గుమ్మిడి సంధ్యారాణి

వికీపీడియా నుండి
(గుమ్మడి సంధ్యా రాణి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గుమ్మిడి సంధ్యారాణి
గుమ్మిడి సంధ్యారాణి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూన్ 2024
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
4 జూన్ 2024 – ప్రస్తుతం
ముందు పీడిక రాజన్నదొర
నియోజకవర్గం సాలూరు

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2015 – 2021

వ్యక్తిగత వివరాలు

జననం (1973-03-15) 1973 మార్చి 15 (వయసు 51)
విజయనగరం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జన్ని ముత్యాలు
జీవిత భాగస్వామి జయ కుమార్
సంతానం పృద్వి, ప్రణతి
నివాసం 16-22, తెలుగు స్ట్రీట్, సాలూరు, విజయనగరం
పూర్వ విద్యార్థి బి.ఎస్.సి (ఎం.ఆర్. మహిళ కళాశాల, విజయనగరం), టి.టి.సి (డి.ఐ.ఈ.టి. కాలేజీ, విజయనగరం)

గుమ్మడి సంధ్యా రాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2015 నుండి 2021 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించింది. సంధ్యా రాణి జూలై 12న నారా చంద్రబాబునాయుడు నాలుగో మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సంధ్యారాణి 1973 మార్చి 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, విజయనగరంలో జన్ని ముత్యాలు, పార్వతమ్మ దంపతులకు జన్మించింది. ఆమె విజయనగరంలోని ఎం.ఆర్. మహిళ కళాశాల నుండి బీఎస్సీ పూర్తి చేసింది.

రాజకీయ జీవితం

[మార్చు]

సంధ్యారాణి కాంగ్రెస్ పార్టీ ద్వారా 1999లో రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పనిచేసింది. ఆమె 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సాలూరు నియోజక వర్గం నుండి పోటీ చేసి తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజేంద్ర ప్రతాప్ భంజ్ దేవ్ చేతిలో 14,970 ఓట్ల మెజారితో ఓడిపోయింది. ఆమె 1999 నుండి 2006 వరకు సాలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉంటూ 2005 నుండి 2007 వరకు రెండేళ్ల పాటు ఉత్తరాంధ్ర మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ కో ఆర్డినేటర్‌గా, 2007నుండి 2009 వరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యరాలిగా పనిచేసి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరింది.

సంధ్యారాణి 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సాలూరు నియోజక వర్గం నుండి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో 1656 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె 2014లో అరకు లోక్‌సభ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అనంతరం 2015లో తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికై, 2021 వరకు ఎమ్మెల్సీగా పనిచేసింది.[2] ఆమె 2020లో టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా,[3][4] అరకు పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా నియమితురాలైంది.[5]

సంధ్యారాణి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో సాలూరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొరపై 13733 ఓట్ల మెజారిటీ గెలిచి తొలిసారి శాసనసభకు ఎన్నికై,[6] జూలై 12న మహిళా & శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.[7][8][9][10]

మూలాలు

[మార్చు]
  1. EENADU (13 June 2024). "సంధ్యారాణి శ్రీనివాస్‌ అనే నేను." Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  2. The Hindu (9 October 2020). "MLC criticises government on Central Tribal University" (in Indian English). Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
  3. ETV Bharat News (20 October 2020). "తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలిగా గుమ్మడి సంధ్యారాణి". Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
  4. Prajasakti. "వైసిపి జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చింది : గుమ్మడి సంధ్యారాణి". Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
  5. The Hindu (28 September 2020). "TDP will return to power in 2024, say new in-charges" (in Indian English). Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
  6. Eenadu (5 June 2024). "కూటమి ప్రభంజనం". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  7. Eenadu (12 June 2024). "చంద్రబాబు టీమ్‌ ఇదే.. కొత్త మంత్రుల వివరాలు ఇలా." Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  8. BBC News తెలుగు (12 June 2024). "ఏపీ క్యాబినెట్‌లో మహిళా మంత్రులు.. ఒకప్పుడు ఏం చేసేవారు, ఇప్పుడు ఎలా మంత్రులయ్యారు". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  9. Andhrajyothy (12 June 2024). "టీచర్‌ టు మినిస్టర్‌". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  10. EENADU (14 June 2024). "పవన్‌కు పంచాయతీరాజ్‌... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.