ఆనం రామనారాయణరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనం రామనారాయణరెడ్డి

ఆర్థిక మంత్రి (ఆంధ్ర ప్రదేశ్)
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2012

నియోజకవర్గం ఆత్మకూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1952-07-10) 1952 జూలై 10 (వయస్సు: 67  సంవత్సరాలు)
నెల్లూరు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసము హైదరాబాద్

ఆనం రామనారాయణరెడ్డి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఇతను 2012 నాటికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ లో ఆర్థికశాఖమంత్రిగా ఉన్నారు. ఇతను భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ పార్టీ యొక్క సభ్యుడు.

ప్రారంభ జీవితం[మార్చు]

ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరుకు చెందిన ఆనం వెంకటరెడ్డి కుమారుడు. ఇతని సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కూడా రాజకీయ నాయకుడే. ఇతను సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.కాం మరియు బి.ఎల్ పట్టాలను పొందాడు.

కెరీర్[మార్చు]

రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ రెండు సందర్భాలలో ఇతను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. ఇతను ఎన్.టి. రామారావు యొక్క మంత్రివర్గంలో రహదారులు మరియు భవనాల శాఖమంత్రిగా పనిచేశారు. ఇతను 1991లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు మరియు అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన పర్యవసానంగా 2009 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి మారి అక్కడ నుంచి మళ్ళీ ఎన్నికయ్యారు. 2007 మరియు 2009 మధ్య రామనారాయణరెడ్డి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జూలై 2009 నాటికి ఇతను మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్ర మంత్రిగా నియమించబడ్డాడు. 2012 నాటికి ఇతను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఆర్థికశాఖమంత్రిగా నియమింపబడ్డాడు.