శాస్త్రవేత్త

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

/www.victorianweb.org/science/whewell.html|title= William Whewell (1794-1866) gentleman of science|accessdate=2007-05-19}}</ref>[1] 20వ శతాబ్దానికే శాస్త్రీయ విధానము, దృక్పధము, సంస్థలు విస్తరించడం వలన "శాస్త్రజ్ఞులు" సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందారు.


మానవ జీవితాన్ని ఆదిమ కాలంనుండి విజ్ఞానం (Science), సాంకేతికత (technology) ఎంతో ప్రభావితం చేశాయి. నాగరికతలో ఈ రెండు విషయాల అభివృద్ధిలోను శాస్త్రవేత్తలు ముఖ్యమైన పాత్ర కలిగిఉన్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలలో రెండు ప్రధాన విభాగాలు గుర్తింపబడుతున్నాయి. (1) సైద్ధాంతిక శాస్త్రజ్ఞులు - వీరు లభించిన సమాచారాన్ని బట్టి కారణాలను తెలియజెబుతారు. వాటి ఆధారంగా తెలియని విషయాలను ఊహిస్తారు. (2) ప్రయోగ శాస్త్రజ్ఞులు - వీరు నమూనాల ద్వారా గాని, ఇతర విధానాల ద్వారా గాని, పరిశీలనల ద్వారా గాని కొలతలు లెక్కించి వాస్తవంగా ఏమి జరుగుతున్నదో నిర్ధారిస్తారు. అయితే ఈ రెండు రకాల శాస్త్రవేత్తలు రెండు వేరు వేరు సమూహాలు కావు. చాలా మంది అవీ ఇవీ కూడా చేస్తుంటారు. గణితం కూడా విజ్ఞానంతోనే పరిగణించడం జరుగుతుంది. గణితజ్ఞులు కూడా ఇతర శాస్త్రజ్ఞులలలాగానే సిద్ధాంతాలు చేస్తారు. ప్రయోగాలు జరుపుతారు.


శాస్త్రజ్ఞులు అనేక కారణాల వలన తమ రంగాలను ఎంచుకోవడం, ఆ రంగానికి చెందిన పనిలో నిమజ్ఞులు కావడం జరుగుతుంటుంది. చాలా మందికి "విజ్ఞానం" సముపార్జించడమే (తెలుసుకోవడమే) ధ్యేయం. ప్రకృతిలో జరిగే విషయాలు, వాటికి కారణాలు, వాటి ఫలితాలు ఇవి శాస్త్రజ్ఞులకు చాలా ఆసక్తి కలిగించే విషయాలు. ఇవే కాకుండా సమాజంలో లభించే గౌరవం, సాటి శాస్త్రజ్ఞులలో లభించే గుర్తింపు, తము కనుగొన్న విషయాలను సమాజ శ్రేఐస్సు కోసం వినియోగించడంలో ఉండే ఆనందం కూడా వారికి ప్రోత్సాహకాలుగా పని చేస్తాయి. ధనార్జన కోసం శాస్త్రీయ పరిశోధనా రంగాన్ని ఎన్నుకోవడం పెద్దగా జరుగదు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Tamara Preaud, Derek E. Ostergard, The Sèvres Porcelain Manufactory. Yale University Press 1997. 416 pages. ISBN 0-300-07338-0 Page 36.

ఆంగ్ల వికీ లింకులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]