కె.సి.అబ్రహాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొచ్చక్కన్ చాకో అబ్రహాం 1983 ఆగస్టు 15 నుండి 1983 ఆగస్టు 15 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉన్నాడు.[1][2] ఈయన భారత జాతీయ కాంగ్రేసుకు చెందిన రాజకీయనాయకుడు, గాంధేయవాది.

ప్రారంభ జీవితం[మార్చు]

అబ్రహాం 1899, జనవరి 20న కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్లో జన్మించాడు. ఈయన తండ్రి కొచ్చక్కన్ చాకో. పట్టభద్రుడైన తర్వాత 30 ఏళ్ళపాటు పాఠశాల అధ్యాపకుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు.

రాజకీయాల్లో[మార్చు]

అధ్యాపక వృత్తినుండి విరమణ పొందిన తర్వాత అబ్రహాం క్రియాశీలక రాజకీయల్లోకి అడుగుపెట్టాడు. అబ్రహాం 1954 నుండి 1956 వరకు ట్రావెంకూరు శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆ తరువాత కాంగ్రేసు పార్టీ తరఫున ఒకటవ, రెండవ కేరళ శాసనసభల్లో నరక్కల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు[3][4] 1964లో కేరళ ప్రదేశ్ కాంగ్రేసు అధ్యక్షుడుగా పనిచేశాడు. 1969లో జాతీయస్థాయిలో కాంగ్రేసు పార్టీ చీలినప్పుడు కాంగ్రేసు వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. 21 మంది కమిటీ సభ్యుల్లో, పది మంది సిండికేటుకు, పది మంది ఇందిరకు మద్దతుగా చీలినప్పుడు, కె.సి.అబ్రహాం సిండికేటు వైపు మొగ్గుచూపినా, ఈయన ఇరువర్గాలకు సయోధ్య కుదుర్చటానికి మధ్యవర్తిత్యం వహించాడు. చర్చలు విఫలమై చివరకు అబ్రహాం సిండికేటుకు మద్దతివ్వడంతో భారత జాతీయ కాంగ్రేసు నుండి ఇందిరా గాంధీ బహిష్కరణకు గురైంది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈయన భార్య ఎలిజబెత్.వీరి ఏకైక సంతానం, వీరి కుమారుడు కొచ్చిలో ప్రముఖ హృదయవైద్యుడు. అబ్రహాం 1986 మార్చి14న మరణించాడు

మూలాలు[మార్చు]