కోన రఘుపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోన రఘుపతి
కోన రఘుపతి


డిప్యూటీ స్పీకర్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
18 జూన్ 2019 - 19 సెప్టెంబర్ 2022

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - ప్రస్తుతం
ముందు గాదె వెంకటరెడ్డి
నియోజకవర్గం బాపట్ల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1959
బాపట్ల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ Indian Election Symbol Ceiling Fan.svg వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కోన ప్రభాకరరావు, పద్మావతి
జీవిత భాగస్వామి రమాదేవి
సంతానం నిఖిల్‌, కోన నీరజ
మతం హిందూ

కోన రఘుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కోన రఘుపతి ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, బాపట్ల లో 1959లో కోన ప్రభాకరరావు, పద్మావతి దంపతులకు జన్మించాడు. ఆయన బి.కామ్‌ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కోన రఘుపతి తన తండ్రి కోన ప్రభాకరరావు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చాడు.[2] ఆయన తండ్రి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పాండిచ్చేరి ,సిక్కిం, మహారాష్ట్ర రాష్ట్రాల గవర్నరుగా పని చేశాడు. రఘుపతి 2009 ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు.

కోన రఘుపతి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో 15,199 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[4] కోన రఘుపతి 18 జూన్ 2019న ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు[మార్చు]

  1. Sakshi (19 March 2019). "గుంటూరు జిల్లా.. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా." Archived from the original on 2 December 2021. Retrieved 2 December 2021.
  2. Sakshi (31 May 2019). "వారసులొచ్చారు." Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  3. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  4. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  5. TV9 Telugu (18 June 2019). "డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవం". Archived from the original on 2 December 2021. Retrieved 2 December 2021.