క్రమరహిత చలనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రమరహిత చలనం చేస్తున్న అణువులు

క్రమరహిత చలనం (Random motion) లేదా బ్రౌనియన్ చలనం (Brownian motion) అంటే ఏదైనా ఒక మాధ్యమంలో (వాయువు లేదా ద్రవం) తేలియాడే కణాలు తమ ఇష్టారీతిలో జరిపే కదలికలు.[1]

ఈ కదలికకు రాబర్ట్ బ్రౌన్ అనే వృక్ష శాస్త్రజ్ఞుడి పేరు మీదుగా బ్రౌనియన్ చలనం అని వ్యవహరిస్తారు. ఈయన 1827 లో నీళ్ళలో ముంచిన ఒక మొక్క పుప్పొడిని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలిస్తుండగా ఈ కదలికను గమనించాడు. దాదాపు 85 ఏళ్ల తర్వాత 1905 లో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈ పుప్పొడి రేణువుల కదలికలు నీటి అణువుల కదలికలకు అనుగుణంగా జరుగుతున్నట్లుగా నమూనా తయారు చేశాడు. ఇది ఆయన వైజ్ఞానిక ప్రపంచానికి అందించిన మొట్టమొదటి పరిశోధనల్లో ఒకటి.[2]

మూలాలు[మార్చు]

  1. Feynman, R. (1964). "The Brownian Movement". The Feynman Lectures of Physics, Volume I. pp. 41మూస:Hyphen1.
  2. Einstein, Albert (1905). "Über die von der molekularkinetischen Theorie der Wärme geforderte Bewegung von in ruhenden Flüssigkeiten suspendierten Teilchen" [On the Movement of Small Particles Suspended in Stationary Liquids Required by the Molecular-Kinetic Theory of Heat] (PDF). Annalen der Physik (in జర్మన్). 322 (8): 549–560. Bibcode:1905AnP...322..549E. doi:10.1002/andp.19053220806.