అన్నా వెంకట రాంబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నా వెంకటరాంబాబు
అన్నా వెంకట రాంబాబు


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 01 ఆగష్టు 1964
సైదాపురం, కంభం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సుబ్బరంగయ్య, ధనలక్ష్మమ్మ
జీవిత భాగస్వామి దుర్గా కుమారి
సంతానం కృష్ణచైతన్య, ఒక కుమార్తె
నివాసం కైకలూరు

అన్నా వెంకట రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అన్నా వెంకటరాంబాబు 01 ఆగష్టు 1964లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, కంభం మండలం, సైదాపురం గ్రామంలో సుబ్బరంగయ్య, ధనలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1985లో ఆగ్రా యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేసి కాంట్రాక్టరుగా, కృష్ణ చైతన్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాలేజీ ఛైర్మన్‌గా స్థిరపడ్డాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

అన్నా వెంకటరాంబాబు తన తల్లితండ్రుల పేరిట 2004లో అన్నా సుబ్బరంగయ్య, ధనలక్ష్మమ్మ చారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటును చేసి దాని ద్వారా సామజిక కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున గిద్దలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అన్నా వెంకటరాంబాబు రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరి 2014లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

అన్నా వెంకటరాంబాబు 4 ఆగష్టు 2017లో టీడీపీ పార్టీకి రాజీనామా చేసి,[3] 22 డిసెంబర్ 2018న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ముత్తముల అకోశ్‌ రెడ్డిపై 78478 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలు". Archived from the original on 16 September 2021. Retrieved 17 September 2021.
  3. Sakshi (5 August 2017). "టీడీపీకి రాజీనామా చేస్తున్నా". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  4. Sakshi (23 June 2018). "వైఎస్సార్‌ సీపీలోకి రాంబాబు". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  5. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  6. Sakshi (2021). "Giddalur Constitueancy Winner List in AP Elections 2019 | Giddalur Constituency Election Results 2019". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.