బూరగడ్డ వేదవ్యాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
నియోజకవర్గం మల్లేశ్వరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 26 సెప్టెంబర్ 1959
భీమవరం , పశ్చిమ గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ , యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
జీవిత భాగస్వామి బి.విజయ లక్ష్మి
సంతానం కిషన్ తేజ్ [1]

బూరగడ్డ వేదవ్యాస్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే . ఆయన పెడన నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

బూరగడ్డ వేదవ్యాస్‌ 1959 సెప్టెంబరు 26లో భీమవరంలో జన్మించాడు. ఆయన 10వ తరగతి వరకు మచిలీపట్నంలో పూర్తి చేశాడు. వేదవ్యాస్‌ హైదరాబాద్ ఎ.వి.కాలేజ్ లో బి.ఎ పూర్తి చేసి, ఏలూరు లోని సీఏ కాలేజ్ నుండి బిఎల్ పూర్తి చేసి కొంతకాలం మచిలీపట్నంలో న్యాయవాదిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

బూరగడ్డ వేదవ్యాస్‌ 1985లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మల్లేశ్వరం నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత వెంకట్రావు పై 23801 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. బూరగడ్డ వేదవ్యాస్‌ 1993 డిసెంబరు 29 నుండి 1994 డిసెంబరు 10 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశాడు.

బూరగడ్డ వేదవ్యాస్‌ 2009లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2011 ఫిబ్రవరి 6న పీఆర్పీలో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వేదవ్యాస్ లో 2014 ఏప్రిల్ 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుండి పెడన నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. వేదవ్యాస్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2016 అక్టోబరు 22లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) చైర్మన్‌గా పనిచేశాడు.[3]

పోటీ చేసిన నియోజకవర్గాలు[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం పేరు నియోజకవర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు ఫలితం
2014 పెడన జనరల్ కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ 71779 బూరగడ్డ వేదవ్యాస్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 58085 గెలుపు
2004 మల్లేశ్వరం జనరల్ బూరగడ్డ వేదవ్యాస్‌ కాంగ్రెస్ పార్టీ 65300 కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ 41499 ఓటమి
1999 మల్లేశ్వరం జనరల్ కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ 49310 బూరగడ్డ వేదవ్యాస్‌ కాంగ్రెస్ పార్టీ 48641 గెలుపు
1994 మల్లేశ్వరం జనరల్ కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ 50791 బూరగడ్డ వేదవ్యాస్‌ కాంగ్రెస్ పార్టీ 42680 గెలుపు
1989 మల్లేశ్వరం జనరల్ బూరగడ్డ వేదవ్యాస్‌ కాంగ్రెస్ పార్టీ 48837 కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ 43839 ఓటమి
1985 మల్లేశ్వరం జనరల్ కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ 38518 బూరగడ్డ వేదవ్యాస్‌ కాంగ్రెస్ పార్టీ 37289 గెలుపు

మూలాలు[మార్చు]

  1. The Times of India (31 August 2016). "And Megastar showed up to wish this soon-to-be couple in Hyderabad - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
  2. Sakshi (12 April 2014). "వైఎస్ఆర్సీపీలోకి మాజీమంత్రి పార్థసారధి, వేదవ్యాస్". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
  3. Sakshi (28 August 2019). "'బూరగడ్డ వేదవ్యాస్‌' అవుట్‌". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.