సాధారణ సాపేక్షత
సాధారణ సాపేక్షత (General Relativity) లేదా సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1915లో ప్రతిపాదించిన జ్యామితీయ గురుత్వాకర్షణ సిద్ధాంతం. ఆధునిక భౌతిక శాస్త్రంలో గురుత్వాకర్షణను గురించి వివరించడానికి ప్రస్తుతం ఈ సిద్ధాంతాన్నే వాడుతున్నారు. సాధారణ సాపేక్ష సిద్ధాంతం, ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని మరింత విస్తృతం చేసి న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని మరింత మెరుగు పరుస్తుంది. ఇది గురుత్వాకర్షణను చతుర్మితీయ స్థలకాలాల జ్యామితీయ ధర్మంగా వివరిస్తుంది.
ఐన్‌స్టీన్ సిద్ధాంతం ఖగోళ భౌతిక శాస్త్రపు అంతర్భావాలను సూచిస్తుంది. వీటిలో కృష్ణ బిలాలు ఏర్పడటం గురించి ఉంటుంది. కృష్ణ బిలాలు అంటే అతి పెద్ద నక్షత్రాల అంతిమ రూపాలు. వీటిలో స్థల కాలాలు ఏమీ ఉండవు. కాంతి కూడా వీటి నుంచి తప్పించుకోలేదు.
సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఇప్పటికే ఉన్న అన్ని భౌతిక సిద్ధాంతాలలో చాలా అందమైనదిగా వర్ణించబడింది..[2][3][4]
చరిత్ర
[మార్చు]1905 లో హెన్రీ పాయిన్‌కేర్ ఎలక్ట్రాన్ గమనాన్ని అర్థం చేసుకోవడానికి సాపేక్షతను ప్రయోగించాడు. ఇదే భావనను గురుత్వాకర్షణతో సహా అన్ని బలాలకు కూడా అన్వయించాడు. ఇతని సిద్ధాంతంలో గురుత్వాకర్షణ తరంగాలు కాంతి వేగంతో ప్రసరిస్తాయని నిరూపించాడు.[5] దీని తర్వాత ఐన్‌స్టీన్ కూడా తన సాపేక్ష సిద్ధాంతంలోకి గురుత్వాకర్షణ బలాన్ని ఎలా తీసుకురావాలో ఆలోచించాడు. 1907 లో ఒక థాట్ ఎక్స్‌పెరిమెంట్ గా ప్రారంభమైన ఆయన పరిశోధన సుమారు ఎనిమిదేళ్ళు పరిశోధన సాగించి 1915 నవంబరు నెలలో తన పరిశోధనను ప్రష్యన్ అకాడెమీ ఆఫ్ సైన్స్ ముందు పెట్టాడు. అదే ప్రస్తుతం ఐన్‌స్టీన్ ఫీల్డ్ ఈక్వేషన్స్. సాధారణ సాపేక్ష వాదానికి ఇవి మూలస్తంభాల్లాంటివి.[6]
మూలాలు
[మార్చు]- ↑ "GW150914: LIGO Detects Gravitational Waves". Black-holes.org. Retrieved 18 April 2016.
- ↑ Landau & Lifshitz 1975, p. 228 "...the general theory of relativity...was established by Einstein, and represents probably the most beautiful of all existing physical theories."
- ↑ Wald 1984, p. 3
- ↑ Rovelli 2015, pp. 1–6 "General relativity is not just an extraordinarily beautiful physical theory providing the best description of the gravitational interaction we have so far. It is more."
- ↑ Poincaré 1905
- ↑ O'Connor, J.J.; Robertson, E.F. (May 1996). "General relativity]". History Topics: Mathematical Physics Index, Scotland: School of Mathematics and Statistics, University of St. Andrews, archived from the original on 4 February 2015, retrieved 4 February 2015