మానుగుంట మహీధర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానుగుంట మహీధర్ రెడ్డి
మానుగుంట మహీధర్ రెడ్డి


ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019 - ప్రస్తుతం
ముందు పోతుల రామారావు
నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 01 జూన్ 1957
మాచవరం గ్రామం, కందుకూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు దివంగత మానుగుంట ఆదినారాయణ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), లలితమ్మ
జీవిత భాగస్వామి జ్యోతి
సంతానం భవ్య, సత్య

మానుగుంట మహీధర్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

మానుగుంట మహీధర్ రెడ్డి 01 జూన్ 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, కందుకూరు మండలం, మాచవరం గ్రామంలో మానుగుంట ఆదినారాయణరెడ్డి, లలితమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన నెల్లూరులోని సర్వోదయ కాలేజీలో ఇంటర్మీడియట్, ఎస్వీ యూనివర్సిటీ నుండి డిగ్రీ, ఎల్‌ఎల్‌బి పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

మానుగుంట మహీధర్ రెడ్డి తన తండ్రి మానుగుంట ఆదినారాయణ రెడ్డి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1989లో జరిగిన అసెంబ్లీ కందుకూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్ధిగా, 1999లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయాడు. మహీధర్ రెడ్డి 2004, 2009 జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మున్సిఫల్‌ శాఖ మంత్రిగా పనిచేశాడు.

మహీధర్ రెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ కి దూరంగా ఉన్నాడు. ఆయన 2018లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గం ఇంచార్జిగా నియమితుడయ్యాడు.[3][4] ఆయన 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు.[5]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలు". Archived from the original on 16 September 2021. Retrieved 17 September 2021.
  3. Sakshi (11 July 2018). "వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి". Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 11 జూలై 2018 suggested (help)
  4. The Hindu (12 July 2018). "Mahidhar Reddy joins YSRCP" (in Indian English). Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
  5. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.