కరణం ధర్మశ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరణం ధర్మశ్రీ

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం చోడవరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1974
విశాఖపట్నం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు విశ్వనాధం
జీవిత భాగస్వామి వెంకట విజయలక్ష్మి
సంతానం సాయికార్తీక్, నాగసౌమ్య
నివాసం గాజువాక
మతం హిందూ మతము

కరణం ధర్మశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కరణం ధర్మశ్రీ 1974లో ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నం జిల్లా లో జన్మించాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి 1989లో బీఏ, 1992లో బీఎల్‌, 1993లో బీఎడ్ పూర్తిచేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు.[2] కరణం ధర్మశ్రీ 1998లో డీఎస్సీ పరీక్ష రాయగా న్యాయస్థానంలో కేసుల అనంతరం 23 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

కరణం ధర్మశ్రీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి రెడ్డి సత్యనారాయణ పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు చేతిలో ఓడిపోయాడు.

కరణం ధర్మశ్రీ 2014 ఎన్నికలకు ముందు 12 మార్చి 2014న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి[4], 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు పై 27637 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
  3. A. B. P. Desam (21 June 2022). "టీచర్ జాబ్ సాధించిన వైసీపీ ఎమ్మెల్యే, 23 ఏళ్ల తర్వాత ఉద్యోగం!". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
  4. Sakshi (12 March 2014). "వైఎస్సార్ సీపీలో చేరిన మళ్ల, ధర్మశ్రీ". Archived from the original on 16 December 2021. Retrieved 16 December 2021.
  5. Andhrajyothy (24 May 2019). "కరణం ధర్మశ్రీ కల నెరవేరింది..." Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
  6. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.