బలిరెడ్డి సత్యారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలిరెడ్డి సత్యారావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 1994
1999 - 2004
ముందు గంటా శ్రీనివాసరావు
తరువాత కరణం ధర్మశ్రీ
నియోజకవర్గం చోడవరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1936
పీఎస్‌పేట, చోడవరం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 27 సెప్టెంబర్ 2019
విశాఖపట్నం జిల్లా
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
నివాసం విశాఖపట్నం జిల్లా

బలిరెడ్డి సత్యారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చోడవరం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

  1. 1962లో చోడవరం పంచాయతీ వార్డు మెంబరుగా ఎన్నికయ్యాడు.
  2. 1981–86 వరకు రావికమతం సమితి అధ్యక్షుడిగా పని చేశాడు.
  3. 1986–89వరకు విశాఖ జిల్లా డీసీసీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు.
  4. 1989లో చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మధ్యతరహా నీటిపారుదల శాఖామంత్రిగా పని చేశాడు.
  5. 1999లో ఎమ్మెల్యేగా రెండోసారి గెలవడంతోపాటు విశాఖ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.
  6. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చెందగా, డీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ జిల్లాలో కాంగ్రెస్‌ నుంచి 8 మంది ఎమ్మెల్యేల విజయానికి కృషి చేశాడు.
  7. 2005లో జిల్లాకేంద్రసహకార బ్యాంక్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు.
  8. 2007– రెండోసారి డీసీసీఅధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.
  9. 2011లో విశిష్ట సహకార వేత్త పురష్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకున్నాడు.
  10. 2012 నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరాడు.

మరణం[మార్చు]

బలిరెడ్డి సత్యారావు 27 సెప్టెంబర్ 2019న విశాఖ ఆర్కే బీచ్‌రోడ్డులో వాకింగ్‌ చేస్తుండగా ఆయనను ఓ వ్యక్తి బైక్‌తో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (27 September 2019). "రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి మృతి" (in ఇంగ్లీష్). Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (28 September 2019). "దివికేగిన దిగ్గజం.. రాజకీయ ప్రస్థానం". Archived from the original on 31 October 2020. Retrieved 25 January 2022.