కొప్పుల హరీశ్వర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొప్పుల హరీశ్వర్ రెడ్డి

మాజీ శాసనసభ్యుడు
పదవీ కాలం
2009 - 2014
ముందు కమతం రాంరెడ్డి
తరువాత పి. రామ్మోహన్ రెడ్డి
నియోజకవర్గం పరిగి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 18 మార్చి 1947
పరిగి, వికారాబాదు జిల్లా, తెలంగాణ
మరణం 2023 సెప్టెంబరు 22(2023-09-22) (వయసు 76)
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి గిరిజాదేవి
సంతానం కొప్పుల మ‌హేష్ రెడ్డి , కొప్పుల అనిల్ రెడ్డి
నివాసం పరిగి , వికారాబాదు జిల్లా, తెలంగాణ

కొప్పుల హరీశ్వర్ రెడ్డి ( 1947 మార్చి 18 - 2023 సెప్టెంబరు 22) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పరిగి నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

కొప్పుల హరీశ్వర్ రెడ్డి 18 మార్చి 1947లో తెలంగాణ రాష్ట్రం , వికారాబాదు జిల్లా, పరిగి గ్రామంలో జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కొప్పుల హరీశ్వర్ రెడ్డి 1972 నుంచి 1977 వరకు పరిగి ఉప సర్పంచ్‌గా, 1977 నుంచి 1983 వరకు సర్పంచ్‌గా పని చేశాడు. ఆయన 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ షరీఫ్ చేతిలో 56 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు.[1] కొప్పుల హరీశ్వర్ రెడ్డి 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి, 1985లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ షరీఫ్ పై 32512 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

ఆయన 1986 - 1988 వరకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా , 1988 - 1989 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా పని చేశాడు. కొప్పుల హరీశ్వర్ రెడ్డి 1994 , 1999, 2004 , 2009లో పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1997 - 2003 వరకు రాష్ట్ర ఆర్ధిక సంస్థ అధ్యక్షుడిగా, 31 డిసెంబర్ 2001 నుండి 14 నవంబర్ 2003 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పని చేశాడు.

ఆయన తెలంగాణ ఉద్యమం సమయంలో 15 నవంబర్ 2012లో తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి పార్టీ టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితుడయ్యాడు. హరీశ్వర్ రెడ్డి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.రామ్మోహన్ రెడ్డి చేతిలో 5163 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. [2]

మరణం[మార్చు]

ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ 2023 సెప్టెంబరు 22న తుదిశ్వాస విడిచాడు.[3][4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (1 April 2014). "సర్పంచ్ పదవే సంతృప్తినిచ్చింది". Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.
  2. The Hans India (24 November 2018). "Koppula Harishwar Reddy inspects KCR meet venue" (in ఇంగ్లీష్). Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.
  3. "Koppula Harishwar Reddy: పరిగి ఎమ్మెల్యే తండ్రి, మాజీ ఉపసభాపతి కన్నుమూత | former deputy speaker and parigi mla father koppula harishwar reddy passed away". web.archive.org. 2023-09-23. Archived from the original on 2023-09-23. Retrieved 2023-09-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Namasthe Telangana (23 September 2023). "మాజీ డిప్యూటీ స్పీకర్‌ హరీశ్వర్‌రెడ్డి హఠాన్మరణం". Archived from the original on 23 September 2023. Retrieved 23 September 2023.