గంటా శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంటా శ్రీనివాసరావు

గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. కాపు సామాజికవర్గంపై ఇతడికి మంచి పట్టు ఉన్నది[1]. ఇతను ఇప్పటివరకు మూడు పార్టీలు మారాడు. ఏ పార్టీలో ఉన్నా ఉన్నత పదవులు వరించడం ఇతడికి ప్రత్యేకము.

రాజకీయాలు[మార్చు]

2014 సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఇతను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకున్నాడు. 1999లో రాజకీయాల్లో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందాడు. 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మానవ వనరుల అభివృద్ధి, ప్రైమరీ ఎడ్యుకేషన్‌, సెకండరీ ఎడ్యుకేషన్‌, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల మంత్రిగా పని చేశాడు. [2]

విద్యాభ్యాసం[మార్చు]

ఇతను బి.కాం. బి.ఎల్ చదివాడు

మూలాలు[మార్చు]

  1. "War of Kapus to spice up contest!'". ది టైమ్స్ ఆఫ్ ఇండియా. 2014-04-17. Retrieved 2015-10-31.
  2. Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.

బయటి లంకెలు[మార్చు]