Jump to content

కందుకూరు మండలం

అక్షాంశ రేఖాంశాలు: 15°12′47″N 79°54′25″E / 15.213°N 79.907°E / 15.213; 79.907
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°12′47″N 79°54′25″E / 15.213°N 79.907°E / 15.213; 79.907
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండల కేంద్రంకందుకూరు
విస్తీర్ణం
 • మొత్తం231 కి.మీ2 (89 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం98,769
 • జనసాంద్రత430/కి.మీ2 (1,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి989


కందుకూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మండలం.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో ఒకటి నిర్జన గ్రామం. మండలం కోడ్:05148.[3]OSM గతిశీల పటముకందుకూరు మండలం నెల్లూరు లోక‌సభ నియోజకవర్గంలో ఒక భాగం. కందుకూరు శాసనసభ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. ఇది కందుకూరు రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.

గణాంకాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం కందుకూరు మండలం మొత్తం జనాభా 98,769. వీరిలో 49,661 మంది పురుషులు కాగా, 49,108 మంది మహిళలు ఉన్నారు.నివసిస్తున్న కుటుంబాలు 24,116. కందుకూరు మండలం సగటు సెక్స్ నిష్పత్తి 989.[4]

2011 జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభాలో 58% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 42% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత 74.8% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 56.7%.మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 9973, ఇది మొత్తం జనాభాలో 10%. 0 - 6 సంవత్సరాల మధ్య 5138 మంది మగ పిల్లలు, 4835 మంది ఆడ పిల్లలు ఉన్నారు.మండలం మొత్తం అక్షరాస్యత 67.2%. పురుషుల అక్షరాస్యత రేటు 67.24%, స్త్రీ అక్షరాస్యత రేటు 53.51%.[4]

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. జీ.మేకపాడు
  2. పందలపాడు
  3. జిళ్లెలమూడి
  4. విక్కిరాలపేట
  5. పలుకూరు
  6. కొండికందుకూరు
  7. కోవూరు
  8. అనంతసాగరం
  9. మహదేవపురం
  10. ఓగూరు
  11. కంచరగుంట
  12. కొండముడుసుపాలెం
  13. అనందపురం
  14. మోపాడు
  15. మాచవరం
  16. మదనగోపాలపురం
  17. పాలూరు
  18. దొండపాడు

గమనిక:సముదాయం నిర్ణయం మేరకు నిర్జన గ్రామాలు పరిగణించలేదు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. దూబగుంట
  2. వెంకటాద్రిపాలెం

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
  3. "Kandukur Mandal Villages, Prakasam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-09.
  4. 4.0 4.1 "Kandukur Mandal Population Prakasam, Andhra Pradesh, List of Villages & Towns in Kandukur Mandal". Censusindia2011.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-09.

వెలుపలి లంకెలు

[మార్చు]