కులదీప్ నయ్యర్
కులదీప్ నయ్యర్ | |
---|---|
జననం | సియాల్‌కోట్ | 1923 ఆగస్టు 14
మరణం | ఆగష్టు 23, 2018 ఢిల్లీ |
జాతీయత | భారతీయుడు |
విద్య | మెడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం |
వృత్తి | జర్నలిస్టు, రచయిత , కాలమిస్టు |
వెబ్‌సైటు | www.kuldipnayar.com/ |
కులదీప్ నయ్యర్ (జ. ఆగస్టు 14 1923, మ. ఆగష్టు 23 2018 ) భారతీయ జర్నలిస్టు, కాలమిస్టు, మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత. తన జీవితకాలంలో చాలాకాలం వామపక్ష రాజకీయ విశ్లేషకులుగా ఉన్నాడు. ఆయన 1997లో భారత పార్లమెంటు లోని రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు.
ప్రారంభ జీవితం , విద్య
[మార్చు]ఆయన బ్రిటిష్ ఇండియా లోని పంజాబ్ రాష్ట్రంలోని సియాల్ కోట్ లో 1923 ఆగస్టు 14న జన్మించాడు. ఆయన తల్లిదంద్రులు పూరన్‌దేవి, గుర్బక్ష్ సింగ్. లాహోర్ లోని ఫోర్మన్ క్రిస్టియన్ కళాశాలలో బి.ఎ. ఆనర్స్ పూర్తిచేసాడు. తరువాత లాహోర్ లోని లా కళాశాలలో ఎల్.ఎల్.బి పూర్తి చేసాడు.[1] 1952లో ఆయన నార్త్‌వెస్ట్ విశ్వవిద్యాలయం లోని మెడిల్ల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుండి జర్నలిజం చదివాడు.[2][3]
వృత్తి జీవితం
[మార్చు]నయ్యర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టరుగా పనిచేసాడు. 1975-77 లలో భారత ఎమర్జన్సీలో అరెస్టు అయ్యాడు.[4] ఆయన మానవహక్కుల ఉద్యమకారుడు, శాంతి ఉద్యమకారుడు. 1996లో ఐక్యరాజ్యసమితికి వెళ్ళిన భారతీయ సభ్యులలో ఒకడు.[4] ఆయన 1990లో గ్రేట్ బ్రిటన్ హై కమీషనరుగా నియమింపబడ్డాడు. 1997 ఆగస్టులో భారత పార్లమెంటులోని ఎగువ సభ అయిన రాజ్యసభకు నామినేట్ చేయబడ్డాడు.[4]
ఆయన 14 భాషలలోని 80 వార్తాపత్రికలలో "ఆప్-ఎడ్" (ఆపోజిట్ టు ద ఎడిటోరియల్) లో రచనలు చేసాడు, అనేక కాలమ్స్ రాసాడు.[4] ఆయన వ్రాసిన పత్రికలలో "ద డైలీ స్టార్", "ద సండే గార్డియన్",[5] "ద న్యూస్ పాకిస్తాన్",[6] "ద స్టేట్స్‌మన్(ఇండియా)" [7] "ఎక్స్‌ప్రెస్ ట్రిబూన్(పాకిస్తాన్)",[8] "డాన్ (పాకిస్తాన్)".[9] అనేవి ముఖ్యమైనవి. తెలుగు దినపత్రిక ఈనాడులో లోగుట్టు శీర్షికన ఆయన వ్యాసాలు ప్రచురితమౌతూంటాయి.
శాంతి ఉద్యమకారుడు
[మార్చు]2000 సంవత్సరం నుండి ప్రతీ యేటా ఆయన భారత, పాకిస్తాన్‌ల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా అమృత్ సర్ లోని ఆట్టారి- వాగా ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు వద్ద కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్నాడు.[10]
శిక్షాకాలం పూర్తయ్యాక కూడా విడుదల కాని భారతదేశ జైళ్ళలో ఉన్న పాకిస్తానీ ఖైదీలు, పాకిస్తాన్ లో ఉన్న భారత ఖైదీలను విడిపించడం కోసం నయ్యర్ పనిచేస్తున్నాడు.[11]
రాజకీయ వ్యాఖ్యాత
[మార్చు]నయ్యర్ రాజకీయ వ్యాఖ్యాతగా ప్రస్తుత రాజకీయ సమస్యలపై తన అభిప్రాయాలను వ్రాస్తున్నాడు.[12] ఆయన అన్నా హజారే చేసిన ఉద్యమానికి మద్దతు తెలిపాడు.[4] 1971లో తూర్పు పాకిస్తాన్ లో పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాలపై పాకిస్తాన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పకపోవటాన్ని నిరసించాడు. పాకిస్తాన్ దురాగతాలే చివరికి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసాయి.[13] భారతదేశానికి పాకిస్తాన్ నుండి స్మగుల్ అవుతున్న మాదకద్రవ్యాల పట్ల కూడా పాకిస్తాన్‌ను నిరసించాడు.[14]
రచయిత
[మార్చు]ఆయన 15 పుస్తకాలను రచించాడు. వాటిలో "బియాండ్ ద లైన్స్", "డిస్టంట్ నైబర్స్:అ టేల్ ఆఫ్ ద సబ్‌కాంటినెంట్", "ఇండియా ఆప్టర్ నెహ్రూ", "వాల్ ఎట్ వాగా, ఇండియా-పాకిస్తాన్ రిలేషన్‌షిప్", "ద జడ్జ్‌మెంట్", "ద మార్టిర్", "స్కూప్", "ఇండియా హౌస్" ముఖ్యమైనవి.
- నయ్యర్, కులదీప్ (1969). Beyond the lines. Allied Publishers. ASIN B0000E9UCO.
- నయ్యర్, కులదీప్ (1971). India – The Critical years. Vikas Publications. ASIN B0006BZSPA.
- నయ్యర్, కులదీప్ (1972). Distant Neighbours – A tale of the subcontinent. Vikas Publishing House Pvt Ltd. ISBN 978-0-7069-0194-8.
- నయ్యర్, కులదీప్ (1974). Suppression of judges. Indian Book Co.
- నయ్యర్, కులదీప్ (1975). India After Nehru. Vikas Publications. ISBN 978-0-7069-0366-9.
- నయ్యర్, కులదీప్ (1977). The Judgment:Inside story of the emergency in India. Vikas Publishing House. ASIN B0000D5MPX.
- నయ్యర్, కులదీప్ (1978). In Jail. Vikas Publishing House Pvt Ltd. ISBN 978-0-7069-0647-9.
- నయ్యర్, కులదీప్ (1980). Report on Afghanistan. Allied Publishers Ltd. ISBN 978-0-86186-503-1.
- నయ్యర్, కులదీప్; Singh, Khushwant (1985). Tragedy of Punjab: Operation Bluestar & After. South Asia Books. ISBN 978-0-8364-1248-2.
- నయ్యర్, కులదీప్ (1992). India House. Viking. ISBN 978-0-670-84432-6.
- నయ్యర్, కులదీప్ (2000). The Martyr : Bhagat Singh Experiments in Revolution. Har Anand Publications. ISBN 978-81-241-0700-3.
- నయ్యర్, కులదీప్ (2003). Wall at Wagah – India Pakistan Relations. Gyan Publishing House. ISBN 978-81-212-0829-1.
- నయ్యర్, కులదీప్ (2006). Scoop! : Inside Stories from Partition to the Present. HarperCollins. ISBN 978-81-7223-643-4.
- నయ్యర్, కులదీప్ (2007). Without Fear: The Life and Trial of Bhagat Singh. HarperCollins India. ISBN 978-81-7223-692-2.
- నయ్యర్, కులదీప్; Noorani, Asif; Page, David (2008). Tales of two cities. Lotus Roli. ISBN 978-81-7436-676-4.
ఇండియా: ది క్రిటికల్ ఇయర్స్ అనే తన పుస్తకంలో సున్నితమైన, గోప్యమైన సమాచారాన్ని వెల్లడించినందుకు అతడు కొందరు రాజకీయ నాయకుల కోపానికి గురయ్యాడు.[ఆధారం చూపాలి] నయ్యర్ సమకాలీన అంశాలపై విస్తృతంగా రాసాడు. జవహర్‌లాల్ నెహ్రూ, డేనియల్ స్మిత్, బ్యారీ మెయిన్‌లో వంటి చారిత్రిక వ్యక్తులపై కూడా రాసాడు. భారత పాకిస్తాన్‌ల ద్వైపాక్షిక సంబంధాలపై రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉండాలని అతడు చెబుతాడు. భారత పాకిస్తాన్‌లు మైత్రితో మెలగుతూ ఉండే దక్షిణాసియాను అతడు భావన చేస్తూ ఉంటాడు.[15][16]
అతడి ఆత్మకథ "బియాండ్ ది లైన్స్"[1] 2012 జూలైలో విడుదలైంది.[15]
1999లో నార్త్‌వెస్టర్న్ విశ్వవిద్యాలయం అతడిని అలుమ్నై మెరిట్ పురస్కారంతో గౌరవించింది.[1]
విమర్శ
[మార్చు]భారత వ్యతిరేక కుట్ర సిద్ధాంతాలను సమర్ధిస్తాడని కులదీప్ నయ్యర్‌పై విమర్శ ఉంది. .[3] 2010 ఫిబ్రవరిలో పాకిస్తాన్ పత్రిక డాన్‌లో రాస్తూ ఉగ్రవాద వ్యతిరేక పోలీసు దళ నాయకుడు హేమంత్ కర్కరేను హిందూ అతివాదులు చంపారని రాసాడు.[17] అమెరికాలో సయ్యద్ గులాం నబీ ఫై, పాకిస్తాన్ ఐఎస్‌ఐ నిధులతో నిర్వహించిన అనేక కార్యకక్రమాలకు ఆయన హాజరయ్యాడు. ఈ సంగతిని 2011 జూలైలో అమెరికా అధికార వర్గాలు ధ్రువీకరించాయి.[18]
అవార్డులు
[మార్చు]- 2003 ఆస్టర్ అవార్డ్ ఫర్ ప్రెస్ ఫ్రీడం [19]
- 2007 షాహీద్ నియోగీ మెమోరియల్ అవార్డ్ ఫర్ లైఫ్ టైం అచీవ్మెంటు [20]
- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 31వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ ప్రదానం.[21]
మరణం
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Kuldip Nayyer". Herald (Pakistan). Archived from the original on 30 జూన్ 2012. Retrieved 14 January 2012.
- ↑ "Hall of Achievement: Kuldip Nayar". Archived from the original on 14 ఆగస్టు 2011. Retrieved 14 January 2012.
- ↑ 3.0 3.1 "Nayar". Archived from the original on 25 జనవరి 2012. Retrieved 14 January 2012.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 "Governments to be blamed for Indo-Pak animosity: Kuldip Nayar". Daily News and Analysis. India. 31 July 2011. Retrieved 13 January 2012.
- ↑ Nayar, Kuldip. "LEADERS & MISLEADERS". The Guardian. Archived from the original on 11 జనవరి 2012. Retrieved 13 January 2012.
- ↑ Nayar, Kuldip. "All stories / articles Kuldip Nayar".
- ↑ {{url = http://www.thestatesman.com/news/opinion/geeta-should-have-opened-more-doors/100000.html /TodaysPrintWriterName.aspx?URL=Kuldip%20Nayar | work = The News International | accessdate =13 January 2012}}
- ↑ Nayar, Kuldip. "Stories by Kuldip Nayar". The Express Tribune. Retrieved 13 January 2012.
- ↑ Nayar, Kuldip. "Posts by Kuldip Nayar". Dawn (newspaper). Archived from the original on 2 జనవరి 2012. Retrieved 13 January 2012.
- ↑ "Who Has The Matches?". Outlook (India). 30 Aug 2010. Archived from the original on 29 మే 2012. Retrieved 13 January 2012.
- ↑ Vij, Shivam (11 January 2012). "Why is Gopal Das free and not Khalil Chishty?". The News International. Archived from the original on 11 జనవరి 2012. Retrieved 13 January 2012.
- ↑ Outlook Publishing (28 January 2008). Outlook. Outlook Publishing. p. 30. Retrieved 14 January 2012.
- ↑ Nayar, Kuldip (20 December 2011). "The birth of Bangladesh". The Express Tribune. Retrieved 13 January 2012.
- ↑ "Pakistan pushing drugs into Punjab: Kuldip Nayar". Sify. 12 January 2012. Archived from the original on 12 జనవరి 2012. Retrieved 13 January 2012.
- ↑ 15.0 15.1 "Kuldip Nayar's autobiography to be released on birthday in August". NewKerala. Retrieved 14 January 2012.
- ↑ "India, Pakistan press rue Kashmir deadlock". BBC. 7 September 2004. Retrieved 14 January 2012.
- ↑ Nayar, Kuldip (19 February 2010). "Politics of terrorism". Dawn (newspaper). Retrieved 14 January 2012.
- ↑ L'affaire Fai: US lawmakers, Indian liberals come under scrutiny Archived 2012-09-13 at the Wayback Machine Times of India – 20 July 2011
- ↑ "Award for Kuldip Nayar". The Hindu. 2003-03-01. Archived from the original on 2013-01-26. Retrieved 2012-09-29.
- ↑ "Kuldip Nayar presented lifetime achievement award". The Hindu. 2007-09-10. Archived from the original on 2007-09-16. Retrieved 2012-09-29.
- ↑ వైభవంగా వర్సిటీ స్నాతకోత్సవం[permanent dead link]