బోలిశెట్టి శ్రీనివాస్
బోలిశెట్టి శ్రీనివాస్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
నియోజకవర్గం | తాడేపల్లిగూడెం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1962 తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | జనసేన పార్టీ | ||
తల్లిదండ్రులు | సత్యనారాయణ | ||
జీవిత భాగస్వామి | అనురాధ | ||
నివాసం | గణేష్ నగర్ రోడ్, తాడేపల్లిగూడెం |
బోలిశెట్టి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తాడేపల్లిగూడెం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]బొలిశెట్టి శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి 1981లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999లో తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2014లో టీడీపీలో చేరి 2014 నుండి 2019 వరకు మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేసి 2019లో జనసేన పార్టీలో చేరి 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2] బొలిశెట్టి శ్రీనివాస్ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తాడేపల్లిగూడెం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై 62492 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై,[3][4] నవంబర్ 12న శాసనసభలో విప్‌గా నియమితుడయ్యాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ EENADU (25 March 2024). "ఎన్నికల రేసులో గెలుపు గుర్రాలు". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Eenadu (12 November 2024). "ఏపీ శాసనసభలో చీఫ్‌విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో అనురాధ". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
- ↑ Eenadu (13 November 2024). "పశ్చిమ నేతలకు పదవుల హారం". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.