క్రమరహిత చలనం
స్వరూపం
(బ్రౌనియన్ మోషన్ నుండి దారిమార్పు చెందింది)
క్రమరహిత చలనం (Random motion) లేదా బ్రౌనియన్ చలనం (Brownian motion) అంటే ఏదైనా ఒక మాధ్యమంలో (వాయువు లేదా ద్రవం) తేలియాడే కణాలు తమ ఇష్టారీతిలో జరిపే కదలికలు.[1]
ఈ కదలికకు రాబర్ట్ బ్రౌన్ అనే వృక్ష శాస్త్రజ్ఞుడి పేరు మీదుగా బ్రౌనియన్ చలనం అని వ్యవహరిస్తారు. ఈయన 1827 లో నీళ్ళలో ముంచిన ఒక మొక్క పుప్పొడిని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలిస్తుండగా ఈ కదలికను గమనించాడు. దాదాపు 85 ఏళ్ల తర్వాత 1905 లో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈ పుప్పొడి రేణువుల కదలికలు నీటి అణువుల కదలికలకు అనుగుణంగా జరుగుతున్నట్లుగా నమూనా తయారు చేశాడు. ఇది ఆయన వైజ్ఞానిక ప్రపంచానికి అందించిన మొట్టమొదటి పరిశోధనల్లో ఒకటి.[2]
మూలాలు
[మార్చు]- ↑ Feynman, R. (1964). "The Brownian Movement". The Feynman Lectures of Physics, Volume I. pp. 41మూస:Hyphen1.
- ↑ Einstein, Albert (1905). "Über die von der molekularkinetischen Theorie der Wärme geforderte Bewegung von in ruhenden Flüssigkeiten suspendierten Teilchen" [On the Movement of Small Particles Suspended in Stationary Liquids Required by the Molecular-Kinetic Theory of Heat] (PDF). Annalen der Physik (in జర్మన్). 322 (8): 549–560. Bibcode:1905AnP...322..549E. doi:10.1002/andp.19053220806.