సత్తి సూర్యనారాయణ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్తి సూర్యనారాయణ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019 - ప్రస్తుతం
నియోజకవర్గం అనపర్తి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 31 అక్టోబర్ 1961
అనపర్తి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు గంగిరెడ్డి, సీతయ్యమ్మ
జీవిత భాగస్వామి సత్తి ఆదిలక్ష్మి
బంధువులు తేతలి రామారెడ్డి (మేనమామ)
సంతానం డా. సత్తి గౌతమ్‌ రెడ్డి

సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

సూర్యనారాయణ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, అనపర్తి గ్రామంలో గంగిరెడ్డి, సీతయ్యమ్మ దంపతులకు 31 అక్టోబర్ 1961లో జన్మించాడు. ఆయన ఎంబీబీఎస్, ఎంఎస్‌ (జనరల్‌ సర్జన్‌) పూర్తి చేసి 15 నవంబర్ 1991న అనపర్తిలో తన తండ్రి పేరిట గంగిరెడ్డి నర్సింగ్‌ హోమ్‌ ప్రారంభించాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

సూర్యనారాయణ రెడ్డి వైద్య వృత్తిలోలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో పరోక్షంగా ఉంటూ తన మేనమామ తేతలి రామారెడ్డిల తరఫున ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావంతో వైసీపీలో చేరి 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి 1,373 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాయడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పై 55207 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 9 December 2021. Retrieved 9 December 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 8 డిసెంబరు 2021 suggested (help)