భీంసేన్ సచార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భీంసేన్ సచార్
భీంసేన్ సచార్


పదవీ కాలము
ఏప్రిల్, 1949 – అక్టోబరు, 1949
ముందు గోపీచంద్ భార్గవ
తరువాత గోపీచంద్ భార్గవ
పదవీ కాలము
ఏప్రిల్, 1952 – జనవరి, 1956
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత ప్రతాప్ సింగ్ ఖైరాన్

వ్యక్తిగత వివరాలు

జననం (1894-12-01) 1894 డిసెంబరు 1
పెషావర్, పంజాబ్, బ్రిటీషిండియా (ప్రస్తుతం ఖైబర్ ఫక్తూన్వా, పాకిస్తాన్) [1]
మరణం 1978 జనవరి 18 (1978-01-18)(వయసు 83)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేసు
వృత్తి రాజకీయనాయకుడు

భీంసేన్ సచార్ (1894 డిసెంబరు 1[2] – 1978 జనవరి 18[3]) భారతీయ రాజకీయనాయకుడు. ఈయన పంజాబ్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

జీవితం[మార్చు]

సచార్ 1894, డిసెంబరు 1 న జన్మించాడు. లాహోర్లో బి.ఏ, ఎల్.ఎల్.బి చదివి గుజ్రన్‌వాలాలో న్యాయవాద వృత్తి ప్రారంభించాడు.[4] ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. చిన్న వయసులోనే స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితుడై, భారత జాతీయ కాంగ్రేసు పార్టీలో చేరాడు. 1921లో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రేసు కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1947లో భారత స్వాతంత్ర్యం వచ్చేనాటికి, పార్టీలో ప్రముఖసభ్యుడిగా ఎదిగాడు.

1949 లో కాంగ్రేసు పార్టీ ఈయన్ను పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది. 1949 ఏప్రిల్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, ఆ పదవిలో 1949, అక్టోబరు 18 దాకా కొనసాగాడు. 1952లో స్వతంత్ర భారతంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగి, తొలిసారి పంజాబ్ శాసనసభ ఏర్పడింది. ప్రాంతీయ ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ విజయం సాధించింది. ఎన్నికల తర్వాత సచార్ తిరిగి ముఖమంత్రై 1952 ఏప్రిల్ 17 నుండి 1956, జనవరి 23 వరకు పదవిలో కొనసాగాడు.[5] పార్టీలో అంతర్గత రాజకీయాల వల్ల పదవి నుండి తొలగించబడిన తర్వాత, కేంద్రప్రభుత్వం సచార్ను ఒడిశా గవర్నరుగా ప్రకటించింది. 1956 నుండి 1957 వరకు ఒడిశా గవర్నరుగా పనిచేశాడు. ఆ తరువాత 1957 నుండి 1962 వరకు ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా పనిచేశాడు.

ఎమర్జెన్సీ కాలంలో, ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన ఇతర కాంగ్రేసు పాత తరం అసమ్మతి వర్గ నాయకులతో సహా, సచార్ అరెస్టయ్యి జైలుకు పంపించబడ్డాడు.[6]

వ్యక్తిగత జీవితం[మార్చు]

సచార్ చిన్నతనంలోనే తమ సమాజానికి చెందిన అమ్మాయిని పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నాడు. ఈయన కొడుకు రాజీందర్ సచార్ (జ.1923) ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[7] భారతదేశ మతపరమైన అల్పసంఖ్యాకుల స్థితిగతులపై వివిధాస్పదమైన నివేదిక సచార్ కమిటీ అధ్యుక్షుడు రాజీందర్ సచారే. ప్రముఖ పాత్రికేయుడు, వామపక్ష కార్యకర్త, శాంతికాముకుడైన కులదీప్ నయ్యర్, సచార్ అల్లుడు.

మూలాలు[మార్చు]

  1. Who's who: Punjab Freedom Fighters, Volume 1. Patiala: Punjabi University. 1972. Retrieved 19 June 2014.
  2. "Archived copy". మూలం నుండి 25 ఫిబ్రవరి 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 2 ఫిబ్రవరి 2012. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)CS1 maint: archived copy as title (link)
  3. http://www.mapsofindia.com/who-is-who/history/bhim-sen-sachar.html
  4. "B. S. Sachar". India Post. Retrieved 12 June 2014. Cite web requires |website= (help)
  5. "Archived copy". మూలం నుండి 13 ఫిబ్రవరి 2007 న ఆర్కైవు చేసారు. Retrieved 21 డిసెంబర్ 2006. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)CS1 maint: archived copy as title (link)
  6. Narasimha Rao, the Best Prime Minister? - Page 101 by Janak Raj Jai
  7. http://www.tribuneindia.com/2004/20041211/haryana.htm