Jump to content

పీడిక రాజన్నదొర

వికీపీడియా నుండి
పీడిక రాజన్నదొర

ఉప ముఖ్యమంత్రి
గిరిజన సంక్షేమశాఖ మంత్రి
పదవీ కాలం
2022 ఏప్రిల్ 11 – 2024

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2024
నియోజకవర్గం సాలూరు
ముందు రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1971
సన్యాసిరాజుపురం మరిపివలస, మక్కువ మండలం, పార్వతీపురం మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

పీడిక రాజన్నదొర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]రాజన్న దొర పీడిక 19 సెప్టెంబర్ 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్‌ కమిటీకి చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2][3] ఆయన 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితుడై, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి[4] సచివాలయంలోని రెండవ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ఏప్రిల్ 21న మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[5]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పీడిక రాజన్నదొర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, సన్యాసిరాజుపురం మరిపివలస గ్రామంలో 1971లో జన్మించాడు. ఆయన 1992లో ఆంధ్రా యూనివర్సిటీ నుండి పీజీ పూర్తి చేశాడు. అనంతరం కొంతకాలం ఆంధ్రప్రదేశ్ కో- ఆపరేటివ్ కార్పొరేషన్ బ్యాంక్ మేనేజర్ గా పని చేశాడు.[6]

రాజకీయ జీవితం

[మార్చు]

పీడిక రాజన్నదొర 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించాడు.

శాసనసభకు పోటీ
సంవత్సరం నియోజకవర్గం పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ఓడిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ ఫలితం
2004 సాలూరు ఎస్టీ రిజర్వ్‌డ్‌ రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ టీడీపీ 45982 పీడిక రాజన్నదొర కాంగ్రెస్ పార్టీ 48580 2598 ఓటమి
2009 సాలూరు పీడిక రాజన్నదొర కాంగ్రెస్ పార్టీ 49517 గుమ్మడి సంధ్యా రాణి టీడీపీ 47861 1656 గెలుపు
2014 సాలూరు పీడిక రాజన్నదొర వైసీపీ 63755 రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ టీడీపీ 58758 4997 గెలుపు
2019 సాలూరు పీడిక రాజన్నదొర వైసీపీ 78430 రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ టీడీపీ 58401 20029 గెలుపు[7]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "Salur Constituency Winner List in AP Elections 2019 | Salur Constituency MLA Election Results 2019". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  2. Sakshi (19 September 2019). "ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్‌ కమిటీ చైర్మన్‌గా పీడిక రాజన్నదొర". Sakshi. Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  3. Andrajyothy (9 July 2021). "మా గ్రామాలు ఏపీలో విలీనం చేయండి ఎమ్మెల్యే రాజన్నదొరకు ఒడిశా గిరిజనుల వినతి". a. Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  4. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  5. Sakshi (21 April 2022). "గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రాజన్న దొర బాధ్యతలు". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
  6. Andhra Jyothy (11 April 2022). "అనుభవానికి గుర్తింపు!" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
  7. Sakshi (2019). "Salur Constituency Winner List in AP Elections 2019 | Salur Constituency Election Results 2019". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.