వాసంశెట్టి సుభాష్
వాసంశెట్టి సుభాష్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 జూన్ 2024 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | రామచంద్రపురం | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రామచంద్రపురం, రామచంద్రపురం మండలం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | 1978 జూన్ 17||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | వైయస్ఆర్‌సీపీ | ||
తల్లిదండ్రులు | సత్యం, కృష్ణ కుమారి | ||
జీవిత భాగస్వామి | లక్ష్మి సునీత | ||
సంతానం | సత్య దివిత, సత్య దీక్షిత | ||
నివాసం | డి.నెం. 32-7-2, లలిత నగర్, ముచ్చుమిల్లి రోడ్ సాయి బాబాగుడి దగ్గర, రామచంద్రపురం, రామచంద్రపురం మండలం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
వాసంశెట్టి సుభాష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రామచంద్రపురం నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]వాసంశెట్టి సుభాష్ రాజకీయ నేపధ్యమున్న కుటుంబం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పని చేశాడు. ఆయన ఎస్‌ఏఎఫ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించాడు. 2022లో జరిగిన అమలాపురం అల్లర్ల ఘటన తర్వాత వైసీపీ నాయకులతో విభేదాలు రావడంతో ఆయన జనవరి 2024లో వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేశాడు.[4]
వాసంశెట్టి సుభాష్ ఆ తరువాత మండపేట 'రా కదలిరా' సభలో చంద్రబాబు సమక్షంలో జనవరి 20న తెలుగుదేశం పార్టీలో చేరి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రామచంద్రపురం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పై 26291 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై జూన్ 12న కార్మిక, కర్మాగార, బాయిలర్స్ & వైద్య బీమా సేవ శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి[5], 20న సచివాలయంలోని 5వ బ్లాక్‌లో మంత్రి బాధ్యతలు చేపట్టాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Ramachandrapuram". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ EENADU (18 January 2024). "సొంత పార్టీ నేతలే ఇబ్బందిపెట్టారు". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ EENADU (14 June 2024). "పవన్‌కు పంచాయతీరాజ్... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
- ↑ Andhrajyothy (19 June 2024). "గురువారం ఒక్కరోజే బాధ్యతలు స్వీకరించనున్న ఏడుగురు ఏపీ మంత్రులు". Archived from the original on 19 June 2024. Retrieved 19 June 2024.