కొలికపూడి శ్రీనివాస రావు
కొలికపూడి శ్రీనివాస రావు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | కొక్కిలిగడ్డ రక్షణనిధి | ||
---|---|---|---|
నియోజకవర్గం | తిరువూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1969 తాడికొండ గ్రామం & పోస్ట్, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | కొలికపూడి సుబ్బారావు | ||
జీవిత భాగస్వామి | మాధవి (తెలంగాణ సచివాలయ ఉద్యోగి) | ||
సంతానం | ఒక కుమార్తె | ||
నివాసం | డోర్.నెం 20-95/1, హరిజనవాడ, తాడికొండ గ్రామం & పోస్ట్, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
కొలికపూడి శ్రీనివాస రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తిరువూరు నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2]
వృత్తి జీవితం
[మార్చు]కొలికపూడి శ్రీనివాస రావు ఎంఏ (ఇంగ్లిష్), పీహెచ్‌డీ పూర్తి చేసి 1997లో హైదరాబాద్‌లో కేఎస్ రావు ఐఏఎస్ అకాడమీ స్థాపించి డైరెక్టర్‌గా వ్యవహరించి, "గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కొలికపూడి శ్రీనివాస రావు రాజకీయాల పట్ల ఆసక్తితో టీడీపీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా,[3] అమరావతి ఐకాస కన్వీనర్‌గా నాలుగున్నరేళ్లు పని చేశాడు. ఆయన 2024 జనవరి 27న తెలుగుదేశం పార్టీలో చేరి,[4] 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తిరువూరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామి దాస్ పై 21874 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Eenadu (18 July 2023). "రాజధాని నుంచి రాజధానికి కొలికపూడి పాదయాత్ర". Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024.
- ↑ Eenadu (27 January 2024). "తెదేపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, కొలికపూడి". Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Tiruvuru". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.