శాస్త్రము

వికీపీడియా నుండి
(శాస్త్రం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఇంగ్లీషులో ఉన్న రకరకాల మాటలకి సమానార్ధకంగా మనం తెలుగులో శాస్త్రం అన్న ఒక్క మాట వాడతాము. ఉదాహరణకి mathematics కి బదులు గణితం, గణిత శాస్త్రం అన్న మాటలు వాడుకలో ఉన్నాయి. Physics అన్న మాటని భౌతికం అని అనం; భౌతిక శాస్త్రం అంటాం. అలాగే chemistry ని రసాయనం అనేసి ఊరుకోకుండా రసాయన శాస్త్రం అంటాం. పొతే, biology, zoology, .. వంటి మాటలలోని -logy ని కూడా మనం శాస్త్రం అనే అనువదిస్తాం. logos అన్న ధాతువు అర్థం భాష. ఇక genetics, statistics, economics అని -ics తో అంతం అయేవి ఉన్నాయి. వీటినీ మనం శాస్త్రం అనే అంటాం. Astronomy, economy మొదలైన మాటలలోని -nomy అంటే లెక్క పెట్టుకోవడం కనుక, astronomy అంటే నక్షత్రాలని లెక్క పెట్టడం, economy అంటే డబ్బుని లెక్క పెట్టడం వగైరా అర్ధాలు వస్తాయి. వీటినీ మనం ఖగోళశాస్త్రం, ఆర్థిక శాస్త్రం అనే అనువదిస్తాము.

Geography అనే మాట ఉంది. ఇక్కడ geo అంటే భూమికి సంబంధించిన అనీ graphy అంటే గియ్యటం, రాయటం అనీ అనుకుంటే geography కి భూమిని గురించి బొమ్మలు గియ్యడం అనే అర్థం స్పురిస్తుంది. దీన్ని కూడా మనం భూగోళశాస్త్రం అనే తెలిగిస్తున్నాం.

శాస్త్రము అనగా సైన్సు అని ఒక అర్దము, రాయబడినది అని మరొక అర్దము కూడా చెప్పుకొనవచ్చు. ఉదాహరణకు మనము శాస్త్ర బద్దముగా అను పదానికి according to science అని అర్దము చెప్పుకొనడము చూడవచ్చు. అలాగే పురాణాలు, వేదాలు మొదలైన వాటిని అన్నింటినీ శాస్త్రాలు అని అంటారు.

పై ఉదాహరణలని బట్టి "శాస్త్రము" అన్న మాటకి బిగువైన నిర్వచనం లేదని తెలుస్తోంది కదా. ఒకానొకప్పుడు ఉండేది. ఈ మధ్య పోయింది. ఈ పరిస్థితి తెలుగులోనే కాదు, ఇంగ్లీషులో కూడా ఉంది. పొలిటికల్‌ సైన్సు, సోషల్‌ సైన్సు మొదలైన మాటలు ఈ పరిస్థితికి ఉదాహరణలు. ఈ వ్యత్యాసాలని గుర్తిస్తూ, ప్రస్తుతం పబ్బం గడవాలి కనుక, ఈ శీర్షిక కింద వచ్చే "సైన్సు" అన్న మాట యొక్క అర్థం గణిత, భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాలు, వాటిమీద ఆధారపడ్డ అనువర్తిత (applied) శాస్త్రాలకి పరిమితం చేసి, మిగిలిన వాటిని వీటితో కలబెట్టకుండా ఉంటే సందిగ్ధతకి తావు ఉండదు.