అలెగ్జాండర్ ఫ్లెమింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్
Sir Alexander Fleming
FRSE, FRS, FRCS(Eng)
జననం(1881-08-06)1881 ఆగస్టు 6
Lochfield, Ayrshire, Scotland
మరణం1955 మార్చి 11(1955-03-11) (వయసు 73)
London, England
పౌరసత్వంయునైటెడ్ కింగ్‌డమ్
జాతీయతస్కాటిష్
రంగములుBacteriology, immunology
చదువుకున్న సంస్థలుRoyal Polytechnic Institution
St Mary's Hospital Medical School
Imperial College London
ప్రసిద్ధిపెన్సిలిన్ ఆవిష్కరణ
ముఖ్యమైన పురస్కారాలువైద్య రంగంలో నోబెల్ బహుమతి(1945)
సంతకం

సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ (ఆగస్టు 6, 1881 - మార్చి 11, 1955) స్కాట్లాండుకు చెందిన జీవ శాస్త్రవేత్త, వైద్యుడు. 1923 లో కనుగొన్న ఎంజైములు, లైసోజైములు, 1928 లో కనుగొన్న ప్రపంచ మొట్ట మొదటి యాంటీబయోటిక్ పెన్సిలిన్ ఈయన పరిశోధనల్లో ముఖ్యమైనవి. పెన్సిలిన్ కనుగొన్నందుకు ఆయన 1945లో హోవర్డ్ ఫ్లోరే, ఎర్నెస్ట్ బోరిస్ చైన్ లతో కలిసి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు. బ్యాక్టీరియాలజీ, ఇమ్యునాలజీ, కీమోథెరపీ మీద అనేక వ్యాసాలు రాశాడు.

బాల్య జీవితం[మార్చు]

ఈయన స్కాట్లండు కు చెందినవాడు. లండను లోని మేరీ మెడికల్ కాలేజీ నుంచి 1906 లో ఈయన డిగ్రీ తీసుకున్నారు. అక్కడే కొంతకాలం పాటు బాక్టీరియా లను నిరోధించే పదార్థాలపై పరిశోధనలు చేశాడు. అక్కడ నుంచే ఆర్మీ మెడికల్ కార్ఫ్ కి వెళ్లి, మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా 1918 లో మళ్ళీ సెయింట్ మేరీ మెడికల్ కాలేజీకి వచ్చి వేశాడు. ఆంటీ బయాటిక్స్ మీద పరిశోధనలు మాత్రం విడువకుండా చేసేవాడు. ఫలితంగా 1928 లో పెన్సిలిన్ ను రూపొందించగలిగాడు.

చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు... ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసి పనిలో చేరాడు... ఇరవై ఏళ్ల వయసులో తిరిగి చదువు మొదలెట్టి శాస్త్రవేత్త అయ్యాడు... గడ్డురోగాల నుంచి ప్రాణాలు కాపాడే మందు కనిపెట్టి మహోపకారం చేశాడు... ఆయన పుట్టిన రోజు 1881 ఆగస్టు 6న .

వెయ్యేళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందింది 'పెన్సిలిన్‌'. తొలి యాంటీ బయోటిక్‌గా పేరొందిన ఆ మందును కనిపెట్టిన శాస్త్రవేత్తే అలగ్జాండర్‌ ఫ్లెమింగ్‌. వేరే ప్రయోగం చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇది బయటపడడం విశేషం. పెన్సిలిన్‌ వల్ల క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్‌ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళికి రక్షణ కలుగుతోంది. దీన్ని కనిపెట్టినందుకు ఫ్లెమింగ్‌ 1945లో నోబెల్‌ బహుమతిని పొందారు.

స్కాట్లాండ్‌లో 1881 ఆగస్టు 6న ఓ రైతు కుటుంబంలో ఎనిమిది సంతానంలో చివరివాడిగా పుట్టిన ఫ్లెమింగ్‌, ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అమ్మ పొలం పనులు చేస్తుంటే అక్కడి బడిలోచదివిన అతడు, ఆపై లండన్‌లో ఉండే పెద్దన్నయ్య దగ్గరకు వెళ్లి హైస్కూల్లో చేరాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి షిప్పింగ్‌ కంపెనీలో గుమాస్తాగా చేరాల్సి వచ్చింది. అనుకోకుండా ఆస్తి కలిసి రావడంతో తిరిగి ఇరవయ్యేళ్ల వయసులో చదువును కొనసాగించడం ప్రపంచానికెంతో మేలు చేకూర్చింది. సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో వైద్యవిద్యలో చేరి చురుగ్గా చదువుతూనే రైఫిల్‌ షూటింగ్‌, ఈత, వాటర్‌పోలో క్రీడల్లో బహుమతులు పొందుతూ ఉండేవాడు. డిగ్రీ పొందాక పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు.

బ్యాక్టీరియా పై పరిశోధన[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించాడు. గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్‌ సోకి చాలా మంది సైనికులు చనిపోవడాన్ని గమనించిన ఫ్లెమింగ్‌, యుద్ధానంతరం బ్యాక్టీరియాపై పరిశోధనలు చేయసాగాడు. వాటిలో భాగంగా 'స్టెఫైలో కోకి' (Staphylo cocci) సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలను బల్లపై పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు వచ్చి చూస్తే బయటి వాతావరణం ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలిరంగులో బూజులాంటి తెట్టు (ఫంగస్‌) కట్టి ఉండడం గమనించాడు. చిత్రంగా ఆ బూజు ఆశించినంత మేరా పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై కనిపించాయి. అంటే ఆ బూజులో సూక్ష్మజీవులను చంపే పదార్థమేదో ఉందన్నమాట! దాంతో ఫ్లెమింగ్‌ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని వేరుచేయగలిగాడు. లాటిన్‌లో పెన్సిలియమ్‌ అంటే చిన్న కుంచె అనే అర్థం ఉండడంతో దానికి 'పెన్సిలిన్‌' అని పేరు పెట్టాడు. దాన్ని 1928లో కనిపెట్టగా, మరిన్ని పరిశోధనలు చేసి ఓ మందుగా మార్చి వాడుకలోకి తీసుకు రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్‌ యుగానికి నాంది పలికినట్టయింది.

నోబుల్ ప్రైజ్[మార్చు]

అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాటిష్ జీవశాస్త్రవేత్త, వైద్య రసాయన శాస్త్రవేత్త (ఫార్మకాలగిస్ట్) . ఈయన కనిపెట్టిన "ఎంజైము లైసోజైము(1923 ) , అంటి బయోటిక్ ' పెన్సిలిన్(1928 ) ' ముఖ్యమైనవి . నోబెల్ ప్రైజ్ (1945) వచ్చినది .

ఈయన . తండ్రి " హుగ్ ఫ్లెమింగ్, తల్లి - గ్రేసీ స్టిర్లింగ్ మోర్టన్, ఈయన మూడవ సంతానము . మొత్తము సవతి తల్లి పిల్లలతో కలిపి ఏడుగురు తోబుట్టువులు .

వైద్యశాస్త్రంలో అద్భుతమైన యాంటీబయాటిక్ మందుగా పేరుపొందిన పెన్సిలిన్ పేరు చెప్పగానే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దాన్ని కనిపెట్టినట్టు గుర్తొస్తాడు. 1945లో వైద్యశాస్త్రానికి నోబెల్ బహుమానం ఈ పెన్సిలిన్ కనుగొన్నందుకు ఫ్లెమింగ్ తో పాటు హొవార్డ్ ఫ్లోరె, ఎర్నెస్ట్ చెయిన్ అనే మరో ఇద్దరు శాస్త్రవేత్తలకు కూడా ఇచ్చారు.

పరిశోధనలు[మార్చు]

గౌరవ పురస్కారాలు[మార్చు]

Fleming (centre) receiving the Nobel prize from King Gustaf V of Sweden (right) in 1945
Faroe Islands stamp commemorating Fleming
  • ఫ్లెమింగ్, ఫ్లోరే, చైన్ సంయుక్తంగా 1945 లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.[1]
  • ఫ్లెమింగ్ కు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండు హంటేరియన్ ప్రొఫెసర్ హోదాను ఇచ్చింది.
  • ఫ్లెమింగ్ కు 1944 లో జార్జి VI మహారాజు నైట్ బాచెలర్ మెడల్ ను బహుకరించాడు.[2]
  • 1999 లో టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు 100 మంది ప్రముఖ వ్యక్తులలో ఒకడిగా గుర్తించింది.[3]
  • 2002 లో ఫ్లెమింగ్ ను బి.బి.సి. 100 మంది ప్రముఖ బ్రిటిష్ వ్యక్తులలో ఒకడిగా ఎన్నిక ద్వారా నిర్ణయించింది.[4]

ఫ్లెమింగ్ గురించిన ప్రచురణలు[మార్చు]

  • The Life Of Sir Alexander Fleming, Jonathan Cape, 1959. Maurois, André.
  • Nobel Lectures,the Physiology or Medicine 1942–1962, Elsevier Publishing Company, Amsterdam, 1964
  • An Outline History of Medicine. London: Butterworths, 1985. Rhodes, Philip.
  • The Cambridge Illustrated History of Medicine. Cambridge, England: Cambridge University Press, 1996. Porter, Roy, ed.
  • Penicillin Man: Alexander Fleming and the Antibiotic Revolution, Stroud, Sutton, 2004. Brown, Kevin.
  • Alexander Fleming: The Man and the Myth, Oxford University Press, Oxford, 1984. Macfarlane, Gwyn
  • Fleming, Discoverer of Penicillin, Ludovici, Laurence J., 1952

మూలాలు[మార్చు]

  1. "100,000 visitors in 6 days". National Museums Scotland. 3 August 2011. Archived from the original on 23 ఫిబ్రవరి 2012. Retrieved 4 March 2012.
  2. "People of the century". P. 78. CBS News. Simon & Schuster, 1999
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Time 100 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. "100 great Britons - A complete list". Daily Mail. Retrieved 3 August 2012

బయటి లింకులు[మార్చు]