టీజేఆర్ సుధాకర్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తలతోటి జయరత్న సుధాకర్‌బాబు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019 - ప్రస్తుతం
నియోజకవర్గం సంతనూతలపాడు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 23 అక్టోబర్ 1973
తూబాడు గ్రామం, నాదెండ్ల మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ Indian Election Symbol Ceiling Fan.svg వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఛార్లెస్‌,అన్నమ్మ
జీవిత భాగస్వామి వనజ
సంతానం ఛార్లెస్, సోనియా ఛార్లెస్‌

తలతోటి జయరత్న సుధాకర్‌బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

సుధాకర్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, నాదెండ్ల మండలం, తూబాడు గ్రామంలో ఛార్లెస్‌,అన్నమ్మ దంపతులకు 23 అక్టోబర్ 1973లో జన్మించాడు. ఆయన నాగార్జున యూనివర్శిటీ నుండి ఎంబీఏ (ఎల్‌ఎల్‌బీ), పీజీ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

సుధాకర్ బాబు 1991లో రాజకీయాల్లోకి వచ్చి ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు, 1997లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా, 2001లో స్టేట్‌ ప్రచార కార్యదర్శిగా, 2004లో స్టేట్‌ యూత్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా, 2007లో కాంగ్రెస్‌ యూత్‌ రాష్ట్ర అధ్యక్షులు, 2012లో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2012లో కర్నాటక, తమిళనాడు రాష్ట్ర పరిశీలకుడిగా వివిధ హోదాల్లో పని చేసి 2012లో ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం కి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఒడి పోయాడు.

సుధాకర్ బాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2018లో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధిగా, 2018 నుంచి సంతనూతలపాడు నియోజకవర్గం వెఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా పని చేసిన ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పై 8,992 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలు". Archived from the original on 9 December 2021. Retrieved 9 December 2021.
  3. Sakshi (2019). "Santhanuthalapadu Constituency Winner List in AP Elections 2019 | Santhanuthalapadu Constituency Election Results 2019". Archived from the original on 9 December 2021. Retrieved 9 December 2021.
  4. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.