కర్నూలు మండలం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. (జనవరి 2026) |
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 15°50′N 78°03′E / 15.83°N 78.05°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | కర్నూలు జిల్లా |
| మండల కేంద్రం | Kurnool |
| విస్తీర్ణం | |
• మొత్తం | 356 కి.మీ2 (137 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 4,06,797 |
| • సాంద్రత | 1,100/కి.మీ2 (3,000/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 1002 |
కర్నూలు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అదే పేరుగల కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలం. జిల్లాలో ఉన్న 26 మండలాల్లో ఇది ఒకటి. దీని ప్రధాన కార్యాలయం కర్నూలు పట్టణంలో ఉంది.[3] ఈ మండలం కృష్ణా నది ఒడ్డున ఉంది. అలాగే, సి.బెళగల్, గూడూర్, కల్లూర్, ఒర్వకల్, మిడుతూరు, నందికోట్కూర్ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.[4] 2011 జనాభా లెక్కల ప్రకారం, ఇక్కడ 4,06,797 మంది నివసిస్తున్నారు.
కర్నూలు నగరం ప్రత్యేకత
[మార్చు]తొలి ఆంధ్రరాష్ట్రానికి జిల్లా లోని కర్నూలు ముఖ్యపట్టణం. 1953 అక్టోబరు 1 నుండి 1956 అక్టోబరు 31 వరకు కర్నూలు ఆంధ్రరాష్ట్ర రాజధానిగా కొనసాగింది. రాయలసీమకు కర్నూలు ముఖద్వారం అంటారు. ఉమ్మడి జిల్లాలో పర్యాటక ఆకర్షణలు చాలావరకు నంద్యాల జిల్లాలో భాగమైనవి. కర్నూలు రాష్ట్రానికి చెందిన 2వ పెద్ద నగరం.[మూలం అవసరం] అలాగే, రాష్ట్రంలో అత్యధిక జనాభా గల నగరాలలో కర్నూలు 5వ స్థానంలో ఉంది.
మండలం లోని పట్టణాలు
[మార్చు]- కర్నూలు (నగరపాలక సంస్థ)
- మామిడాలపాడు (జనగణ పట్టణం)
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- బసవాపురం
- దేవమడ
- దిగువపాడు
- ఈ.తాండ్రపాడు
- ఎదురూరు
- గార్గేయపురం
- గొందిపర్ల
- మునగలపాడు
- నూతనపల్లె
- పంచలింగాల
- పూడూరు
- ఆర్.కొంతలపాడు
- రేమట
- రుద్రవరం
- సుంకేశుల
- ఉల్చాల
- నిడుజూరు
- జీ.సింగవరం
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]
కర్నూలు మండల కేంద్రంలోని పలు ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు:
- కొండారెడ్డి బురుజు [5]
- జగన్నాథ గుట్ట ఆలయం
- అయ్యప్ప స్వామి ఆలయం
- రేవనూరు హుస్సేన్ స్వామి దర్గ
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "District Census Handbook - Kurnool" (PDF). Census of India. p. 12,198. Retrieved 18 January 2015.
- ↑ "Mandals in Prakasam district". aponline.gov.in. Archived from the original on 28 July 2015. Retrieved 10 September 2014.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-09-23. Retrieved 2007-07-26.
