వై. బాలనాగిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వై. బాలనాగిరెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం మంత్రాలయం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 23 జూలై 1965
రాంపురం గ్రామం, మంత్రాలయం మండలం , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి, లలితమ్మ [1]
జీవిత భాగస్వామి వై.విజయమ్మ
బంధువులు వై.శివరామి రెడ్డి (అన్న), ఎల్లారెడ్డి సాయిప్రసాద్ రెడ్డి (అన్న) , ఎల్లారెడ్డి వెంకట్రామిరెడ్డి (తమ్ముడు) [2]
సంతానం ధరణీరెడ్డి, ప్రియాంక
నివాసం మంత్రాలయం

ఎల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మంత్రాలయం నియోజకవర్గం 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

వై. బాలనాగిరెడ్డి 1965 జూలై 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, మంత్రాలయం మండలం, రాంపురం గ్రామంలో ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి (మాజీ ఎమ్మెల్యే ఉరవకొండ), లలితమ్మ (మంత్రాలయం మండలం రాంపురం గ్రామ సర్పంచ్‌) దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు చదివాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

వై. బాలనాగిరెడ్డి 1989లో రాజకీయాల్లోకి వచ్చి రాంపురం సర్పంచ్‌గా, మంత్రాలయం సింగిల్‌ విండో అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2009లో మంత్రాలయం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెసు అభ్యర్థి దళవాయి రామయ్యపై 10,697 ఓట్ల మోజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో టీడీపీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి పై 7462 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

వై. బాలనాగిరెడ్డి 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి పై 23,879 ఓట్లతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (6 November 2019). "ఆ తల్లి కడుపున నలుగురు ఎమ్మెల్యేలు". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. V6 Velugu (27 May 2019). "అరుదైన రికార్డ్..ఒకే సారి ముగ్గురు అన్నదమ్ములు అసెంబ్లీకి" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (18 March 2019). "కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  4. Sakshi (2019). "Mantralayam Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.