యార్లగడ్డ వెంకటరావు

వికీపీడియా నుండి
(యార్లగడ్డ వెంకట రావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
యార్లగడ్డ వెంకట రావు
యార్లగడ్డ వెంకటరావు


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు వల్లభనేని వంశీమోహన్
నియోజకవర్గం గన్నవరం

వ్యక్తిగత వివరాలు

జననం 4 అక్టోబర్ 1975
పెనుమత్స, పమిడిముక్కల మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైయ‌స్ఆర్‌సీపీ
తల్లిదండ్రులు రామశేషగిరిరావు, లక్ష్మీసామ్రాజ్యం
జీవిత భాగస్వామి జ్ఞానేశ్వరి
సంతానం శ్రీ సహస్ర, సహర్ష్ రామ్
నివాసం డోర్ నెం: 11-3, యార్లగడ్డ గ్రాండియర్, బండర్ రోడ్, కెఎన్ఎల్‌ నగర్, పప్పుల మిల్ సెంటర్, కానూరు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

యార్లగడ్డ వెంకట రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

యార్లగడ్డ వెంకటరావు 1975 అక్టోబర్ 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలం, పెనుమత్స గ్రామంలో యార్లగడ్డ రామశేషగిరిరావు, లక్ష్మీసామ్రాజ్యం దంపతులకు జన్మించాడు. ఆయన బీఎస్సీ (ఐటీ ప్రొఫెషనల్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ) వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

యార్లగడ్డ వెంకటరావు 2017 నవంబరులో గన్నవరం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 ఎన్ని కల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ పై 838 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఆరు నెలలు పని చేసి 2019 డిసెంబరులో కృష్ణా జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా నియమితుడై 2021 జనవరి వరకు ఆ పదవిలో పని చేశాడు.

2019 ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల్లో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని విభేదించి వైసీపీకి మద్ధతు ప్రకటించడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన 18 ఆగస్టు 2023న వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసి[2][3] ఆ తరువాత హైదరాబాద్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి[4] ఆగస్టు 21న గన్నవరం నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[5][6]

యార్లగడ్డ వెంకటరావును ఆగస్టు 23న తెలుగుదేశం పార్టీ గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా నియమితుడై,[7] 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ పై 37,628 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై,[8][9][10] నవంబర్ 12న శాసనసభలో విప్‌గా నియమితుడయ్యాడు.[11][12]

మూలాలు

[మార్చు]
  1. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. The Hindu (18 August 2023). "Yarlagadda Venkata Rao decides to quit YSR Congress Party and join Telugu Desam" (in Indian English). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  3. EENADU (18 August 2023). "వైకాపాకు గుడ్‌బై.. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోనే జగన్‌ను కలుస్తా: యార్లగడ్డ వెంకట్రావు". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  4. Hindustantimes Telugu (21 August 2023). "టీడీపీలోకి యార్లగడ్డ…! చంద్రబాబుతో భేటీ". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  5. News18 తెలుగు (21 August 2023). "టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు.. వంశీపై పోటీకి సై..!". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. EENADU (22 August 2023). "తెదేపా గూటికి యార్లగడ్డ వెంకట్రావు". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  7. A. B. P. Desam (23 August 2023). "గన్నవరం టీడీపీ ఇన్‌చార్జ్‌గా యార్లగడ్డ - ఫుల్ చార్జ్ ఇచ్చేసిన లోకేష్ !". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  8. NTV Telugu (5 June 2024). "ఏపీలో మెజారిటీ వారీగా గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇదే.. టాప్ 3లో నారా లోకేష్!". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  9. Election Commision of India (7 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Gannavaram". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
  10. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  11. Eenadu (13 November 2024). "అసెంబ్లీ చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  12. Andhrajyothy (13 November 2024). "శాసనసభ చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.