.చంద్రశేఖర అజాద్
1955, మే 22
గుంటూరు జిల్లా
ఇతర పేర్లుపి.చంద్రశేఖర అజాద్
వృత్తివిశ్రాంత ప్రభుత్వోద్యోగి
మతంహిందు
భార్య / భర్తపి.జానకి
పిల్లలుస్పందన్

పమిడిముక్కల చంద్రశేఖర అజాద్ పేరుపొందిన కథా/నవలా రచయిత[1]. ఆయన 2024 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారంకు ఎంపికయ్యాడు.[2]

జీవితవిశేషాలు

[మార్చు]

ఇతడు 1955, మే 22న గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలం, వెల్లటూరు గ్రామంలో పమిడిముక్కల లక్ష్మణరావు, విజయలక్ష్మి[3] దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశాడు. ఇతని చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి ఇతడిని పెంచి పెద్దచేసింది. నాగార్జున విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పట్టా పుచ్చుకున్నాడు.స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నాడు. సినిమా రంగంలోను, టి.విలలోను రచయితగా, ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.

రచనలు

[మార్చు]

ఇతడు అనేక కథల పోటీలలో, నవలల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు. ఇతని నవలలు అనేక పత్రికలలో సీరియళ్లుగా ప్రచురింపబడ్డాయి. పుస్తక రూపంలో వెలువడిన ఇతని రచనలు:

  1. రోడ్డు మీద గులాబీ (కథల సంపుటి)
  2. పి.చంద్రశేఖర అజాద్ కథలు (కథల సంపుటి)
  3. అహానికి రంగుండదు (నవల)
  4. ఫ్యామిలీ ఫోటో (నవల)
  5. అడవి (నవల)
  6. కిడ్నాప్ కిడ్నాప్ (నవల)
  7. శ్వేతపత్రం (నవల)
  8. మహావృక్షం (నవల)
  9. తెలిమబ్బుల ఛాయ (నవల)
  10. నాన్నకో ఉత్తరం (నవల)
  11. జీవనసంగీతం (నవల)
  12. పావురం (నవల)
  13. టు మై కంట్రీ విత్ లవ్ (నవల)
  14. మనోప్రస్థానం (నవల)
  15. మూడ్స్ (ఫీచర్)
  16. అందమైన పూలతోట (పిల్లల నవల)
  17. దేవతా! ఓ దేవతా!! (పిల్లల నవల)
  18. జమీందారు కోట (పిల్లల నవల)
  19. మా హృదయం (బాలసాహిత్యం)

పురస్కారాలు, బహుమతులు

[మార్చు]
  • నవ్య వీక్లీ, సి.పి.బ్రౌన్ అకాడెమీ నిర్వహించిన నవలల పోటీలలో ఫ్యామిలీ ఫోటో నవలకు తృతీయ బహుమతి
  • అమెరికా తెలుగు అకాడమీ (ఆటా), వార్త నిర్వహించిన నవలలపోటీలలో తెలిమబ్బుల ఛాయ నవలకు 30,000 రూ|| బహుమతి.
  • తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అట్లాంటా (తానా) నిర్వహించిన నవలల పోటీలో మనోప్రస్థానం నవలకు కన్సొలేషన్ బహుమతి.
  • ఆంధ్రభూమి నిర్వహించిన ఉగాది కథలపోటీ (2011)లో రెండు విధ్వంసాలు[4] కథకు ప్రోత్సాహక బహుమతి.

మూలాలు

[మార్చు]
  1. సాహిత్య అకాడెమీ (1999). Who's who of Indian Writers (1 ed.). న్యూఢిల్లీ: సాహిత్య అకాడెమీ. p. 217. ISBN 81-260-0873-3. Retrieved 27 December 2014.
  2. Nava Telangana (15 June 2024). "పి.చంద్రశేఖర్ ఆజాద్ కు బాల సాహిత్య పురస్కారం -". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  3. పి., చంద్రశేఖర అజాద్ (30 Aug 2014). "మామూలు మ‌నిషి మా అమ్మ‌". ప్రజాశక్తి దినపత్రిక. Retrieved 27 December 2014.
  4. పి., చంద్రశేఖర అజాద్ (26 June 2011). "రెండు విధ్యంసాలు". ఆంధ్రభూమి ఆదివారం. Archived from the original on 31 డిసెంబరు 2012. Retrieved 27 December 2014.