కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు
కే.ఎస్.ఎన్. రాజు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 - 2019 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | గంట శ్రీనివాస రావు | ||
---|---|---|---|
తరువాత | కరణం ధర్మశ్రీ | ||
నియోజకవర్గం | చోడవరం నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1970 చోడవరం, విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | సూర్యనారాయణ రాజు | ||
జీవిత భాగస్వామి | సావిత్రమ్మ |
కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు (కేఎస్ఎన్ఎస్ రాజు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చోడవరం నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]కే.ఎస్.ఎన్. రాజు 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, చోడవరంలో జన్మించాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి బి.కామ్, బి.ఎల్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కే.ఎస్.ఎన్. రాజు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995 నుంచి 2001 వరకు గ్రామ సర్పంచ్‌గా పని చేసి, 2009లో చోడవరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ పై 1385 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో చోడవరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ పై 909 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]కే.ఎస్.ఎన్. రాజు 2019లో చోడవరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ చేతిలో 27637 ఓట్లతో ఓడిపోయాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ The Hans India (19 March 2019). "TDP Releases Third List of MPs and MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 25 జనవరి 2022. Retrieved 25 January 2022.
- ↑ Andhrajyothy (8 February 2021). "నలుగురు ఎమ్మెల్యేలను అందించిన చోడవరం". Archived from the original on 25 జనవరి 2022. Retrieved 25 January 2022.