ఆరణి శ్రీనివాసులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరణి శ్రీనివాసులు (జంగాలపల్లి శ్రీనివాసులు)

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం చిత్తూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 15 మే 1952
జంగాలపల్లి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ Indian Election Symbol Ceiling Fan.svg వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీ
తల్లిదండ్రులు కృష్ణయ్య
జీవిత భాగస్వామి ఆరణి సత్యవతి
సంతానం 2

ఆరణి శ్రీనివాసులు (జంగాలపల్లి శ్రీనివాసులు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఆరణి శ్రీనివాసులు 15 మే 1952లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, జంగాలపల్లిలో జన్మించాడు. ఆయన బీఏ వరకు చదువుకున్నాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

ఆరణి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి సుదీర్ఘకాలం పార్టీలో పని చేశాడు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి చిత్తూరు నియోజకవర్గం నుండి పి.ఆర్.పి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీకే బాబు చేతిలో 1500 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వడంతో ఆయన తిరిగి టీడీపీలో చేరి తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

ఆరణి శ్రీనివాసులు 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించిన దక్కలేదు దీనితో ఆయన పార్టీకి రాజీనామా చేసి 8 ఏప్రిల్ 2014న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3] అయన 2014లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి డి‌ఏ సత్యప్రభ చేతిలో 6799 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయన 2019లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఏఎస్‌ మనోహర్‌ పై 39968 ఓట్ల మెక్జారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  3. Sakshi (9 April 2014). "బాబుకు జేఎంసీ షాక్". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.
  4. Sakshi (2019). "Chittoor Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.