Jump to content

గాలి భానుప్రకాష్

వికీపీడియా నుండి
గాలి భానుప్రకాష్

గాలి భానుప్రకాష్ ఆంధ్రప్రదేశ్ కి చెందిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మాజీ మంత్రి టిడిపి సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నగరి శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి రోజా చేతిలో పరాజయం పాలయ్యాడు. 2024 శాసనసభ ఎన్నికల్లో నగరి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు.[1][2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన గాలి భానుప్రకాష్ 45,004 ఓట్ల మెజారిటీతో ఆర్కే రోజాపై గెలుపొందారు[3].

జీవిత విశేషాలు

[మార్చు]

భానుప్రకాష్ 1991 లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పాఠశాల విద్య పూర్తి చేశాడు. 1993 లో వికాస్ జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. 1997 లో ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయిన ఎంజె కాలేజ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, 2000 సంవత్సరంలో అమెరికాలోని బ్రిడ్జ్‌పోర్ట్ విశ్వవిద్యాలయం నుంచి పిజి సాధించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "పుత్తూరులో 'ప్రజాగళం' రేపు". EENADU. Retrieved 2024-03-26.
  2. Vennelakanti, Pradeep (2024-02-25). "Tirupati: TDP names 3 new faces from Chittoor in first list". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-26.
  3. "Nagari Assembly Election Results 2024 LIVE: మంత్రి రోజా ఘోరమైన ఓటమి.. టీడీపీ అభ్యర్థి భానుకు భారీ మెజాార్టీ". Samayam Telugu. Retrieved 2024-06-05.
  4. "Gali Bhanu Prakash(TDP):Constituency- NAGARI(CHITTOOR) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-03-26.