సర్ హంప్రీ డేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్ హంప్రీ డేవి
Portrait by Thomas Phillips
జననం(1778-12-17)1778 డిసెంబరు 17
పెన్ జాన్స్, కార్న్ వాల్, ఇంగ్లాండ్
మరణం1829 మే 29
జెనీవా, స్విడ్జర్లాం
జాతీయతబ్రిటిష్
రంగములురసాయన శాస్త్రము
వృత్తిసంస్థలురాయల్ సొసైటీ,
ప్రసిద్ధివిద్యుత్ విశ్లేషణ, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, బేరియం, బోరాన్, డేవీ దీపం
ప్రభావితులుమైఖేల్ ఫారడే, విల్లియం థామ్సన్

సా.శ. 19 వ శతాబ్దం తొలిరోజుల్లో గనులలో ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తూ ఉండేవి. గనులలోని పెద్ద నిల్వలలో మీథేన్ వాయువు ఉండేందుకు అవకాశం ఉంది. ఈ వాయువు ఏ కొద్ది ఉష్ణోగ్రతకైనా మండే స్వభావం కలిగి ఉంటుంది. గనులలో వెలుతురు కోస్ం దీపాలను తీసుకు వెళ్ళే టప్పుడు ఈ వాయువు తేలికగా మండుకొని భారీ ఎత్తున అగ్నిప్రమాదం జరిగేది. 1815 లో సర్ హంప్రీ డేవి సేఫ్టీ దీపాన్ని కనుక్కునే వరకు ఈ గనుల ప్రమాదాలకు అడ్డూ అదుపూ ఉండేవి కాదు.

డేవీ దీపం[మార్చు]

బ్రిటన్ కు చెందిన డేవీ గనుల కార్మికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని సేఫ్టీ దీపాన్ని గురించి ఆలోచించేవాడు. ఆక్సిజన్ తో వెలిగే దీపంవల్ల కొద్దిగనో, ఎక్కువగానో ఉష్ణం వెలువడే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాలకు తావు ఇవ్వకుండ సరికొత్త నమూనాలో సేఫ్టీ దీపాన్ని తయారు చేయవలసిన అవసరాన్ని డేవీ గుర్తించాడు. ఇందుకోసం యీయన నూనె దీపం చుట్టూ వైర్ గేజ్ గోడను అమర్చాడు. ఆ విధంగా ఆక్సిజన్ దీపానికి అందుతుంది. ఏ కొంచెం కూడా అంతరాయం ఉండదు. పోతే దీపం వెలగటం వల్ల వెలువడే ఉష్ణం దాని చుట్టూ ఉన్న వైర్ గేజ్ గోడను చేరి వేడి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ కారణంగా మీథెన్ వంటి వాయువులు మందుకోవడం వల్ల కలిగే ప్రమాదాలు నివారించబడతాయి. కాకపోతె వైర్ గేజ్ వల్ల దీపపు కాంతి కొంచెం తగ్గవచ్చు. అయితే గనిలోపల భాగంలో తిరుగడానికి ఈ కాంతి చాలు. డేవీ రూపొంచించిన సేఫ్టీ దీపాలు ఈనాటికి ఉన్నాయి. ఈ దీపం వెలుగులో కలిగే మార్పు లను బట్టి వెంటనే మీథెన్ వంటి అపాయకరమైన వాయువులు ఉన్నవీ లేనివీ తెలుసుకోవచ్చు.

లాఫింగ్ గ్యాస్[మార్చు]

సర్ హంఫ్రీ డెవీ సేఫ్టీ దీపాన్ని కనుగోవటానికే పరిమితం కాలేదు. 1797 నుంచి ప్రారంభమైన ఈయన పరిశోధనా జీవితం ఆ తరువాత బతికి ఉన్నంత కాలం కొనసాగింది. నైట్రస్ ఆక్సైడ్ లేదా లాఫింగ్ గ్యాస్ (నవ్వించె వాయువు) ప్రభావాన్ని గురించి - ఈయన ఎన్నో రకాల పరిశీలనలు చేపట్టాడు. ఈయన ఈ వాయువును తయారుచేసి అరనిముషంపాటు పీల్చేవాడు. ఈయన మత్తులో పడిపోయేవాడు. కాస్సేపయ్యాక నవ్వు వస్తున్నట్లుగా గుర్తించేవాడు. ఈ అనుభవం ఆయనకు చిత్రంగా ఉండేది. నైట్రస్ ఆక్సైడ్ కు లాఫింగ్ గ్యాస్ అని పేరు పెట్టింది కూడా యీయనే.

ఈ లాఫింగ్ గ్యాస్ గురించి సర్ హండ్రీ డేవీ ప్రకటీంచడంతో ఎంతో మంది యీ వార్త పట్ల ఆసక్తినికనబరిచారు. ఒక స్త్రీ యీ గ్యాస్ ను పీచ్లి పిచ్చిగా పరిగెత్తి వీధుల వెంట పడిపోయిందట. యీ లాఫింగ్ గ్యాస్ వార్త లండన్ కు కూడా చేరుకుంది. ఫలితంగా 1800 లో రాయల్ ఇన్ స్టిట్యూషన్ లో డేవీ లెక్చరర్ కాగలిగాడు. యీ లాఫింగ్ గ్యాస్ ధర్మాల గురించి యీయన క్షుణ్ణంగా అధ్యయనం చేయటం మొదలు పెట్టాడు.

లాఫింగ్ గ్యాస్ ఉపయోగాలు[మార్చు]

ఎన్నో సంవత్సరాలు పాటు యీ లాఫింగ్ గ్యాస్ ను వినోదం కోసం సరదాగా పీల్చడం కొంతమంది అలవాటు చేసుకున్నారు.గాయ్యాళి భార్యలను అదుపులో పెట్టడానికి కూడా యీ వాయువును ఉపయోగించేవారట. యీ గ్యాస్ పీల్చి నవ్వుకుంటూ-బెంచీలను, గోడలను ఢీ కొట్టినప్పటికీ కొందరికి ఏ మాత్రం నొప్పి వేసేది కాదు. దీన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది వైద్యులు యీ గ్యాస్ ను ఉపయోగించి నొప్పి లేకుండా నోటి పండ్లను పీకేవారు. ఇలాగే శస్త్ర చికిత్స ల్లో కూడా ఈ గ్యాస్ ను వాడటం ప్రారంభించేవారు. మత్తు మందుగా యీ గ్యాస్ ను ఈనాటికీ ఎంతోమంది సర్జనులు వాడుతూ ఉన్నారు.

యితర పరిశోధనలు[మార్చు]

డేవీ విద్యుద్విశ్లేషన ద్వారా సోడియం, పొటాషియం, లను 1807 లో వేరు చేయగలిగాడు. 1809 లో ఇలాగే క్షార భూలోహాలను కూడా వేరు చేశాడు. బోరాక్స్ ను పొటాషియంలో కలిపి వేడి చేయటం ద్వారా బోరాన్ ను ఉత్పత్తి చేశాడు. క్లోరిన్ వాయువుకు బ్లీచింగ్ లక్షనాలు ఉన్నాయని తెలియజేసి అది ఒక మూలకమని ధ్రువపరిచాడు. యీ సమయం లోనే సుమారుగా 1813 లో మైఖేల్ ఫారడే, డేవీకి అసిస్టెంత్ గా వచ్చాడు. ఇద్దరూ కలిసి అయోడిన్ గురించి తెలిపారు. వజ్రం కూడా ఒక రకంగా బొగ్గేనని స్పష్టం చేశారు. ఉప్పు నీటిలో రాగి లోహం దెబ్బ తింటుందని వెల్లడించారు. వీరిద్దరూ కలిసి ప్రచురించిన "ఎలిమెంట్స్ ఆఫ్ కెమికల్ ఫిలాసఫీ" శాస్త్ర లోకంలో నివాళులను అందుకుంది.

పురస్కారాలు[మార్చు]

డేవీ జీవిత కాలంలో లెక్కలేనన్ని పురస్కారాలు అందుకోగలిగాడు. 1812 లో నైట్ అయ్యాడు. ఆ తరువాత బారోనెట్ అయ్యాడు. 1820 లో రాయల్ సొసైటీకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇది అరుదైన గౌరవం. ఏ కొద్దిమందికో కలిగే భాగ్యం. జీవిత పర్యంతం పరిశోధస్నలలోనే గడిపినా డేవీ 1829 లో జెనీవాలో యీ లోకంతో భౌతికంగా సంబంధాలు వదులుకొని శాస్త్ర లోకంలో శాశ్వతంగా నిలిచిపోయారు.