ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

వికీపీడియా నుండి
(ఆల్బర్ట్ ఐన్‌స్టయిన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
ఐన్‌స్టీన్ 1921లో
జననం(1879-03-14)1879 మార్చి 14
ఉల్మ్, వుర్టంబెర్గ్ రాజ్యం, జర్మన్ సామ్రాజ్యం
మరణం1955 ఏప్రిల్ 18(1955-04-18) (వయసు 77)
ప్రిన్స్టన్, న్యూజెర్సీ, యునైటెడ్ స్టేట్స్
పౌరసత్వం🐱
రంగములుఫిజిక్స్, తత్వశాస్త్రం
వృత్తిసంస్థలు
ప్రసిద్ధి
ముఖ్యమైన పురస్కారాలు
సంతకం

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ [1] (1879 మార్చి 14 -1955 ఏప్రిల్ 18 ) జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని (సాధారణ సాపేక్షత) ప్రతిపాదించారు .[2][3]

అతను తత్త్వశాస్త్రంలో ప్రభావవంతమైన కృషి చేశాడు. [4][5] మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc^2 ను కనిపెట్టాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఫార్ములా.[6] 1921లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు . క్వాంటం థియరీ పరిణామ క్రమం పరిణామ క్రమానికి ముఖ్యమైన ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లాను కనిపెట్టినందుకు ఈ బహుమతి అందుకున్నారు అతను.[7]

అతను కెరీర్ మొదట్లో న్యూటన్ మెకానిక్స్ సంప్రదాయ మెకానిక్స్ ను  పునరుర్ధరించలేదని భావించేవారు. దీంతో స్పెషల్ రెలెటివిటి అభివృద్ధికి బాటలు పడ్డాయి. 1916 లో  సాధారణ  సాపేక్షతపై పేపర్ ప్రచురించారు.  స్టాటిస్టికల్ మెకానిక్స్, క్వాంటం థియరీల్లోని సమస్యలపై దృష్టిపెట్టారు ఐన్‌స్టీన్ . పార్టీకల్ థియరీ, అణువుల చలనాలపై వ్యాఖ్యానం చేశారు అతను. అతను ఉష్ణ లక్షణాల గురించి చేసిన  పరిశోధన కాంతి ఫోటాన్ సిద్ధాంతం కనుగొనడానికి ఉపయోగపడింది. 1917లో సాధారణ సాపేక్షత సిద్ధాంతాన్ని భారీ స్థాయిలో విశ్వానికి అనువర్తింపచేశారు ఐన్ స్టీన్.[8][9]

1933లో హిట్లర్ జర్మనీలో అధికారంలోకి వచ్చాకా అతను అమెరికా  వెళ్ళారు.  అతను  జ్యుయిష్  జాతికి చెందినందున తిరిగి జర్మనీ వెళ్ళలేదు. అమెరికాలో బెర్లిన్ అకాడమీ  ఆఫ్  సైన్సెస్  లో ఆచార్యునిగా  పనిచేశాడు. 1940లో  అమెరికన్  పౌరసత్వం  లభించడంతో  అక్కడే స్థిరపడిపోయారు. [10]  రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా  అత్యంత శక్తివంతమైన బాంబులపై పరిశోధన జరుగుతోందనీ, ఇది అణుబాంబు తయారీకి దారితీస్తుందని వివరిస్తూ అప్పటి అమెరికా  అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూసెవెల్ట్ కు ఉత్తరం రాశారు. తాను యుద్ధానికి  వ్యతిరేకం  కాదనీ, కొత్తగా కనుగొన్న అణుబాంబు  ప్రయోగానికి  తాను పూర్తి వ్యతిరేకమనీ  స్పష్టంచేశారు. అణు ఆయుధాలను ఉపయోగించకూడదంటూ బ్రిటన్ కు  చెందిన  తత్త్వవేత్త  బెర్ట్రాండ్ రుసెల్ తో  కలసి  రుసెల్- ఐన్‌స్టీన్ మానిఫెస్టోపై సంతకం చేశాడు. 1955లో చనిపోయేంతవరకూ న్యూజెర్సీలోని ప్రిన్స్ టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్సెడ్ స్టడీ సంస్థలో పనిచేశాడు .

ఐన్‌స్టీన్ 300కు పైగా శాస్త్రీయ పత్రికలు, 150 శాస్త్రీయేతర పత్రికలు ప్రచురించాడు.[8][11] 5 డిసెంబరు 2014న విశ్వవిద్యాలయాల్లోని ఐన్‌స్టీన్ కు చెందిన 30,000 శాస్త్రీయ పత్రాలను విడుదల చేశాడు.[12] చాలా రంగాల్లో అతను చేసిన కృషికి తెలివితేటలకు అతను పేరు మారుపేరుగా మారింది.[13]

జీవిత సంగ్రహం

[మార్చు]

తొలినాళ్ళ జీవితం, చదువు

[మార్చు]

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1879 మార్చి 14న జర్మనీ దేశంలోని వుర్టెంబర్గ్ రాజ్యంలోని ఉల్మ్ లో జన్మించారు.[14] అతను తండ్రి హెర్మన్ ఐన్‌స్టీన్ సేల్స్ మేన్, ఇంజినీర్ గా పనిచేశారు. 1880లో మునిచ్ కు వారి కుటుంబం మారిపోయింది. అతను తండ్రి, బంధువు జాకబ్ కలసి విద్యుత్తు పరికరాలను తయారు చేసే కంపెనీ స్థాపించారు.[14]

మరణం

[మార్చు]
ఐన్ స్టీన్ 1933

1955 ఏప్రిల్ 17 న, ఐన్‌స్టీన్ ఉదర బృహద్ధమని సంబంధ అనూరిజం చీలిక వలన అంతర్గత రక్తస్రావం సంభవించింది. ఐన్‌స్టీన్ శస్త్రచికిత్సను తిరస్కరించాడు, "నేను కోరుకున్నప్పుడు నేను వెళ్లాలనుకుంటున్నాను. జీవితాన్ని కృత్రిమంగా పొడిగించడం నాకు ఇష్టం లేదు. నేను నా వాటాను చేసాను; వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది." మరుసటి రోజు ఉదయం 76 సంవత్సరాల వయస్సులో ప్రిన్స్టన్ ఆసుపత్రిలో మరణించాడు , చివరి వరకు పని కొనసాగించాడు. శవపరీక్ష సమయంలో, ప్రిన్స్టన్ హాస్పిటల్ పాథాలజిస్ట్, థామస్ స్టోల్ట్జ్ హార్వే, ఐన్‌స్టీన్ మెదడును తన కుటుంబం అనుమతి లేకుండా సంరక్షణ కోసం తొలగించాడు, భవిష్యత్ న్యూరోసైన్స్ ఐన్‌స్టీన్ ఇంత తెలివితేటలు గలవాటిని కనుగొనగలదని ఆశతో.[15] [16] ఐన్‌స్టీన్ అవశేషాలు దహనం చేయబడ్డాయి, అతని బూడిదను తెలియని ప్రదేశంలో చెల్లాచెదురుగా ఉంచారు

ఐన్ స్టీన్ జీవిత కాలక్రమం

[మార్చు]

1879: జర్మనీ దేశంలోని వుర్టెంబర్గ్ రాజ్యంలోని ఉల్మ్ లో జన్మించాడు.

1884–1894: మునిచ్ లోని కాథలిక్ ప్రైమరీ పాఠశాల కు, లుయిట్పోల్డ్ గ్యమ్నసిం పాఠశాలలో చదువుకున్నాడు.

1894–1895: ఇటలీలోని పవియాకు వెళ్ళాడు.

1895–1896: సిట్జర్ ల్యాండ్ లోని ఆరయులో మిట్టెల్ స్కులే పాఠశాలలో మాధ్యమిక విద్య అభ్యసించాడు.

1896: వుర్టెంబర్గ్ పౌరసత్వం వదులుకున్నాడు.

1896–1900: జురిచ్ లో పాలిటెక్నిక్ చదువుకున్నాడు.

1901: స్విస్ పౌరసత్వం లభించింది.

1902–1909: స్విట్జర్ ల్యాండ్ లోని బెర్నెలో స్విస్ పేటెంట్ కార్యాలయంలో పనిచేశాడు.

1902: ఇటలీలోని మిలాన్ లో అతను తండ్రి హెర్మన్ ఐన్ స్టీన్ మరణం.

1903: మిలెవా మారిక్ ను పెళ్ళి చేసుకున్నాడు.

1905: నాలుగు శాస్త్రీయ పత్రాలను ప్రచురించాడు.

1905: స్విట్జర్ ల్యాండ్ లోని జురిచ్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి అందుకున్నాడు.

1907–1916: సాధారణ సాపేక్షిత సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు.

1908–1909: బెర్న్ విశ్వవిద్యాలయంలో లెక్చెరర్ గా పనిచేశాడు.

1909–1911: జురిచ్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు.

1911–1912: ప్రేగ్యులోని చార్లెస్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశాడు.

1912–1914: ఎథ్ జురిచ్ లో ప్రొఫెసర్ గా పనిచేశాడు.

1914: బెర్లిన్ కు తన కుటుంబంతో సహా వెళ్ళిపోయారు ఐన్ స్టీన్. కొన్ని నెలల తరువాత వారి ఇద్దరు కుమారులను తీసుకుని అతను భార్య మిలెవా మరిక్ అతను వదిలి తిరిగి జురిచ్ కు వెళ్ళిపోయారు (అప్పటికి వారి ఇద్దరు కుమారులు 4, 10 ఏళ్ళ వారు).

1914: స్విస్ పౌరసత్వంతో పాటు, జర్మన్ పౌరసత్వం కూడా అతనుకు లభించింది.

1914–1933: ప్రషియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో సభ్యుడయ్యాడు.

1914–1932: బెర్లిన్ లోని కైసెర్ విల్హెల్మ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజిక్స్ కు అధ్యక్షునిగా అయ్యారు.

1914–1917: హంబొల్డ్ యూనివర్శిటీ ఆఫ్ బెర్లిన్ లో ప్రొఫెసర్ గా పనిచేశాడు.

1916–1918: జర్మన్ ఫిజికల్ సొసైటీకి అధ్యక్షునిగా వ్యవహిరించాడు.

1919: మిలెవా మారిక్ కు విడాకులు ఇచ్చిన ఐన్ స్టీన్, తన కజిన్ ఎల్సా లోవెంథాల్ ను వివాహం చేసుకున్నాడు.

1920: బెర్లిన్ లోని ఐన్ స్టీన్ గృహంలో అతను తల్లి పౌలిన్ మరణించింది.

1921: భౌతికశాస్త్రంలో అతను చేసిన కృషికి నోబెల్ బహుమతి అందుకున్నాడు.

1933: జర్మన్ పౌరసత్వం వదులుకుని అమెరికా వలస వెళ్ళిపోయాడు.

1933–1955: అమెరికాలోని న్యూజెర్సీ, ప్రిన్స్ టౌన్ లో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్వాన్సెడ్ స్టడీలో ప్రొఫెసర్ గా పనిచేశాడు.

1936: అతను రెండో భార్య ఎల్సా మరణించింది.

1940: స్విస్ పౌరసత్వంతో పాటు అమెరికా పౌరసత్వం కూడా లభించింది.

1951: ప్రిన్స్ టౌన్ లోని అతను సోదరి మజా ఇంటిలో ఐన్ స్టీన్ మరణించాడు

1951: ప్రిన్స్ టౌన్ లో ఐన్ స్టీన్ మరణించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జర్మనీలోని విట్టెన్‌బర్గ్‌లో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తండ్రి ఇంజనీర్. తల్లి పౌలిన్ ఐన్‌స్టీన్. ఐన్‌స్టీన్‌కు మొదట్లో మాట్లాడటం కష్టంగా ఉండేది. అతను చదువులో అంతగా రాణించలేకపోయేవాడు. ఐన్స్టీన్ మాతృభాష జర్మన్ తరువాత అతను ఇటాలియన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు.

1880లో, అతని కుటుంబం మ్యూనిచ్‌కు తరలివెళ్లింది, అక్కడ అతని తండ్రి మామ కలిసి "ఎలెక్ట్రోటెక్నిస్చే ఫ్యాబ్రిక్ J. ఐన్‌స్టీన్ & సీ" అనే కంపెనీని ప్రారంభించారు, ఈ కంపెనీ విద్యుత్ పరికరాలను తయారు చేస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కుటుంబం యూదు మత సంప్రదాయాలను పాటించలేదు. తల్లి ఒత్తిడితో పియానో వాయించడం నేర్చుకున్నాడు. ఆల్బర్ట్ ఐన్స్టీ

1894లో, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తండ్రి కంపెనీ మ్యూనిచ్ నగరానికి విద్యుత్ దీపాలను సరఫరా చేయలేకపోయింది. ఫలితంగా నష్టాల కారణంగా తన కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చింది. వ్యాపారం కోసం, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కుటుంబం ఇటలీకి తరలివెళ్లారు, అక్కడ వారు మొదట మిలన్‌లో స్థిరపడ్డారు కొన్ని నెలల తర్వాత పావియా నగరంలో స్థిరపడ్డారు. కుటుంబం పావియాకు మారిన మారినా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తల్లితండ్రుల వెంట వెళ్లలేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇటలీలో ఉన్న సమయంలో "యాన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది మాగ్నెటిక్ ఫీల్డ్" అనే శీర్షికతో ఒక చిన్న వ్యాసం రాశాడు.

1895లో, 16 సంవత్సరాల వయస్సులో, ఐన్‌స్టీన్ జ్యూరిచ్‌లోని స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ స్కూల్లో జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యాడు. అతను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. కానీ అతను భౌతిక శాస్త్రం గణితంలో మంచి మార్కులు సాధించాడు. ఉపాధ్యాయుల సలహా మేరకు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన మాధ్యమిక పాఠశాల విద్యను పూర్తి చేయడానికి 1895 1896లో స్విట్జర్లాండ్‌లోని ఆరౌలో ఉన్న అర్గోవియన్ కాంటోనల్ స్కూల్ (వ్యాయామశాల)లో చదివాడు.

మూలాలు

[మార్చు]
  1. Wells, John (April 3, 2008). Longman Pronunciation Dictionary (3rd ed.). Pearson Longman. ISBN 1-4058-8118-6.
  2. Whittaker, E. (1 November 1955). "Albert Einstein. 1879–1955". Biographical Memoirs of Fellows of the Royal Society. 1: 37–67. doi:10.1098/rsbm.1955.0005. ISSN 0080-4606. JSTOR 769242.
  3. Fujia Yang; Joseph H. Hamilton (2010). Modern Atomic and Nuclear Physics. World Scientific. ISBN 978-981-4277-16-7.
  4. Don A. Howard, ed. (2014) [First published 11 February 2004], "Einstein's Philosophy of Science", Stanford Encyclopedia of Philosophy (website), The Metaphysics Research Lab, Center for the Study of Language and Information (CSLI), Stanford University, retrieved 2015-02-04 
  5. Don A. Howard (December 2005), "Albert Einstein as a Philosopher of Science" (PDF), Physics Today, American Institute of Physics, 58 (12): 34–40, Bibcode:2005PhT....58l..34H, doi:10.1063/1.2169442, retrieved 2015-03-08 – via University of Notre Dame, Notre Dame, IN, author's personal webpage 
  6. David Bodanis (2000). E = mc2: A Biography of the World's Most Famous Equation. New York: Walker.
  7. Archived 2008-10-17 at the Wayback Machine, Nobel Media AB, archived from the original on 5 October 2008, retrieved 2015-02-04 – via Nobelprice.org 
  8. 8.0 8.1 Scientific Background on the Nobel Prize in Physics 2011. Archived 2015-08-28 at the Wayback Machine
  9. Overbye, Dennis (24 November 2015). "A Century Ago, Einstein's Theory of Relativity Changed Everything". New York Times. Retrieved 24 November 2015.
  10. Paul S. Boyer; Melvyn Dubofsky (2001). The Oxford Companion to United States History. Oxford University Press. p. 218. ISBN 978-0-19-508209-8.
  11. Paul Arthur Schilpp, ed. (1951), Albert Einstein: Philosopher-Scientist, II, New York: Harper and Brothers Publishers (Harper Torchbook edition), pp. 730–746 .
  12. Overbye, Dennis (4 December 2014). "Thousands of Einstein Documents Are Now a Click Away". New York Times. Retrieved 2015-01-04.
  13. Result of WordNet Search for Einstein, 3.1, The Trustees of Princeton University, retrieved 2015-01-04 
  14. 14.0 14.1 "Albert Einstein – Biography". Nobel Foundation. Archived from the original on 6 March 2007. Retrieved 7 March 2007.
  15. "Albert Einstein (1879 - 1955)". mathshistory.st-andrews.ac.uk. Retrieved 2020-04-20.
  16. Times, Special to The New York (1955-04-19). "Dr. Albert Einstein Dies in Sleep at 76; World Mourns Loss of Great Scientist; DR. EIN TEIN DIES IN HIS SLEEP AT 76". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2020-04-20.

వెలుపలి లంకెలు

[మార్చు]