ఆదిమూలపు సురేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదిమూలపు సురేష్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
నియోజకవర్గము ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలము
2014 – 2019
ముందు బి.యెన్. విజయ్ కుమార్
తరువాత సుధాకరబాబు
నియోజకవర్గం సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలము
2009 – 2014
నియోజకవర్గం ఎర్రగొండపాలెం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి టి.హెచ్. విజయ లక్ష్మి
వృత్తి రాజకీయం

ఆదిమూలపు సురేష్ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు. పూర్వం దక్షిణ మధ్య రైల్వే నందు ఐ.ఆర్.ఏ.ఎస్ అధికారిగా భాద్యతలు నిర్వహించాడు.

కుటుంబం[మార్చు]

వీరు ప్రకాశం జిల్లా లోని మార్కాపురం అనే పట్టణం నందు జన్మించాడు. వీరి తండ్రి ఆదిమూలపు శామ్యూల్ జార్జ్, తల్లి ఆదిమూలపు తేరిసమ్మ. వీరు ప్రస్తుతం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

వీరు మొట్టమొదటి సారిగా 2009 వ సంవత్సరం ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నిక అయినారు. అప్పుడు వీరు భారత జాతీయ కాంగ్రెస్ నుండి గెలుపొందాడు. వై.యస్. రాజశేఖరరెడ్డి గారి మరణాంతరం, 2014 వ సంవత్సరం గాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరుపున సంతనూతలపాడు నియోజకవర్గం నుండి, 2019 లో ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడు గా ఎన్నిక అయ్యాడు.

మూలాలు[మార్చు]