ఐరేని లింగయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాజీ శాసనసభ సభ్యుడు
నియోజకవర్గం దొమ్మాట శాసనసభ నియోజకవర్గం (1978 -1988)

వ్యక్తిగత వివరాలు

జననం 1918
దుబ్బాక, సిద్ధిపేట జిల్లా , తెలంగాణ
మరణం 1 ఏప్రిల్ 1991
హైదరాబాదు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం హైదరాబాదు
మతం హిందూ

ఐరేని లింగయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశాడు.

జననం[మార్చు]

ఐరేని లింగయ్య మెదక్ జిల్లా, దుబ్బాక గ్రామంలో జన్మించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఐరేని లింగయ్య కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1958 నుండి 1972 వరకు ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ (శాసనమండలి) సభ్యుడిగా పనిచేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1978లో దొమ్మాట నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి సి.రామారావు పై 4084 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఐరేని లింగయ్య 1982 సెప్టెంబరు 8 నుండి 1982 జనవరి 7 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1983లో దొమ్మాట శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి దెమ్మట రామచంద్ర రెడ్డి పై 369 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2]

1978 ఫలితాలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (1978) :దొమ్మాట శాసనసభ నియోజకవర్గం )
Party Candidate Votes % ±%
కాంగ్రెస్ పార్టీ ఐరేని లింగయ్య 24260 39.12%
జనతా పార్టీ సి.రామారావు 20176 32.54%

మూలాలు[మార్చు]

  1. Sakshi (10 November 2018). "అన్నలు నడయాడిన నేల". Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.
  2. Sakshi (9 January 2020). "దిగ్గజ నాయకుల పుట్టిల్లు". Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.